Begin typing your search above and press return to search.

రాజ‌కీయాల్లోకి సంజ‌య్ ద‌త్?

ప్ర‌స్తుతం దత్ సినిమాల‌తో కెరీర్ ప‌రంగా క్ష‌ణం తీరిక లేనంత బిజీగా ఉన్నారు.

By:  Tupaki Desk   |   10 April 2024 1:30 AM GMT
రాజ‌కీయాల్లోకి సంజ‌య్ ద‌త్?
X

ఖ‌ల్ నాయ‌క్‌గా, మున్నాభాయ్‌గా, అధీరాగా విల‌క్ష‌ణ పాత్ర‌ల్లో న‌టించిన సంజ‌య్ ద‌త్ కి దేశ‌వ్యాప్తంగా ఫాలోయింగ్ ఉంది. ఆయ‌న వివాదాస్ప‌ద జీవితం తెరిచి ఉంచిన పుస్త‌కం. టాడా కేసులో అరెస్ట‌యి జైలు జీవితం గ‌డిపిన‌ త‌ర్వాత సంజూ భాయ్ తిరిగి న‌టుడిగా కంబ్యాక్ అయిన తీరు ఎంతో ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంది. ప్ర‌స్తుతం దత్ సినిమాల‌తో కెరీర్ ప‌రంగా క్ష‌ణం తీరిక లేనంత బిజీగా ఉన్నారు.

ఇంత‌లోనే సంజయ్ దత్ రాజకీయాల్లోకి ప్ర‌వేశిస్తున్నార‌ని క‌థ‌నాలు వ‌చ్చాయి. దత్ రాబోయే లోక్‌సభ ఎన్నికలలో బహుశా హర్యానాలోని కర్నాల్ స్థానం నుండి పోటీ చేయవచ్చని ఊహాగానాలు వచ్చాయి. దీనిపై తాజాగా సంజూభాయ్ స్పందించారు. తాను రాజ‌కీయాల్లోకి వచ్చే అవకాశంపై వస్తున్న పుకార్లను ఖండించారు. నేను ఏ పార్టీలో చేరడం లేదు లేదా ఎన్నికల్లో పోటీ చేయడం లేదు అని క్లారిటీగా చెప్పేసాడు. దయచేసి ప్రస్తుతం నా గురించి ప్రచారంలో ఉన్న వార్తలను నమ్మకండి. వాటిని న‌న్ను అడిగి ధృవీక‌రించుకోండి అని కూడా ద‌త్ అన్నారు.

సంజయ్ ద‌త్ పై ఇలాంటి పుకార్లు ఇదే మొదటిసారి కాదు. 2019లో తాను రాష్ట్రీయ సమాజ్ పక్ష్ పార్టీలో చేరుతున్నట్లు వచ్చిన ఆరోపణలను ఆయన ఖండించారు. త‌న‌ కుటుంబ నేపథ్యం దృష్ట్యా ఇలాంటి రిపీటెడ్ ఊహాగానాలు చాలా స‌హ‌జం. అతడి దివంగత తండ్రి సునీల్ దత్ కాంగ్రెస్ పార్టీకి పార్లమెంటు సభ్యుడు. అతడి సోదరి ప్రియా దత్ ముంబై నుండి కాంగ్రెస్ మాజీ ఎంపీ. సంజయ్ దత్ స్వయంగా 2009లో లక్నో లోక్‌సభ స్థానానికి సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థిగా కొంతకాలం రాజకీయాల్లోకి ప్రవేశించారు. అయితే ఆయుధ చట్టానికి సంబంధించిన కోర్టు నిర్ణయంతో ఆయన తన అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకున్నారు. ఆ తర్వాత పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమితులైనప్పటికీ కొద్దిరోజుల‌కే రాజీనామా చేశారు.

ప్రస్తుతం దత్ తన సినీ కెరీర్‌పై దృష్టి సారించాడు. కేజీఎఫ్ 2తో సౌత్ లో ప్ర‌వేశించాడు. అధీరాగా మెప్పించాక ఇక్క‌డ‌ ఫుల్ బిజీ అయ్యాడు. అతను బాప్.. వెల్ కమ్ టు ది జంగిల్‌ సహా ప‌లు భారీ ప్రాజెక్ట్‌ల్లో న‌టిస్తున్నాడు. ఇవ‌న్నీ త్వ‌ర‌లో విడుద‌ల‌కు రావాల్సి ఉంది.