గొంతులో తేనెటీగ కుట్టడంతోనే గుండెపోటు!
కౌనిస్ సిండ్రోమ్ అనే అరుదైన సిండ్రోమ్ వల్ల సంజయ్ మరణించి ఉండొచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు.
By: Tupaki Desk | 13 Jun 2025 6:37 PM ISTబాలీవుడ్ నటి కరిష్మా కపూర్ మాజీ భర్త సంజయ్ కపూర్ గుండె పోటుతో మరణించిన సంగతి తెలిసిందే.పోలో ఆడుతోన్న సమయంలో సంజయ్ కపూర్ గొంతులోకి తేనెటీగను ప్రవేశించడం దీనివల్ల తీవ్రమైన అలెర్జీ రియాక్షన్ జరిగి ఊపిరాడలేదు. ఈ పరిస్థితి గుండెపోటుకు దారితీసిందని ప్రాథమికంగా నిర్ధా రించారు. వైద్య సహాయం అందించే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకపోయింది.
కౌనిస్ సిండ్రోమ్ అనే అరుదైన సిండ్రోమ్ వల్ల సంజయ్ మరణించి ఉండొచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. కౌనిస్ సిండ్రోమ్‌ను.. అలెర్జిక్ అక్యూట్ కోరోనరీ సిండ్రోమ్ - ఏసీఎస్ అని కూడా అంటారు. దీనికి సంబంధించి బెంగళూరుకు చెందిన తెలుగు సంతతి కార్డియాలజిస్ట్ డాక్టర్ దీపక్ కృష్ణమూర్తి అంచనా వేశారు. `సంజయ్ కపూర్ తేనెటీగను మింగినప్పుడు అది గొంతు లోపలి భాగం కుట్టింది.
ఇది ఆయన గొంతులో అలర్జీ రియాక్షన్‌కు కారణమైంది. అదే ఆ తర్వాత అనఫిలాక్సిస్ (తీవ్రమైన అలర్జీ) మ్యోకార్డియల్ ఇన్ఫార్‌క్షన్ , కార్డియాక్ అరెస్ట్‌కు దారితీసి ఉంటుందని అంచనా వేశారు. ఈ కేసుకు సంబంధించి మరిన్ని అంచనాలు తెరపైకి వచ్చే అవకాశం ఉంది. సంజయ్ కపూర్ ఆటోమోబైల్ రంగంలో గొప్ప విజయం సాధించారు. తన తండ్రి సురీందర్ కపూర్ నుంచి వారసత్వంగా వచ్చిన వ్యాపారాన్నే కొనసాగించి గొప్ప స్థాయిలో నిలబెట్టారు.
అయితే కుటుంబ జీవితంలో సంజయ్ కపూర్ చాలా సవాళ్లు ఎదుర్కున్నారు. మూడు పెళ్లిళ్లు చేసు కున్నారు. తొలుత ముంబైకి చెందిన ఫ్యాషన్ డిజైన్ నందిత మహ్తానీతో వివాహమైంది. ఆమెతో విడాకులు తర్వాత 2003లో కరీష్మా కపూర్ ను రెండవ వివాహం చేసుకున్నారు. ఈ జంటకు కొడుకు...కుమార్తె గలరు. 2016 లో విడిపోయారు. 2017లో నటి, మోడల్ ప్రియా సచ్‌దేవ్‌ను మూడవ వివాహం చేసుకున్నారు.
