నయా స్టార్ కు 15 కోట్లు నష్టం!
బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ పుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ చిత్రాలకంటే సౌత్ సినిమాలే ఎక్కువగా చేస్తున్నాడు.
By: Tupaki Desk | 18 July 2025 8:45 AM ISTబాలీవుడ్ నటుడు సంజయ్ దత్ పుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ చిత్రాలకంటే సౌత్ సినిమాలే ఎక్కువగా చేస్తున్నాడు. ప్రస్తుతం దక్షిణాది నుంచి ఆరేడు సినిమాలు చేస్తున్నాడు. ఇవి గాక పంజాబీ, బాలీవుడ్ చిత్రాల్లోనూ నటిస్తున్నాడు. హిందీ చిత్రాలకంటే అధిక పారితోషికం సౌత్ సినిమాల ద్వారా రావడంతో ఖల్ నాయక్ కూడా అంతే ఉత్సాహంగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో అప్పుడప్పుడు తనలో ఉన్న నిర్మాత ఫ్యాషన్ కూడా చాటుకుంటాడు. సినిమాల్లో సంపాదించింది సినిమాల్లోనే పెట్టు బడిగా పెట్టాలన్నది ఆయన రూల్ కూడా.
అలా తాజాగా రిలీజ్ అయిన `ది భూతిని` లో కొంత పెట్టుబడి పెట్టాడు. సంజయ్ దత్ , సన్నీ సింగ్, మౌనీ రాయ్ ప్రధాన పాత్రాల్లో సిద్దాంత్ సచ్ దేవా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమిది. మేలో రిలీజ్ అయిన ఈ సినిమా 30 కోట్ల బడ్జెట్ తో సంజయద్ నిర్మించాడు. కానీ బాక్సాఫీస్ వద్ద సినిమా బోల్తా కొట్టింది. 30 కోట్ల బడ్జెట్ లో 15 కోట్లు మాత్రమే లాంగ్ రనల్ రికవరీ చేసింది. దీంతో సంజయ్ దత్ కు మరో 15 కోట్లు నష్టంగా మిగిలింది. అలాగని మరీ పేలవమైన కంటెంట్ కూడా కాదు. కానీ కొన్ని సినిమాలకు జనాలు కనెక్ట్ అయ్యే పరిస్థితి ఉండదు.
అలాంటి పరిస్థితే దత్ సినిమాకు ఎదురైంది. ఓటీటీలో చూద్దామనే నెంబర్ ఎక్కువగా కనిపిస్తుంది. దీంతో ఈసినిమా ఓటీటీలో ఎప్పుడొస్తుందా? అని ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే `జీ 5` లో స్ట్రీమింగ్ కి రెడీ అవుతోంది. ఈ నెల 18 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఇప్పటికే దానికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా వచ్చింది. మరి ఓటీటీలో ఎలాంటి ఆదరణ దక్కుతుందో చూడాలి. ఓటీటీ రూపంలో కూడా దత్ కి పెద్దగా కిట్టినట్లు లేదనే వార్త వినిపిస్తుంది.
అయినా ఓటీటీ లో ఎంతటి అదరణ దక్కినా? నిర్మాతకు ఒరిగేదేమి ఉండదు. ఈ సినిమా కథ విషయానికి వస్తే..కాలేజ్ ఆవరణలోని ఒక చెట్టుపై ఉన్న ప్రేతాత్మ, ఒక యువకుడి కారణంగా మేల్కొంటుంది. పర్యవ సానంగా చోటు చేసుకునే పరిణామాలు ఎలాంటివి? అనే ఇతివృత్తంతో తెరకెక్కించారు. సినిమాలో కొన్ని థ్రిల్లింగ్ అంశాలు ఆసక్తికరంగా ఉన్నట్లు చూసినవాళ్లు చెబుతున్నారు.
