Begin typing your search above and press return to search.

మహేష్ సందీప్ వంగ ఇప్పట్లో కష్టమే..!

మహేష్ సందీప్ వంగ ప్రాజెక్ట్ ఉన్నా సరే అది ఇప్పుడప్పుడే సెట్స్ మీదకు వెళ్లే ఛాన్స్ లేదని చెప్పొచ్చు

By:  Tupaki Desk   |   15 Aug 2023 5:30 PM GMT
మహేష్ సందీప్ వంగ ఇప్పట్లో కష్టమే..!
X

అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిన దర్శకుడు సందీప్ వంగ. ఆ సినిమాతోనే విజయ్ దేవరకొండకి స్టార్ ఇమేజ్ వచ్చేలా చేశాడు. ఇక అర్జున్ రెడ్డి సినిమానే హిందీలో కూడా రీమేక్ చేసి అక్కడ హిట్ అందుకున్నాడు సందీప్. కబీర్ సింగ్ సినిమా చూసిన రణ్ బీర్ కపూర్ యానిమల్ ఛాన్స్ ఇచ్చాడు. యానిమల్ కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుంది అని ఆమధ్య వచ్చిన ఫస్ట్ గ్లింప్స్ చూస్తే అర్ధమవుతుంది. యానిమల్ తర్వాత సందీప్ వంగ ప్రభాస్ తో స్పిరిట్ ఫిక్స్ చేసుకున్నాడు.

ప్రభాస్ తర్వాత అల్లు అర్జున్ సినిమా కూడా లైన్ లో ఉంది. బాలీవుడ్ నిర్మాతలు అల్లు అర్జున్ సందీప్ కాంబినేషన్ సినిమాను ప్రొడ్యూస్ చేయాలని చూస్తున్నారు. ఆల్రెడీ దీనికి సంబంధించిన అనౌన్స్ మెంట్ కూడా వచ్చేసింది. అయితే ప్రభాస్, అల్లు అర్జున్ ల కన్నా ముందు మహేష్ తో సందీప్ వంగ సినిమా ఉంటుందని వార్తలు వచ్చాయి. మహేష్ కోసం ఓ కథ రెడీ చేసిన సందీప్ ఆ సినిమాకు టైటిల్ గా షుగర్ ఫ్యాక్టరీ అని కూడా పెట్టాడని అప్పట్లో వార్తలు వచ్చాయి. మరి ఆ కథ ఏమైందో ఏంటో తెలియదు కానీ యానిమల్, స్పిరిట్, అల్లు అర్జున్ సినిమా ఇలా వరుస క్రేజీ ప్రాజెక్ట్ లతో సందీప్ బిజీ అయ్యాడు.

మహేష్ సందీప్ వంగ ప్రాజెక్ట్ ఉన్నా సరే అది ఇప్పుడప్పుడే సెట్స్ మీదకు వెళ్లే ఛాన్స్ లేదని చెప్పొచ్చు. ప్రస్తుతం మహేష్ త్రివిక్రమ్ తో గుంటూరు కారం సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత రాజమౌళితో సినిమా సెట్స్ మీదకు వెళ్తుంది. రాజమౌళి సినిమా అంటే ఎలా లేదన్నా రెండు మూడేళ్లు వెయిట్ చేయక తప్పదు. సో సందీప్ వంగా తో మహేష్ సినిమా ఓకే చేసినా 3 ఏళ్ల పాటు వెయిట్ చేయక తప్పదు. మహేష్ డైరెక్టర్స్ లిస్ట్ లో సందీప్ వంగా కూడా ఉన్నాడని తెలుస్తుంది.

యానిమల్ హిట్ పడితే మారం సందీప్ తో బాలీవుడ్ హీరోలు కూడా వరుస సినిమాలు చేసేలా ఆసక్తి చూపుతారు. సందీప్ ఒకటి తెలుగు హీరోతో మరోటి హిందీ హీరోలతో అన్నట్టుగా సినిమాలు చేస్తున్నాడు. అయితే యానిమల్ తర్వాత ప్రభాస్ తో చేసే స్పిరిట్ సినిమాకు మాత్రం పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ రేంజ్ లో అంచనాలు ఏర్పడతాయని చెప్పొచ్చు. కల్కితో ఆల్రెడీ హాలీవుడ్ రేంజ్ ట్రీట్ ఇస్తున్న ప్రభాస్ స్పిరిట్ కూడా అందుకు ఏమాత్రం తగ్గదని చెబుతున్నారు.