Begin typing your search above and press return to search.

చ‌రిత్ర‌ను త‌ల‌పించిన సంజ‌య్ క‌పూర్ మ‌ర‌ణం!

బాలీవుడ్ న‌టి క‌రిష్మా క‌పూర్ మాజీ భ‌ర్త, పారిశ్రామిక వేత్త సంజ‌య్ క‌పూర్ గుండె పోటుతో మ‌ర‌ణించిన సంగ‌తి తెలిసిందే.

By:  Tupaki Desk   |   13 Jun 2025 2:00 PM IST
చ‌రిత్ర‌ను త‌ల‌పించిన సంజ‌య్ క‌పూర్ మ‌ర‌ణం!
X

బాలీవుడ్ న‌టి క‌రిష్మా క‌పూర్ మాజీ భ‌ర్త, పారిశ్రామిక వేత్త సంజ‌య్ క‌పూర్ గుండె పోటుతో మ‌ర‌ణించిన సంగ‌తి తెలిసిందే. ఇంగ్లాండ్ లో పోలో ఆడుతుండ‌గా ఒక్క‌సారిగా గుండె పోటు రావ‌డంతో కుప్ప‌కూలి ప్రాణం వ‌దిలాడు. ఈఘ‌ట‌న ఇంగ్లాండ్ లోని గార్డ్స్ పోలో క్లబ్‌లో చోటుచేసుకుంది. పోలో ఆడుతోన్న స‌మ‌యంలో సంజ‌య్ క‌పూర్ నోట్లోకి తేనె టీగ దూరడం..దాన్ని ఆయ‌న మింగ‌డం..ఆ కార‌ణంగా అలెర్జీ రియాక్ష‌న్ జ‌రిగి ఊపిరాడ‌క గుండె ఆగిపోయిన‌ట్లు ప్రాధ‌మికంగా నిర్దారించారు.

సంజ‌య్ క‌పూర్ మ‌ర‌ణం ఒక్కసారిగా చ‌రిత్ర‌ను త‌ల‌పించింది. ఇలా పోలో ఆట ఆడుతూనే బానిస రాజ‌ వంశ స్థాప‌కుడు కుతుబుద్దీన్ ఐబ‌క్ మ‌ర‌ణించాడు. లాహోర్‌లో పోలో ఆటను ఆడుతుండగా గుర్రం మీద నుండి పడి మరణించిన‌ట్లు చ‌రిత్ర పుస్త‌కాలు చెబుతున్నాయి. ఏ.డీ 1210లో అతని మరణం జరిగింది. సంజ‌య్ క‌పూర్ మ‌ర‌ణంగా కూడా పోలో ఆట స‌మ‌యంలోనే చోటు చేసుకోవ‌డంతో కుతుబుద్దీన్ ఐబ‌క్ మ‌ర‌ణ వార్త నెట్టింట వైర‌ల్ అవుతుంది.

సంజయ్ కపూర్ భారత ఆటోమోటివ్ రంగంలో కీలకమైన వ్యక్తి. సోనా కామ్ స్టార్ సంస్థ‌కు చైర్మ‌న్ గా ఉన్నారు. ఆ కంపెనీ ఆటోమోటివ్ విడి భాగాల త‌యారీలో, ఎలక్ట్రిక్ వాహనాలకు అవసరమైన భాగాల ఉత్పత్తిని ప్రపంచస్థాయికి తీసుకెళ్లడంలో ప్రధాన పాత్ర పోషించారు. ఆటోమోటివ్ కాంపోనెంట్ మాన్యు ఫ్యాక‌ర్స్ ఏ సీ ఏమ్ ఏ అధ్య‌క్షుడిగా కూడా సేవ‌లందించారు.

వ్యాపారం రంగంలో మ‌రింత దిగ్విజ‌యంగా దూసుకుపోతున్నారు. అలాగే మంచి క్రీడాకారుడు కూడా. పోలో అంటే అమితామైన ఆస‌క్తి. దేశీయ, అంతర్జాతీయ పోలో టోర్నమెంట్‌లు కూడా ఆడారు. ఆరియస్ పేరుతో సొంతంగా ఒక పోలో జట్టును కూడా నడిపారు.