Begin typing your search above and press return to search.

టాప్ -10 లో నెం-1 ఎవ‌రు?

టాప్ -10 భామా మ‌ణుల్లో నెంబ‌ర్ వ‌న్ అయ్యేది ఎవ‌రు? తొమ్మిది మందిని వెన‌క్కి నెట్టి ముందుకొచ్చేది ఎవ‌రు? ఎవ‌రు ఆ ల‌క్కీ గాళ్? ఇంత‌కీ ఇదంతా ఏ జాబితాకి సంబంధించింది అంటే వివ‌రాల్లోకి వెళ్లా ల్సిందే.

By:  Tupaki Desk   |   7 Jan 2024 3:00 AM GMT
టాప్ -10 లో నెం-1  ఎవ‌రు?
X

టాప్ -10 భామా మ‌ణుల్లో నెంబ‌ర్ వ‌న్ అయ్యేది ఎవ‌రు? తొమ్మిది మందిని వెన‌క్కి నెట్టి ముందుకొచ్చేది ఎవ‌రు? ఎవ‌రు ఆ ల‌క్కీ గాళ్? ఇంత‌కీ ఇదంతా ఏ జాబితాకి సంబంధించింది అంటే వివ‌రాల్లోకి వెళ్లా ల్సిందే. సంక్రాంతి కానుక‌గా వ‌రుస‌గా సినిమాలు రిలీజ్ అవుతున్న సంగ‌తి తెలిసిందే. జ‌న‌వ‌రి 12 నుంచే జాత‌ర మొద‌ల‌వ్వ‌బోతుంది. 'గుంటూరు కారం'.. 'సైంధ‌వ్'.. 'నా సామీ రంగ‌'..'హ‌నుమాన్' ఇలా వ‌రుస‌గా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.

'గుంటూరు కారం'లో శ్రీలీల.. మీనాక్షి చౌదరి న‌టిస్తుండ‌గా. 'హనుమాన్' లో అమృత అయ్యర్ .. 'సైంధవ్' లో ఏకంగా ముగ్గురు హీరోయిన్స్ ఉన్నారు. శ్రద్ధ శ్రీనాథ్.. రుహాణి శర్మ.. ఆండ్రియా నటిస్తున్నారు. 'నా సామిరంగ' లో కూడా ముగ్గురు భామ‌లున్న సంగ‌తి తెలిసిందే. కన్నడ భామ ఆషిక రంగనాధ్.. మిర్నా మీనన్.. రుక్సార్ థిల్లాన్ లు నటిస్తున్నారు. ఇలా ఇంత మంది భామ‌ల‌తో థియేట‌ర్ల‌న్నీ క‌ళ‌క‌ళలాడ‌బో తున్నాయి.

శ్రీలీల ఇప్ప‌టికే పుల్ ఫామ్ లో ఉంది. వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతుంది. మీనాక్షి కూడా స‌క్సెస్ లోనే క‌నిపిస్తుంది. ఇద్దరు ఒకే సినిమాతో ఒక‌రికొక‌రు పోటీ ప‌డుతున్నారు. దీంతో ఇద్ద‌రి మ‌ధ్య నువ్వా? నేనా? అన్న సన్నివేశం క‌నిపిస్తుంది. శ్ర‌ద్దా శ్రీనాధ్..రుహానీ..ఆండ్రియో కొంత గ్యాప్ త‌ర్వాత కంబ్యాక్ అవుతుంది. ముగ్గురు స‌క్సెస్ కోసం ఎదురు చూస్తున్నారు. హిట్ అందుకుని రేసులో నిల‌వాల‌ని చూస్తున్నారు.

మిగ‌తా భామ‌లు అదే ఉత్సాహంతో క‌నిపిస్తున్నారు. ఇలా ఇంత మంది భామ‌లు పోటీ ప‌డుతున్నారు. దీంతో సంక్రాంతి రేసులో నిలిచేది ఎవ‌రు? భారీ వ‌సూళ్ల‌తో ఏ భామ నెంబ‌ర్ వ‌న్ గా నిలుస్తుంది? అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.