Begin typing your search above and press return to search.

2026 సంక్రాంతి క్లాష్.. ఇది పరిస్థితి!

సంక్రాంతి పండక్కి కోడి పందాలు ఓ రేంజ్ లో జరుగుతుంటాయన్న విషయం తెలిసిందే. అదే స్థాయిలో సినీ పందాలు కూడా జరుగుతుంటాయి.

By:  Tupaki Desk   |   23 Jun 2025 10:00 PM IST
2026 సంక్రాంతి క్లాష్.. ఇది పరిస్థితి!
X

సంక్రాంతి పండక్కి కోడి పందాలు ఓ రేంజ్ లో జరుగుతుంటాయన్న విషయం తెలిసిందే. అదే స్థాయిలో సినీ పందాలు కూడా జరుగుతుంటాయి. సినిమాలను ఆ టైమ్ లోనే రిలీజ్ చేసి హిట్ కొట్టాలని హీరోలందరూ చూస్తుంటారు. పొంగల్ కు మించిన సీజన్.. మరొకటి ఉండదని అటు హీరోలు.. ఇటు మేకర్స్ అంతా భావిస్తుంటారు.

యావరేజ్ మూవీ కూడా హిట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. నార్మల్ డేస్ లో వచ్చిన వసూళ్లు కంటే.. సంక్రాంతికి ఎక్కువ కలెక్షన్లు వస్తుంటాయి. అందుకే కచ్చితంగా సంక్రాంతికి రిలీజ్ చేయాలని చూస్తుంటారు. అందుకు ముందుగానే కర్చీఫులు వేస్తుంటారు. ఇప్పుడు 2026 సంక్రాంతి లైనప్ ఇప్పటికే ఫిల్ అయిపోయింది. సౌత్ స్టార్ హీరోలు సిద్ధమవుతున్నారు.

2026 సంక్రాంతికి గాను కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్, టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజతోపాటు యూత్ హీరో నవీన్ పోలిశెట్టి ప్రేక్షకుల ముందుకు రానున్నారు. తమ సినిమాలతో సందడి చేసేందుకు రెడీ అవుతున్నారు. బిగ్గెస్ట్ హిట్స్ అందుకుని సత్తా చాటాలని ఆయా హీరోలు ఇప్పుడు ఉవ్విళ్లూరుతున్నారు.

చిరంజీవి మెగా 157 ప్రాజెక్ట్ తో పొంగల్ కు మరోసారి వచ్చేందుకు రెడీ అవుతున్నారు. నయన తార హీరోయిన్ గా నటిస్తున్న ఆ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల సంయుక్తంగా నిర్మిస్తున్న ఆ చిత్రం.. సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.

నవీన్ పోలిశెట్టి అనగనగా ఒక రాజు మూవీతో జనవరి 14వ తేదీన థియేటర్స్ లోకి రానున్నారు. రొమాంటిక్ కామెడీ జోనర్ లో రూపొందుతున్న ఆ సినిమాలో మీనాక్షీ చౌదరి హీరోయిన్ గా నటిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మిస్తున్న ఆ సినిమాపై ఆడియన్స్ తోపాటు సినీ ప్రియుల్లో ఇప్పటికే పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది.

రవితేజ హీరోగా నటిస్తున్న ర‌వితేజ 76 ప్రాజెక్ట్ కూడా సంక్రాంతికే రానుంది. కిషోర్ తిరుమ‌ల దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమాను ఎస్ఎల్‌ వీ సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. మరోవైపు, దళపతి విజయ్ నటిస్తున్న జననాయకుడు కూడా సంక్రాంతి కానుకగానే రానుంది. జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగులో కూడా విడుదల కానుంది. మరి ఆయా సినిమాలు ఎలాంటి హిట్ అవుతాయో వేచి చూడాలి.