జైలు జీవితంలో నన్ను నేను మార్చుకున్న.. బాలీవుడ్ స్టార్ హీరో
తల్లిదండ్రుల సినీ వారసత్వంతో బాలీవుడ్ లో అగ్ర హీరోగా ఎదిగినా.. తాను చేసిన తప్పిదాలు మాత్రం జైలు పాలు చేశాయి.
By: Tupaki Desk | 9 Sept 2025 2:00 AM ISTతల్లిదండ్రుల సినీ వారసత్వంతో బాలీవుడ్ లో అగ్ర హీరోగా ఎదిగినా.. తాను చేసిన తప్పిదాలు మాత్రం జైలు పాలు చేశాయి. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డాడనే అపవాదు మూటగట్టుకున్నాడు. క్రమశిక్షణారాహిత్యం ఎంతటి విపత్కర పరిణామాలకు దారి తీస్తుందో ఈ హీరో ఉదంతమే ఉదాహరణ.
బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ బాలీవుడ్ లో స్టార్ హీరోగా ఎదిగి, తన నటన అభిమానులను అలరించారు. వాస్తవ్ సినిమాలో తన నటనతో జాతీయ అవార్డు కూడా సొంతం చేసుకున్నాడు. అయితే ఈ స్టార్ హీరో జీవితం అంత సాఫీగా సాగలేదు. తల్లి నర్గీస్ దత్ క్యాన్సర్ తో చనిపోవడం, ముంబై బాంబు పేలుళ్ల కేసులో జైలు శిక్ష అనుభవించడం, ఆ జైలు అనుభవాలు సంజూలో ఎన్నో మార్పులు తీసుకు వచ్చాయి. ఇటీవల, ప్రముఖ టీవీ షో ది గ్రేట్ ఇండియన్ కపిల్ షోలో తన జైలు జీవితం, అక్కడ నేర్చుకున్న పాఠాలు, అనుభవాలను, వచ్చిన మార్పులను పంచుకున్నారు సంజయ్ దత్.
అదే నా బాధ..
తన జీవితంలో జరిగిన ఏది కూడా తనకు అసంతృప్తిని ఇవ్వలేదని. కానీ తల్లిదండ్రులు దూరమవడం ఇప్పటికీ జీర్ణించుకోలేనని, ఇప్పటికీ ఆ బాధ వెంటాడుతుంటుందని చెప్పుకొచ్చారు సంజయ్ దత్.
జైలు జీవితం ఎన్నో నేర్పింది..
జైల్లో గడిపిన రోజులను కష్టకాలంగా భావించలేదని, ప్రతి నిమిషాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకున్నానని చెప్పుకొచ్చాడు సంజూ. జైలులో కార్పెంటర్ గా పని చేశానని, కుర్చీలు, పేపర్ బ్యాగ్స్ తయారుచేసి డబ్బులు కూడా సంపాదించానని వివరించారు. అదేవిధంగా, జైల్లో-only ఓ రేడియో స్టేషన్‌ను ప్రారంభించి ప్రోగ్రామ్స్ కూడా చేశానని, ఇతర ఖైదీలతో కలిసి సామాజిక చర్చలు నిర్వహించినట్లు తెలిపారు. వ్యక్తిగత అభివృద్ధి, మానసిక స్థిరత్వానికి జైలు జీవితం ఎంతో నేర్పిందని నిర్మోహమాటంగా చెప్పారు.
రెండు హత్యలు చేసిన ఖైదీతో..
జైల్లో తన గుండె జలదరించిన సంఘటనను పంచుకున్నారు సంజయ్. రెండు హత్యలు చేసిన ఓ ఖైదీ తన గడ్డం గీసేందుకు వచ్చాడని, గడ్డం గీస్తుండగా అతడు ఈ విషయం చెప్పడంతో ఒక్కసారిగా గుండె ఆగినంత పనైపోయిందన్నారు.
మార్పు తెచ్చిన జైలు జీవితం.
ఈ అనుభవం ద్వారా సంజయ్ దత్త్ తన జీవితాన్ని తిరిగి పునర్నిర్మించుకునేందుకు, నైతికతను కాపాడుకోవడానికి ఎలా ప్రయత్నించారో అర్థమవుతున్నది. తప్పిదాలు, ఆగ్రహావేశాలు, క్రమశిక్షణా రహిత జీవితం ఎలాంటి అగాథంలోకి నెట్టి వేస్తుందో అర్థమవుతున్నది. అలాగే అగాథంలో కూరుకుపోకుండా పైకి రావడానికి ప్రతీ అవకాశాన్ని వూర్తిగా వినియోగించుకున్నానని సంజూ స్వయంగా చెప్పడం విశేషం. ప్రతి చిన్న తప్పిదం కూడా మన జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో, అవగాహనతో, నిస్వార్థ భావంతో దాన్ని అధిగమించి వ్యక్తిత్వాన్ని ఎలా కాపాడుకోవాలో సంజూ జీవితం ఒక సందేశం లాంటింది.
