Begin typing your search above and press return to search.

విడాకులు త‌ర్వాత సానియా మొదటి పోస్ట్

భార‌త టెన్నిస్ స్టార్ సానియా మీర్జా దాయాది పాకిస్తాన్ కి చెందిన క్రికెటర్ షోయబ్ మాలిక్ ని పెళ్లాడిన సంగ‌తి తెలిసిందే

By:  Tupaki Desk   |   26 Jan 2024 10:41 AM GMT
విడాకులు త‌ర్వాత సానియా మొదటి పోస్ట్
X

భార‌త టెన్నిస్ స్టార్ సానియా మీర్జా దాయాది పాకిస్తాన్ కి చెందిన క్రికెటర్ షోయబ్ మాలిక్ ని పెళ్లాడిన సంగ‌తి తెలిసిందే. కానీ ఈ జంట అధికారికంగా విడాకులు తీసుకోవ‌డం, షోయ‌బ్ మూడో భార్య‌తో మీడియాలో ప్ర‌త్య‌క్షం కావ‌డం చ‌క‌చ‌కా జ‌రిగిపోయాయి. ఈ వ్య‌వ‌హారంలో షోయ‌బ్‌ని అస‌హ్యించుకుంటూ సానియాకు పాకిస్తానీలు మ‌ద్ధ‌తుగా నిల‌వ‌డం ఆశ్చ‌ర్య‌క‌రం. ప‌లువురు క‌థానాయిక‌ల‌తో షోయ‌బ్ సంబంధాలే ఈ బ్రేక‌ప్ కి కార‌ణం అంటూ ప్రచారం సాగుతోంది.


ఇంత‌లోనే రిపబ్లిక్ డే నాడు భారత జెండాతో ఫోటోను పోస్ట్ చేసిన సానియా మిర్జా తాను భార‌తీయురాలైనందుకు గ‌ర్వంగా ఉంద‌ని వ్యాఖ్యానించారు. అయితే షోయబ్ మాలిక్‌ను పెళ్లి చేసుకున్నందుకు ఆన్‌లైన్‌లో అపార‌మైన‌ ద్వేషం వ్యక్తం అయింది. పాకిస్తానీని ఎందుకు పెళ్లి చేసుకున్నావ్? అంటూ నెటిజ‌నులు నిల‌దీస్తున్నారు. 26 జనవరి 2024న‌ భారతదేశ 75వ గణతంత్ర దినోత్సవం సంద‌ర్భంగా దేశంలో ఐక్యతా రాగం వినిపిస్తోంది. భారతదేశ టెన్నిస్ ఐకాన్ సానియా మీర్జా భారత జెండాతో ఫోటోను షేర్ చేసిన‌ తర్వాత అభిమానుల నుండి ఊహించని ప్ర‌తిఘ‌ట‌న‌ను ఎదుర్కొన్నారు. గ‌ణ‌తంత్ర దినోత్స‌వ‌ ప్రాముఖ్యతను సానియా హైలైట్ చేసినా కానీ ఆ తర్వాత ఆన్‌లైన్ ద్వేషాన్ని ఊహించలేదు. ఒక పాకిస్తానీని పెళ్లాడి త‌ప్పు చేసావ్ అంటూ త‌న గాయాల‌పై కారం చ‌ల్లుతున్నారు.

ఆన్‌లైన్ ద్వేషం

దురదృష్టవశాత్తు పాకిస్తానీ క్రికెటర్ షోయబ్ మాలిక్‌ను వివాహం చేసుకున్నందుకు భారత అభిమానులు సానియా మీర్జాను లక్ష్యంగా చేసుకోవడంతో సంతోషకరమైన సందర్భం చేదుగుళిక‌లా మారింది. సానియా పోస్ట్ అనంత‌రం వ్యాఖ్యల‌ విభాగం భిన్న‌ అభిప్రాయాలతో యుద్ధభూమిగా మారింది. సమాజంలోని కొన్ని వర్గాలలో ఇప్పటికీ ప్రబలంగాల‌ ఉన్న విభజన భావాలను బహిర్గతం చేసింది. సానియా మీర్జాపై విమ‌ర్శ‌లు ఉన్నా కానీ, ఇతర భారతీయ క్రీడా ప్రముఖులు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ దేశవ్యాప్త వేడుకల‌ను సెల‌బ్రేట్ చేసారు. క్రికెట‌ర్ సూర్యకుమార్ యాదవ్ .. అజింక్యా రహానే స‌హా చాలా మంది క్రీడా ప్ర‌ముఖులు ఈ ముఖ్యమైన రోజున ఐక్యతను ప్రదర్శించారు.

పివి సింధు నివాళి

బ్యాడ్మింటన్ చాంపియ‌న్ పివి సింధు దేశానికి ప్రాతినిధ్యం వహించినందుకు తన గర్వాన్ని చాటుకుంది. భారతదేశానికి కీర్తిని తీసుకురావడానికి బ‌ల‌మైన‌ సంకల్పంతో ఉన్నాన‌ని సింధు వ్యాఖ్యానించింది. నారీ-శక్తి లేదా మహిళా సాధికారతకు నివాళులు అర్పిస్తూ గణతంత్ర దినోత్సవ వేడుకల గురించి సింధు వ్యాఖ్యానించారు. ఈ సెంటిమెంట్‌ను బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ కూడా ప్రతిధ్వనించారు. ఇది దేశం గర్వించదగిన క్షణం అని అన్నారు. క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్, బాక్సింగ్ ఛాంపియన్ మేరీకోమ్.. ఒలింపిక్ బంగారు పతక విజేత అభినవ్ బింద్రా కూడా సోషల్ మీడియాలో తమ హృదయపూర్వక సందేశాలతో శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరూ గణతంత్ర దినోత్సవం ప్రాముఖ్యతను.. భిన్న‌త్వంలో ఏక‌త్వంతో సాంస్కృతికంగా సంపన్నమైన ఈ దేశంలో భాగమైనందుకు గర్వంగా ఉంద‌ని వీరంతా హైలైట్ చేశారు.