వెంకీతో మరో సీక్వెలా?
దర్శకుడు అనిల్ రావిపూడి ఇప్పటికే ఓ కాన్సెప్ట్ సిద్ధం చేశారని, అది వెంకటేష్‌కు చెప్పగానే ఆయన ఓకే చెప్పినట్టు టాక్.
By: Tupaki Desk | 25 Jun 2025 5:00 AM ISTవిక్టరీ వెంకటేష్ హీరోగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా థియేటర్లలో గ్రాండ్ హిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అంచనాలను మించి విజయం సాధించింది. థియేటర్లలో 300 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి, ఓటీటీలోనూ అద్భుతమైన వ్యూయింగ్ రికార్డులు నమోదు చేసింది.
ముఖ్యంగా జీ5లో విడుదలైన కొన్ని గంటల్లోనే మిలియన్ వ్యూస్‌తో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. ఈ విజయంతో హ్యాపీ అయిన నిర్మాతలు ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం 2కి సన్నాహాలు మొదలుపెట్టినట్టు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ పార్ట్ 2పై దిల్ రాజు బ్యానర్‌కి చెందిన బృందం ఇప్పటికే చర్చలు మొదలుపెట్టినట్టు సమాచారం.
దర్శకుడు అనిల్ రావిపూడి ఇప్పటికే ఓ కాన్సెప్ట్ సిద్ధం చేశారని, అది వెంకటేష్‌కు చెప్పగానే ఆయన ఓకే చెప్పినట్టు టాక్. ఈ సీక్వెల్‌లో కొనసాగింపుగా ఉండే కథే కాకుండా, మరింత, మసాలా ఎలిమెంట్స్ కలిగి ఉండేలా స్క్రిప్ట్ రూపుదిద్దుకుంటోందట. వెంకటేష్ ఈ సినిమా కోసం వచ్చే ఏడాది మొదట్లో డేట్స్ కేటాయించే అవకాశముందని అప్పుడే గాసిప్స్ పుట్టుకొస్తున్నాయి.
ప్రస్తుతం దర్శకుడు అనిల్ మెగాస్టార్ చిరంజీవి సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. ఇక సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయనున్నారు. అనిల్ ఇప్పటికే F2 సీరీస్ తో మంచి సక్సెస్ అందుకున్నాడు. అలాగే ఇప్పటివరకు ఒక్క ఫెయిల్యూర్ కూడా చూసింది లేదు. అలాంటి దర్శకుడు మరొక సీక్వెల్ సెట్ చేస్తే పక్కాగా బాక్సాఫీస్ వద్ద బిగ్ హిట్ గా నిలుస్తుందని చెప్పవచ్చు.
ఇక సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో ముఖ్యంగా వెంకటేష్ కామెడీ టైమింగ్ ఫ్యామిలీ ఎలిమెంట్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అలాగే మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌కు కూడా విశేషంగా ప్రశంసలు లభించాయి. ఈ బ్లాక్‌బస్టర్ సక్సెస్‌కి కొనసాగింపుగా వచ్చే రెండో భాగం కోసం ప్రేక్షకుల్లో ఇప్పటికే ఆసక్తి మొదలైపోయింది. వెంకటేష్‌తో పాటు మొదటి పార్ట్ టీమ్‌లోని మరికొంతమంది పాత్రల్ని తిరిగి తీసుకునే అవకాశం కూడా ఉందట. సంక్రాంతికి వస్తున్నాం 2పై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. చూడాలి మరి రావిపూడి సెకండ్ సీక్వెల్ ఏ స్థాయిలో ఉంటుందో.
