Begin typing your search above and press return to search.

#భీష్మ టీమ్.. అధీరాతోనే పెట్టుకున్నారు!

భీష్మతో బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకున్న‌ నితిన్- వెంకీ కుడుముల క‌ల‌యిక‌లో రూపొందిస్తున్న త‌దుప‌రి చిత్రంలో సంజ‌య్ ద‌త్ న‌టించ‌నున్నార‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

By:  Tupaki Desk   |   12 Feb 2024 4:39 AM GMT
#భీష్మ టీమ్.. అధీరాతోనే పెట్టుకున్నారు!
X

కేజీఎఫ్ 2లో అధీరాగా భీక‌ర అవ‌తారంతో గ‌గుర్పాటుకు గురిచేసే న‌ట‌నాభిన‌యంతో ట్రెండ్ క్రియేట్ చేసాడు సంజ‌య్ ద‌త్. అంత‌కుముందు ఖ‌ల్ నాయ‌క్ గా.. మున్నాభాయ్ ఎంబీబీఎస్ గా అత‌డు విల‌క్ష‌ణ పాత్ర‌ల‌తో చెర‌గ‌ని ముద్ర వేసిన‌ సంగ‌తి తెలిసిందే. హృతిక్ రోష‌న్ అగ్నిప‌థ్ లో భీక‌ర‌మైన యాక్ష‌న్ రోల్ తోను సంజూభాయ్ అల‌రించాడు.

ఇప్ప‌టికిప్పుడు దత్ ప‌లు ద‌క్షిణాది చిత్రాల్లో కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తూ సౌత్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతున్నాడు. కేజీఎఫ్ అధీరాగా అల‌రించాక అత‌డు కెరీర్ ప‌రంగా మ‌రింతగా దూసుకుపోతున్నాడు. సౌత్ లో ఒక్కో ప్రాజెక్టుకు 10 కోట్లు పైగా పారితోషికం అందుకుంటున్న సంజ‌య్ ద‌త్ త‌దుప‌రి మ‌రో క్రేజీ ప్రాజెక్టులో నటించ‌నున్న‌ట్టు క‌థ‌నాలొస్తున్నాయి.

భీష్మతో బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకున్న‌ నితిన్- వెంకీ కుడుముల క‌ల‌యిక‌లో రూపొందిస్తున్న త‌దుప‌రి చిత్రంలో సంజ‌య్ ద‌త్ న‌టించ‌నున్నార‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఇందులో సంజూ భాయ్ కీల‌క పాత్ర‌ను పోషిస్తారు. అత‌డు విల‌న్ గా హీరోతో ఢీకొంటారా? లేక ఇంకేదైనా ట్విస్ట్ ఉన్న పాత్ర‌లో క‌నిపిస్తారా? అన్న‌ది ఇంకా రివీల్ కాలేదు. సంజ‌య్ ద‌త్ ని వెల్ కం చెబుతున్న‌ట్టు చిత్ర‌బృందం అధికారికంగా ధృవీక‌రించాల్సి ఉంది. నిజానికి అధీరాగా పాపుల‌రైన‌ సంజ‌య్ ద‌త్ ఇటీవ‌ల ఏ ప్రాజెక్ట్ లో న‌టించినా దానికి పాన్ ఇండియా అప్పీల్ వ‌చ్చేస్తుంది. అందువ‌ల్ల అత‌డికి భారీ పారితోషికం ముట్ట‌జెప్పి మ‌రీ ఒప్పించేస్తున్నారు. వెంకీ కుడుముల టీమ్ కూడా అదే ప్ర‌య‌త్నాల్లో ఉంద‌ని గుస‌గుస వినిపిస్తోంది.