Begin typing your search above and press return to search.

యంగ్ హీరోతో న‌య‌న్ రొమాన్స్ కి రెడీ!

`మ్యాడ్` చిత్రాల‌తో సంగీత్ శోభ‌న్ న‌టుడిగా ఫేమ‌స్ అయిన సంగ‌తి తెలిసిందే. దీంతో సోలో హీరోగా ప్ర‌మోట్ అయ్యాడు.

By:  Tupaki Desk   |   27 Jun 2025 11:44 AM IST
యంగ్ హీరోతో న‌య‌న్ రొమాన్స్ కి రెడీ!
X

'మ్యాడ్' చిత్రాల‌తో సంగీత్ శోభ‌న్ న‌టుడిగా ఫేమ‌స్ అయిన సంగ‌తి తెలిసిందే. దీంతో సోలో హీరోగా ప్ర‌మోట్ అయ్యాడు. ప్ర‌స్తుతం సంగీత్ శోభ‌న్ హీరోగా మెగా డాట‌ర్ నిహారిక కొణిదెల త‌న నిర్మాణ సంస్థ‌లో ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రానికి మానస శ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఇప్ప‌టికే సినిమా ప్రారంమైంది. త్వ‌ర‌లోనే రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లు కానుంది. కానీ ఇంత వ‌ర‌కూ హీరోయిన్ ఎంపిక కాలేదు.

ఈ నేప‌థ్యంలో హీరోయిన్ గా న‌య‌న్ సారిక‌ను ఎంపిక చేసారు. న‌య‌న్ ఇప్ప‌టికే ఆయ్, క లాంటి చిత్రాల్లో న‌టించిన సంగ‌తి తెలిసిందే. రెండు సినిమాలు మంచి విజ‌యం సాధించాయి. దీంతో అమ్మ‌డికి న‌టిగా మంచి గుర్తింపు ద‌క్కింది. తెర‌పై సంగీత్-న‌య‌న్ జోడీ మెప్పించ‌డం ఖాయ‌మంటున్నారు. సంగీత్ ప‌క్క‌న న‌య‌న్ ప‌ర్పెక్ట్ గా సూట‌వుతుందిట‌.

యూత్ పుల్ కాన్సెప్ట్ కావ‌డంతో? ఇద్ద‌రిలో స‌హ‌జంగా ఉన్న చ‌లా కీత‌నం సినిమాకు క‌లిసొస్తుంద‌ని చిత్ర బృందం భావిస్తుంది. కంటెట్ ఉన్న సినిమాల‌కు క‌టౌట్ తో ప‌నిలేదు. మంచి క‌థ‌, న‌టీనటుల పెర్పా ర్మెన్స్ సినిమాను నెక్స్ట్ లెవ‌ల్ కు తీసుకెళ్లుంది. అందుకు సంగీతం కూడా తోడైతే అద‌నంగా కలిసొస్తుంది. నిహారిక ఇప్ప‌టికే నిర్మాత‌గా కొన్ని అటెంప్ట్ లు చేసి స‌క్సెస్ అయింది.

ఆమెకి నిర్మాణంపై అవ‌గాహ‌న ఉంది. వెబ్ సిరీస్ ల‌తో పాటు సినిమాల నిర్మాణంలోనూ భాగ‌మైంది. ప్రొడ‌క్ష న్ పై నాలెడ్జ్ ఉంది. ఈనేప‌థ్యంలో కొత్త చిత్రాన్ని ప‌రిమిత బ‌డ్జెట్ లోనూ పూర్తి చేస్తున్న‌ట్లు స‌మాచారం. వెన్నెల కిషోర్, బ్ర‌హ్మాజీ, త‌న‌కెళ్ల భ‌ర‌ణి లాంటి సీనియ‌ర్ న‌టులు కూడా ఇందులో న‌టిస్తున్నారు.