Begin typing your search above and press return to search.

జగ్గూ భాయ్‌ తర్వాత మున్నా భాయ్‌ బిజీబిజీ...!

కాని ఇప్పుడు ఆ ప్లేస్ ను బాలీవుడ్‌ స్టార్‌ మున్నా భాయ్‌ ఫేం సంజయ్‌ దత్‌ దక్కించుకున్నాడు అనే టాక్‌ వినిపిస్తోంది.

By:  Tupaki Desk   |   8 Dec 2023 2:30 PM GMT
జగ్గూ భాయ్‌ తర్వాత మున్నా భాయ్‌ బిజీబిజీ...!
X

ఫ్యామిలీ చిత్రాల స్టార్‌ గా ఎన్నో సినిమాల్లో నటించి ఇండస్ట్రీలో స్టార్‌ హీరోలకు సమానమైన ఇమేజ్ ను సొంతం చేసుకున్న సీనియర్‌ హీరో జగపతి బాబు. హీరోగా చేస్తున్న సినిమాలు వరుసగా ఫ్లాప్స్ అవుతున్న నేపథ్యంలో బాలయ్య, బోయపాటి మూవీ లెజెంట్‌ తో విలన్ గా టర్న్‌ తీసుకున్న విషయం తెల్సిందే. జగపతి బాబుకు విలన్ గా మంచి గుర్తింపు లభించింది.

టాలీవుడ్‌ సినిమాల్లోనే కాకుండా కోలీవుడ్‌ మరియు బాలీవుడ్‌ లో కూడా విలన్ వేషాలు దక్కించుకున్నాడు. తెలుగు సినిమాల్లో స్టార్‌ హీరోలకు జగపతి బాబు మోస్ట్‌ వాంటెడ్‌ విలన్‌ గా మారాడు. అలాంటి జగపతి బాబును ఇప్పుడు కాస్త పక్కకు పెట్టారా అంటే ఔను అనే సమాధానం వినిపస్తోంది.

ఇంతకు ముందు జగపతిబాబు మోస్ట్‌ వాంటెడ్‌ విలన్‌ గా వరుస ఆఫర్లు దక్కించుకునేవాడు. కాని ఇప్పుడు ఆ ప్లేస్ ను బాలీవుడ్‌ స్టార్‌ మున్నా భాయ్‌ ఫేం సంజయ్‌ దత్‌ దక్కించుకున్నాడు అనే టాక్‌ వినిపిస్తోంది. సంజయ్‌ దత్‌ కేజీఎఫ్‌ 2 సినిమా తో ఒక్కసారిగా మోస్ట్‌ క్రేజీ విలన్‌ గా మారి పోయిన విషయం తెల్సిందే.

సంజయ్‌ దత్‌ ని విలన్‌ గా నటింపజేసేందుకు తెలుగు తో పాటు ఇతర సౌత్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ డైరెక్టర్స్ పోటీ పడుతున్నారు. ఇప్పటికే తెలుగు లో మారుతి దర్శకత్వంలో ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న సినిమాలో సంజయ్ దత్‌ కీలక పాత్రలో నటించేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన విషయం తెల్సిందే.

ఇక చిరంజీవితో వశిష్ట రూపొందిస్తున్న విశ్వంభర సినిమాలో కూడా సంజయ్‌ దత్‌ ను కీలక పాత్ర కోసం సంప్రదించడం జరిగిందట. చిరంజీవి వంటి స్టార్‌ హీరో సినిమాను ఎలా వదిలేస్తాను అన్నట్లుగా సంజయ్ ఆ సినిమాకు కూడా ఓకే చెప్పాడట. మొత్తానికి మున్నా భాయ్‌ సంజయ్‌ దత్‌ బిజీ బిజీగా ఉన్నాడు.