Begin typing your search above and press return to search.

ప్ర‌భాస్ స్థానంలో ఆయ‌నా..ఇదేం ట్విస్ట్!

అలాగే డార్లింగ్ పూర్తి చేయాల్సిన సినిమాలు కొన్ని ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో సందీప్ గ్యాప్ లేకుండా చూసుకోవ‌డం కోసం ఈ లోపు స‌ల్మాన్ తో ఓ సినిమా చేస్తే బాగుంటుంద‌ని భావిస్తున్నాడుట‌.

By:  Tupaki Desk   |   31 Jan 2024 5:30 PM GMT
ప్ర‌భాస్ స్థానంలో ఆయ‌నా..ఇదేం ట్విస్ట్!
X

సందీప్ రెడ్డి పేరు ఇప్పుడు పెను సంచ‌ల‌నం అన్న సంగ‌తి చెప్పాల్సిన ప‌నిలేదు. కేవ‌లం రెండు మూడు సినిమాల‌తోనే మారుమ్రోగిన పేరు అది. త‌దుప‌రి డార్లింగ్ ప్ర‌భాస్ ని డైరెక్ట్ చేయ‌డానికి రెడీ అవుతున్నాడు. ఆ కాంబినేష‌న్ లో 'స్పిరిట్' అనే సినిమా తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ఇదే ఏడాదిలో ఆ సినిమా ప్రారంభం కానుంది. అయితే ఇదంతా నిన్న‌టివ‌ర‌కూ ఉన్న స‌మాచారం.

నేడు ఆ ప్లానింగ్ లో మార్పులు చోటు చేసుకుంటున్నాయా? డార్లింగ్ స్థానంలోకి మ‌రో హీరో వ‌స్తున్నాడా? అంటే అవుననే తెలుస్తోంది. అత‌డే స‌ల్మాన్ ఖాన్....ఖాన్ హీరోతో సందీప్ ఓ సినిమా చేయ‌డానికి రంగం సిద్దం చేస్తున్నాడ‌ని తాజా స‌మాచారం. స‌డెన్ గా స‌ల్మాన్ ఏంట్రీ ఏంటి? అంటే ఆ వివ‌రాల్లోకి వెళ్లాల్సిందే. ప్ర‌భాస్ తో సందీప్ సినిమా ప్రారంభం అవ్వ‌డానికి ఎలా లేదు అన్నా కొన్ని నెల‌లు స‌మ‌యం ప‌డుతుంది.

అలాగే డార్లింగ్ పూర్తి చేయాల్సిన సినిమాలు కొన్ని ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో సందీప్ గ్యాప్ లేకుండా చూసుకోవ‌డం కోసం ఈ లోపు స‌ల్మాన్ తో ఓ సినిమా చేస్తే బాగుంటుంద‌ని భావిస్తున్నాడుట‌. ఇటీవ‌లే స‌ల్మాన్ కి ఓ స్టోరీ కూడా వినిపించాడ‌ని..న‌చ్చ‌డంతో ఆయ‌న కూడా ఒకే చెబుతున్న‌ట్లు స‌మాచారం. ఇదే నిజ‌మైతే స‌ల్మాన్ అభిమానుల‌కు పండ‌గే. అస‌లైన స‌రైన విజ‌యాలు లేక స‌ల్మాన్ చాలా కాలంగా ఇబ్బంది ప‌డుతున్నాడు.

రేసులో షారుక్ ఖాన్...అమీర్ ఖాన్...హృతిక్ రోష‌న్ లాంటి వారు దూసుకుపోవ‌డంతో భాయ్ మాత్రం వెనుక‌బ డిపోతున్నాడు. ప్ర‌య‌త్నాలు చేసినా స‌రైన ఫ‌లితాలు రావ‌డం లేదు. ఈ నేప‌థ్యంలో ఫాంలో ఉన్న సందీప్ రెడ్డి లాంటోడు త‌గిలితే స‌ల్మాన్ చెల‌రేగిపోతాడు. అందులో ఎలాంటి సందేహం లేదు. మరి ఈ ప్ర‌చారంలో నిజం ఏంటో తెలియాలి.