Begin typing your search above and press return to search.

'యానిమల్' దర్శకుడి టాలీవుడ్‌ ప్రేమ..!

బాలీవుడ్‌ నుంచి బడా ఆఫర్లు వచ్చినా కూడా తాను మాత్రం తెలుగు సినిమాలనే చేస్తాను అంటూ టాలీవుడ్ పై ప్రేమను కనబర్చుతూ తాజా ఇంటర్వ్యూల్లో క్లారిటీ ఇచ్చాడు.

By:  Tupaki Desk   |   26 Nov 2023 3:30 PM GMT
యానిమల్ దర్శకుడి టాలీవుడ్‌ ప్రేమ..!
X

టాలీవుడ్‌ లో అర్జున్ రెడ్డి సినిమాను తీసి ఇక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుని, అదే సినిమాను బాలీవుడ్‌ లో కబీర్ సింగ్ గా రీమేక్ చేసి అక్కడ కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న దర్శకుడు సందీప్ వంగ. కబీర్ సింగ్ హిట్ తో వచ్చిన క్రేజ్ తో వెంటనే రణబీర్ కపూర్‌ వంటి స్టార్ హీరోతో యానిమల్‌ సినిమాను రూపొందించే అవకాశం దక్కించుకున్నాడు.

యానిమల్‌ సినిమాపై బాలీవుడ్‌ ప్రేక్షకులతో పాటు సినీ వర్గాల్లో కూడా ఆసక్తి చాలా కనిపిస్తోంది. యానిమల్ హిట్ అయితే సందీప్ వంగ దర్శకత్వంలో నటించేందుకు హీరోలు, ఆయనతో సినిమాలను నిర్మించేందుకు నిర్మాతలు రెడీగా ఉన్నారు. ఇప్పటికే సంప్రదింపులు కూడా మొదలు పెట్టారు అంటూ ప్రచారం జరుగుతోంది.

దర్శకుడు సందీప్ వంగ మాత్రం యానిమల్‌ సినిమా తర్వాత టాలీవుడ్‌ లో బిజీ అవ్వాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. బాలీవుడ్‌ నుంచి బడా ఆఫర్లు వచ్చినా కూడా తాను మాత్రం తెలుగు సినిమాలనే చేస్తాను అంటూ టాలీవుడ్ పై ప్రేమను కనబర్చుతూ తాజా ఇంటర్వ్యూల్లో క్లారిటీ ఇచ్చాడు.

యానిమల్‌ తర్వాత సందీప్ వంగ చేయబోతున్న సినిమా స్పిరిట్‌. ప్రభాస్ హీరోగా సందీప్ వంగ దర్శకత్వంలో స్పిరిట్ ప్రకటించి చాలా నెలలు అయింది. ఇప్పటికే కథ రెడీగా ఉందట. వచ్చే ఏడాది జూన్ లో ప్రీ ప్రొడక్షన్ వర్క్‌ మొదలు పెట్టబోతున్నారట. యానిమల్‌ విడుదల అయిన తర్వాత స్పిరిట్ స్క్రిప్ట్‌, డైలాగ్‌ వర్షన్‌ మరియు ట్రీట్మెంట్‌ పై వర్క్‌ చేయబోతున్నాడట.

ప్రభాస్ తో స్పిరిట్‌ చేసిన తర్వాత అల్లు అర్జున్‌ తో సందీప్ వంగ సినిమా చేయబోతున్నాడు. ఇప్పటికే వీరి కాంబోలో సినిమాను అధికారికంగా ప్రకటించారు. 2025 లో సినిమా పట్టాలెక్కే విధంగా ప్లాన్‌ చేస్తున్నారు అంటున్నారు. వీరితోనే కాకుండా మహేష్ బాబుతో సినిమా కోసం కథ చెప్పాను అని సందీప్ పేర్కొన్నాడు. ఆయన బిజీగా ఉండటం వల్ల కాస్త ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయి అన్నాడు.

రామ్‌ చరణ్‌, అల్లు అర్జున్‌ ఇలా టాలీవుడ్‌ కి చెందిన స్టార్‌ హీరోల అందరితో కూడా సినిమాలు చేయాలని తన కోరిక అంటూ సందీప్ వంగ టాలీవుడ్‌ పై అభిమానం చూపిస్తున్నాడు. బాలీవుడ్‌ నుంచి క్రేజీ ఆఫర్లు వస్తే సందీప్ వంగ ఏమైనా ఆలోచనల్లో పడుతాడేమో చూడాలి.