Begin typing your search above and press return to search.

మ‌ధుబాల‌గా ధురంధ‌ర్ బ్యూటీ!

ఆ సినిమా షూటింగ్ పూర్తికాగానే పెద్ద‌గా గ్యాప్ తీసుకో కుండానే డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన మధుబాల బయోపిక్ పనులపై పూర్తిగా దృష్టి పెడ‌తార‌ని స‌మాచారం.

By:  Srikanth Kontham   |   22 Aug 2026 9:00 PM IST
మ‌ధుబాల‌గా ధురంధ‌ర్ బ్యూటీ!
X

బాలీవుడ్‌లో స్టార్ డైరెక్ట‌ర్ సంజయ్ లీలా భన్సాలీ మరో అరుదైన ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుడుతున్నారు. భారతీయ చలనచిత్ర పరిశ్రమ దిగ్గజ నటి, అందాల తార మధుబాల జీవిత చరిత్ర ఆధారంగా బయోపిక్‌ను తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఈ ప్రాజెక్ట్‌ను సెప్టెంబర్ నెలలో పట్టాలెక్కించాల‌ని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం సంజయ్ లీలా భన్సాలీ రణ్‌వీర్ కపూర్, ఆలియా భట్, విక్కీ కౌశల్ ప్రధాన పాత్రల్లో `లవ్ అండ్ వార్` షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. ఆ సినిమా షూటింగ్ పూర్తికాగానే పెద్ద‌గా గ్యాప్ తీసుకోకుండానే డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన మధుబాల బయోపిక్ పనులపై పూర్తిగా దృష్టి పెడ‌తార‌ని స‌మాచారం.

ఈ చారిత్రాత్మక బయోపిక్‌లో లెజెండరీ నటి మధుబాల పాత్రలో యువ నటి సారా అర్జున్ నటించనున్నట్లు సమాచారం. చైల్డ్ ఆర్టిస్ట్‌గా విభిన్న చిత్రాల్లో నటించి అద్భుతమైన ప్రతిభ కనబరిచిన సారా అర్జున్ ఇప్పుడు భన్సాలీ లాంటి టాపర్ డైరెక్టర్ సినిమాలో ప్రధాన పాత్ర పోషించడం ఆమె కెరీర్‌లో బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ కానుంది. `ధురంధ‌ర్` విజ‌యంతో సారా పాన్ ఇండియాలో ఎంత సంచ‌ల‌న‌మైందో తెలిసిందే.

ఒక్క విజ‌యం అమ్మ‌డికి ఎన‌లేని గుర్తింపును తీసుకొచ్చింది. అయితే ఆ త‌ర్వాత అవ‌కాశాలు అందుకోవ‌డంలో వెనుక‌బ‌డింది. ఈనేప‌థ్యంలో తాజాగా మ‌ధుబాల బ‌యోపిక్ లో న‌టించే ఛాన్స్ రావ‌డంతో నిజంగా అదృష్ట‌మేనే చెప్పాలి. మధుబాల హావభావాలను, అంతులేని అందాన్ని తెరపై ఆవిష్కరించడానికి సారా ప్రత్యేకంగా శిక్షణ కూడా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

మధుబాల జీవితంలోని అప్పూరూపమైన క్షణాలు, ఆమె ఎదుర్కొన్న సవాళ్లు , సినీ ప్రయాణంలోని ఎత్తుపల్లాలను సినిమాలో అత్యంత కమనీయంగా చూపించనున్నారు. సంజయ్ లీలా భన్సాలీ తనదైన శైలిలో సెట్స్, కాస్ట్యూమ్స్ , మ్యూజిక్‌కు అత్యంత ప్రాధాన్యతనిస్తూ చిత్రాన్ని విజువల్ వండర్‌గా మలచడానికి సన్నాహాలు చేస్తున్నారు. అప్పట్లో మధుబాల సృష్టించిన మేజిక్‌ను తెరపై పునఃసృష్టించాలనే సంకల్పంతో ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంటోంది.

బాలీవుడ్ వర్గాల్లో ఈ ప్రాజెక్ట్పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. భన్సాలీ - మధుబాల కాంబినేషన్ అనగానే ఇండస్ట్రీలో ఆసక్తి నెలకొంది. క్లాసికల్ సినిమాలను అందించడంలో ప్రత్యేక గుర్తింపు ఉన్న భన్సాలీ నాటి తార జీవితాన్ని ఏ విధంగా తెర‌కెక్కిస్తారు? అన్న దానిపై సినీ ప్రియుల్లో క్యూరియాసిటీ నెల‌కొంది.