బిడ్డను విడిచాక కన్నీళ్లు పెట్టుకున్నాను: సానియా
మేటి క్రీడాకారిణి, భారత టెన్నిస్ స్టార్ సానియా మిర్జా జీవితంలో కష్టం గురించి తెలిసిందే.
By: Tupaki Desk | 25 April 2025 9:07 AM ISTమేటి క్రీడాకారిణి, భారత టెన్నిస్ స్టార్ సానియా మిర్జా జీవితంలో కష్టం గురించి తెలిసిందే. పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్ ని పెళ్లాడిన సానియా అతడి నుంచి విడిపోవాల్సి వచ్చింది. అప్పటికే ఇజాన్ అనే చిన్నారి బాలుడికి సానియా తల్లి. అయితే ఈ బ్రేకప్ కి ముందు బిడ్డతో తన అనుభవాలను ఇప్పుడు సానియా గుర్తు చేసుకుంటోంది. తనకు బిడ్డ పుట్టిన ఆరు వారాల తర్వాత జరిగిన ఒక సంఘటనను సానియా వివరించారు.
కుమారుడు ఇజాన్ ఆరు వారాల కిడ్ గా ఇంకా తల్లి పాలు తాగుతున్నాడు. సానియా బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తోంది. కానీ తను హైదరాబాద్ నుంచి దిల్లీలో ఒక కార్యక్రమానికి వెళ్లాల్సి వచ్చింది. అప్పుడు తన బిడ్డను ఇంటి వద్దనే వదిలేసి వెళ్లాల్సిన స్థితి. కానీ అది ఎంతో బాధను మిగిల్చింది. దుఃఖాన్ని అనుభవించి ఫలవరించానని సానియా చెప్పారు.
విమానం ఎక్కాను కానీ, బిడ్డ గుర్తుకు వచ్చి, తనకు పాలు ఇవ్వాలనే తలపు రాగానే చాలా కన్నీళ్లు వచ్చాయని సానియా తాజా ఇంటర్వ్యూలో చెప్పారు. హైదరాబాద్ లో బిడ్డను విడిచి వెళ్లేప్పుడు, దిల్లీకి వెళ్లాక కూడా తనకు కళ్లలో నీళ్లు తిరిగాయని, ఎంతో బాధపడ్డానని తెలిపింది. అయితే తాను విమాన ప్రయాణం చేసి ఉండకపోతే ఎప్పటికీ తాను బిడ్డను వదిలి దూరంగా వెళ్లగలనని తెలిసేది కాదు! అని సానియా గుర్తు చేసుకున్నారు.
ప్రస్తుతం ఇజాన్ స్కూల్ కి వెళ్లేంత పెద్ద వాడయ్యాడు. ఈ వయసులో అతడికి తల్లిదండ్రుల అండదండలు ఎంత అవసరమో సానియా గుర్తు చేసుకుంటూనే ఉన్నానని అన్నారు. తల్లిదండ్రుల భరోసా భద్రత పిల్లలకు అవసరం. ఇజాన్ కోసం నేను తగినంత చేశానని అనుకుంటున్నాను. నేను నా కలలను వెంబడించానని భావిస్తున్నాను. ఇజాన్ కూడా నా కలలో భాగం! అని సానియా మీర్జా అన్నారు.
