Begin typing your search above and press return to search.

ఇంత రొటీన్ రోల్స్ వద్దు భాయ్

అయితే ఇప్పుడు హీరో పాత్రలని పూర్తిగా పక్కన పెట్టి తనని తాను డిఫరెంట్ గా ప్రాజెక్ట్ చేసుకునే ప్రయత్నంలో సంజయ్ దత్ ఉన్నారు

By:  Tupaki Desk   |   14 Aug 2023 4:48 AM GMT
ఇంత రొటీన్ రోల్స్ వద్దు భాయ్
X

బాలీవుడ్ లో కల్నాయక్ అనే ఇమేజ్ తెచ్చుకున్న హీరో సంజయ్ దత్. ఆయన నుంచి చాలా సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. అయితే ఇప్పుడు హీరో పాత్రలని పూర్తిగా పక్కన పెట్టి తనని తాను డిఫరెంట్ గా ప్రాజెక్ట్ చేసుకునే ప్రయత్నంలో సంజయ్ దత్ ఉన్నారు. కేవలం హిందీకి మాత్రమే పరిమితం కాకుండా ఇతర భాషలకి తన బ్రాండ్ ని ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నారు.

అందులోభాగంగా ఇప్పటికే కేజీఎఫ్ చాప్టర్ 2లో అధీరా పాత్రతో సంజయ్ దత్ సౌత్ ప్రేక్షకులకి చేరువ అయ్యారు. ఈ పాత్రలో కరుడుగట్టిన రాక్షసుడి తరహాలో అతని రూపం, ఆహార్యం ఉండి అందరిని భయపెట్టింది. దీంతో కేజీఎఫ్ 2 తర్వాత సంజయ్ దత్ కి సౌత్ లో అవకాశాలు పెరిగాయి. ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ లియో మూవీలో మాఫియా డాన్ గా కనిపించబోతున్నారు.

అలాగే రామ్ పోతినేని హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమాలో సంజయ్ దత్ విలన్ గా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ షెడ్యూల్స్ లో ఆయన పాల్గొన్నారు. డబుల్ ఇస్మార్ట్ రెండో షెడ్యూల్ తాజాగా ఫినిష్ అయ్యింది. పాన్ ఇండియా సినిమాల ట్రెండ్ ప్రస్తుతం నడుస్తోన్న నేపథ్యంలో హిందీ స్టార్స్ కి సౌత్ సినిమాలలో అవకాశాలు బాగానే వస్తున్నాయి.

సంజయ్ దత్ ప్రస్తుతం సౌత్ లో ఎక్కువ డిమాండ్ ఉన్న యాక్టర్ గా ఉన్నారు. అయితే అతను ఏ స్థాయిలో మూవీ సక్సెస్ కి హెల్ప్ అవుతారనేది లియో, డబుల్ ఇస్మార్ట్ తో క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా కోసం సంజయ్ దత్ ని ఎంపిక చేసినట్లు ప్రచారం నడుస్తోంది.

ఓవరాల్ గా సంజయ్ దత్ కి మాత్రం ప్రస్తుతం సౌత్ సినిమాలలో పెద్దపీట లభిస్తోంది. అయితే రొటీన్ గా విలన్ పాత్రలకి మాత్రమే పరిమితం అయితే బోరింగ్ గా మారే అవకాశం ఉందనే మాట వినిపిస్తోంది. మరి క్యారెక్టరైజేషన్స్ లో సౌత్ చిత్రాలలో కూడా కొత్తగా సంజయ్ దత్ ట్రై చేస్తారా లేకా విలన్ గానే పరిమితం అవుతారా అనేది చూడాలి.