Begin typing your search above and press return to search.

సానియా మీర్జా కుమారుడికి స్కూల్లో వేధింపులా?

కొత్త‌గా ఇజాన్ వేధింపుల‌కు గుర‌వుతున్నాడ‌ని భార‌తీయుల్ని పాక్ మీడియా రెచ్చ‌గొట్టేలా ఇలాంటి క‌థ‌నాలు తెర తీసింద‌ని ప‌లువురు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

By:  Tupaki Desk   |   4 Feb 2024 5:30 AM GMT
సానియా మీర్జా కుమారుడికి స్కూల్లో వేధింపులా?
X

సానియామీర్జా-షోయ‌బ్ మాలిక్ ఇటీవ‌ల విడాకుల‌తో వేరైన సంగ‌తి తెలిసిందే. వివాహ‌బంధానికి పుల్ స్టాప్ పెడుతూ ఇద్ద‌రు విడాకులు తీసుకున్నారు. అటుపై వెంట‌నే షోయ‌బ్ మాలిక్ పాకిస్తాన్ న‌టి స‌నా జావేద్ ని వివాహం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. అయితే సానియామీర్జా-షోయ‌బ్ మాలిక్ భార్య‌భ‌ర్త‌లుగా విడిపోయినా త‌మ‌కు గ‌ల కుమారుడు మాత్రం అప్పుడే ఇబ్బందుల‌కు గుర‌వుతున్న‌ట్లు ప్ర‌చారం మొద‌లైంది.

సానియా-మాలిక్ ల‌కు పుట్టిన కుమారుడు ఇజాన్ తండ్రి మూడ‌వ వివాహం త‌ర్వాత స్కూల్లో వేధింపులు ఎదుర్కుంటున్న‌ట్లు మీడియాలో క‌థ‌నాలు వైర‌ల్ అవుతున్నాయి.ఇజాన్ మాన‌సిక క్షోభ‌కి గుర‌వుతున్నాడ‌ని పాక్ మీడియాలో ప్ర‌చారం సాగుతోంది. అయితే ఇందులో వాస్త‌వం తెలియాల్సి ఉంది. పాకిస్తాన్ మీడియా భార‌త్ పై విషం చిమ్మ‌డం కొత్తేం కాదు. ఇప్పుడు షోయ‌బ్ మాలిక్ ని అడ్డుపెట్టుకుని కొత్త ప్ర‌చారానికి తెర తీసిన‌ట్లు తెలుస్తోంది.

షోయ‌బ్ మాలిక్ కు త‌న కుమార్తె విడాకులు ఇచ్చినట్లు సానియా మీర్జా తండ్రి ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. మాలిక్ ప్ర‌వ‌ర్త‌న స‌రిగ్గా లేక‌పోవ‌డంతోనే విడాకులు ఇచ్చిన‌ట్లు ప్ర‌చారంలోకి వ‌చ్చింది. కొత్త‌గా ఇజాన్ వేధింపుల‌కు గుర‌వుతున్నాడ‌ని భార‌తీయుల్ని పాక్ మీడియా రెచ్చ‌గొట్టేలా ఇలాంటి క‌థ‌నాలు తెర తీసింద‌ని ప‌లువురు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఏది ఏమైనా భార్య‌భ‌ర్త‌లు విడిపోతే ఆ ప్ర‌భావం బిడ్డ‌ల‌పై ప‌డుతుంది.

అందుకే పిల్ల‌ల భ‌విష్య‌త్ ని దృష్టి లో పెట్టుకుని భార్య‌భ‌ర్త‌లుగా విడిపోయినా స్నేహితులుగా అప్పుడ ప్పుడు క‌లుస్తుంటారు. త‌ల్లిదండ్రులుగా వారు నెర‌వేర్చాల్సిన బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తుంటారు. మ‌రి ఇజాన్ విష‌యంలో షోయ‌బ్ మాలిక్ -సానియా ఆఛాన్స్ తీసుకుంటారా? ఇజాన్ విష‌యంలో వాళ్ల నిర్ణ‌యాలు ఎలా ఉంటాయి? అన్న‌ది తెలియాలి.