ఒకరిపై ప్రేమ..ఇంకొకరిపై ద్వేషం..ఇదేంటి భాయ్!
అయితే తాజాగా ఓ సినిమా ఈవెంట్ లో సంజయ్ దత్ దళపతి విజయ్- దర్శకుడు లోకేష్ కనగరాజ్ పై తన ప్రేమను చాటుకున్నారు.
By: Tupaki Desk | 11 July 2025 5:43 PM ISTబాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఈ మధ్య సౌత్ సినిమాలతో అలరిస్తోన్న సంగతి తెలిసిందే. హిందీ సినిమాలకంటే ఎక్కువగా సౌత్ తెరపైనే కనిపిస్తున్నారు. స్టార్ హీరోల చిత్రాల్లో విలన్ పాత్రలు పోషిస్తూ వైరల్ అవుతున్నారు. ఇప్పటికే తమిళ, తెలుగులో కొన్ని సినిమాలు చేసారు. `లియో`తో కోలీవుడ్లో...`డబుల్ ఇస్మార్ట్` తో టాలీవుడ్ లో నూ లాంచ్ అయ్యారు. భారీ అంచనాలమద్య రిలీజ్ అయిన ఈ రెండు సినిమాలు అంచనాలు మాత్రం అందుకోలేదు. `లియో` యావరేజ్ గా ఆడినా `డబుల్ ఇస్మార్ట్` మాత్రం వైఫల్యం చెందింది.
కానీ సంజయ్ దత్ రోల్ కు మాత్రం న్యాయం చేసారు. ఈ రెండు సినిమాల తర్వాత ఇక్కడ కొత్త అవకా శాలు పెరిగాయి. ప్రస్తుతం తెలుగులోనే `అఖండ 2`, `రాజాసాబ్` చిత్రాల్లో విలన్ గా నటిస్తున్నాడు. `రాజాసాబ్` సంగతి పక్కన బెడితే `అఖండ 2` తో దత్ టాలీవుడ్ లో సంచలనమవ్వం ఖాయం. బోయపాటి శ్రీను తో యాక్షన్ సీన్స్ అంటే ఎలా ఉంటాయో చెప్పాల్సిన పనిలేదు. అందులోనూ దత్ పై ఎలివేషన్ అంటే నెక్స్ట్ లెవల్లో ఉంటుంది.
బాలయ్య-దత్ మధ్య వచ్చే సన్నివేశాలే సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఆ రకంగా ఇద్దరిపై సన్నివేశాలకు సంబంధించి అందిరిలోనూ ఆసక్తి నెలకొంది. అయితే తాజాగా ఓ సినిమా ఈవెంట్ లో సంజయ్ దత్ దళపతి విజయ్- దర్శకుడు లోకేష్ కనగరాజ్ పై తన ప్రేమను చాటుకున్నారు. విజయ్ తో ఓ సినిమా చేసాను. అతను అంటే అష్టమని...కానీ లోకేష్ అంటే చాలా కోపం అని అన్నారు.
అందుకు కారణంగా `లియో` సినిమాలో తనకు పెద్ద పాత్ర ఇవ్వలేదని..తన టైమ్ అంతా లోకేష్ తినే సాడని నవ్వేసారు దత్. ప్రస్తుతం దానికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ప్రస్తుతం సంజయ్ దత్ బాలీవుడ్ లో సినిమాలు చేయలేదు. సౌత్ లో నే బిజీగా ఉన్నాడు. కొన్ని కన్నడ సినిమాలకు కూడా కమిట్ అయ్యారు. అలాగే పంజాబీలోనూ ఓ సినిమా చేస్తున్నారు.
