Begin typing your search above and press return to search.

స్టార్ మేక‌ర్ సంచ‌ల‌న మ‌ల్టీస్టార‌ర్

ఈ సినిమా ఇదే ఏడాది ప‌ట్టాలెక్కే అవ‌కాశం ఉంది. తాజాగా భ‌న్సాలీ ఓ భారీ మ‌ల్టీస్టార‌ర్ తెర‌కెక్కించ డానికి రెడీ అవుతున్న‌ట్లు స‌మాచారం

By:  Tupaki Desk   |   24 Jan 2024 2:30 PM GMT
స్టార్ మేక‌ర్ సంచ‌ల‌న మ‌ల్టీస్టార‌ర్
X

స్టార్ మేక‌ర్ సంజ‌య్ లీలా భన్సాలీ సంచ‌ల‌న మ‌ల్టీస్టార్ కి రంగం సిద్దం చేస్తున్నారా? ఆయ‌న నుంచి వ‌రుస‌గా ప్ర‌తిష్టాత్మ‌క చిత్రాలు రాబోతున్నాయా? అంటే అవున‌నే తెలుస్తోంది. ఇప్ప‌టికే షారుక్ ఖాన్ తో 'ఇన్షా అల్లా' అనే రొమాంటిక్ చిత్రాన్ని తెర‌కెక్కించ‌డానికి భ‌న్సాలీ రెడీ అవుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా ప్ర‌క‌న‌ట‌తోనే భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఆ కాంబినేష‌న్ లో సినిమా చూడాల‌ని అభిమా నులు ఎప్ప‌టి నుంచో క‌ల‌లు కంటోన్న స‌మ‌యంలో వ‌చ్చిన ప్ర‌క‌ట‌న అది.

ఈ సినిమా ఇదే ఏడాది ప‌ట్టాలెక్కే అవ‌కాశం ఉంది. తాజాగా భ‌న్సాలీ ఓ భారీ మ‌ల్టీస్టార‌ర్ తెర‌కెక్కించ డానికి రెడీ అవుతున్న‌ట్లు స‌మాచారం. ర‌ణ‌బీర్ క‌పూర్...విక్కీ కౌశ‌ల్ హీరోల‌గా అలియాభ‌ట్ హీరోయిన్ గా ఈ చిత్రం తెర‌కెక్క‌నుందిట‌. ఇదొక ట్ర‌యాంగిల్ ల‌వ్ స్టోరీ అని వినిపిస్తుంది. ఇద్ద‌రు దంప‌తుల మ‌ధ్య జ‌రిగే ఈ స్టోరీ ఎంతో ఇంట్రెస్టింగ్ ఉంటుందిట‌. ఇప్ప‌టికే అలియా..ర‌ణ‌బీర్ క‌థ విని ఒకే చేసినట్లు స‌మాచారం.

అయితే తెర‌పై ఎవ‌రు భార్య భ‌ర్త‌లుగా క‌నిపిస్తారు? అన్న‌ది ఆస‌క్తిక‌రం. రియ‌ల్ లైఫ్ లో ర‌ణ‌బీర్-అలియా భార్య‌భ‌ర్త‌లు అని అంద‌రికీ తెలిసిందే. కానీ రీల్ లైఫ్ లో అలియా ఎవ‌రికి భార్య‌గా న‌టిస్తుంది? అన్న‌ది స‌స్పెన్స్. ఈ చిత్రాన్ని న‌వంబ‌ర్ లో సెట్స్ కి తీసుకెళ్లాల‌ని భ‌న్సాలీ భావిస్తున్నారుట‌. ప్ర‌స్తుతం ర‌ణ‌బీర్..విక్కీ..అలియా వేర్వేరు ప్రాజెక్ట్ ల‌తో బిజీగా ఉన్నారు. అలాగే సంజ‌య్ లీలా భ‌న్సాలీ షారుక్ ఖాన్ హీరోగా ఇన్షా అల్లాని కూడా పూర్తి చేయాలి.

అంటే న‌వంబ‌ర్ లోపు ఆ సినిమా పూర్తి చేసి త‌దుప‌రి ఈ ల‌వ్ స్టోరీ ని సెట్స్ కి తీసుకెళ్ల‌నున్నార‌ని తెలుస్తోంది. సంజ‌య్ లీలా భ‌న్సాలీ గ‌త సినిమా గంగూబాయి క‌తియావాడి ఎలాంటి విజ‌యం సాధిం చిందో తెలిసిందే. ఈ సినిమాలో గంగూబాయి గా అలియా భ‌ట్ అభిన‌యించిన తీరు విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు తెచ్చిపెట్టింది. జాతీయ ఉత్త‌మ న‌టిగానూ అలియాని ఈ చిత్రం నిలిపిన సంగ‌తి తెలిసిందే.