Begin typing your search above and press return to search.

అల్లు అర్జున్ తో సందీప్.. మెంటల్ ఎక్కించేస్తారట..!

ప్రభాస్ తో పాటుగా అల్లు అర్జున్ తో కూడా సందీప్ వంగా సినిమా ప్లానింగ్ లో ఉంది. ఈ సినిమా స్టోరీ, హీరో క్యారెక్టరైజేషన్ మెంటల్ ఎక్కించేస్తుందని అంటున్నారు.

By:  Tupaki Desk   |   11 Sep 2023 6:23 AM GMT
అల్లు అర్జున్ తో సందీప్.. మెంటల్ ఎక్కించేస్తారట..!
X

నేషనల్ అవార్డ్ వచ్చాక అందుకు తగినట్టుగానే తను రాబోయే సినిమాల విషయంలో చాలా ఫోకస్ తో సినిమాల లైనప్ చేసుకుంటున్నాడు అల్లు అర్జున్. పుష్ప రాజ్ పాత్రలో ఆయన చూపించిన అభినయం నేషనల్ లెవెల్ లో ఆడియన్స్ కి బాగా నచ్చేసింది. ఇక పుష్ప పార్ట్ 1 కి ఇలా ఉంటే పార్ట్ 2 కి ఇంకెలా ఉంటుందో అని ఆడియన్స్ సూపర్ ఎగ్జైటెడ్ గా ఉన్నారు. ఇక ఇదిలా ఉంటే పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ సందీప్ వంగా తో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన ఓ న్యూస్ బయటకు వచ్చింది.

అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ ఈ సినిమాలతో సందీప్ తన డైరెక్షన్ టాలెంట్ చూపిస్తున్నాడు. యానిమల్ సినిమా టీజర్ తోనే అదుర్స్ అనిపించగా సినిమా కూడా సందీప్ మార్క్ తో వస్తుందని తెలుస్తుంది. ఇక ఈ సినిమా తర్వాత సందీప్ వంగా ప్రభాస్ తో స్పిరిట్ సినిమా అనౌన్స్ చేశాడు. అయితే ఈ సినిమా విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. ప్రభాస్ తో పాటుగా అల్లు అర్జున్ తో కూడా సందీప్ వంగా సినిమా ప్లానింగ్ లో ఉంది. ఈ సినిమా స్టోరీ, హీరో క్యారెక్టరైజేషన్ మెంటల్ ఎక్కించేస్తుందని అంటున్నారు.

అర్జున్ రెడ్డి సినిమాను మొదట అల్లు అర్జున్ కి అనుకున్న సందీప్ వంగ ఆయన కాదనడం వల్లే విజయ్ దేవరకొండతో చేశాడు. తెలుగు సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో నిలబెట్టే డైరెక్టర్స్ లో సందీప్ ఒకరని అతను చేసిన రెండు సినిమాలు చూస్తే అర్థమవుతుంది. యానిమల్ సినిమా కూడా సందీప్ మ్యాడ్నెస్ ఏంటన్నది చూపిస్తుందని అంటున్నారు. అల్లు అర్జున్ కోసం రాసుకున్న కథ మాత్రం ఒక రేంజ్ లో ఉంటుందని. ఆ సినిమా మాత్రం నేషనల్ లెవెల్ ఆడియన్స్ ను సర్ ప్రైజ్ చేస్తుందని అంటున్నారు. అల్లు అర్జున్ సందీప్ వంగ కాంబో సినిమా నెక్స్ట్ ఇయర్ సెట్స్ మీదకు వెళ్తుందట. ఈ సినిమా గురించి మరిన్ని డీటైల్స్ బయటకు రావాల్సి ఉంది.

ప్రభాస్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ సందీప్ లైనప్ కూడా క్రేజీగా ఉంది. సూపర్ స్టార్ మహేష్ తో కూడా సందీప్ సినిమా ఉంటుందని చెబుతున్నారు. మహేష్ రాజమౌళి సినిమా తర్వాత సందీప్ తో సినిమా ఆలోచనలో ఉన్నట్టు టాక్. మొత్తానికి సందీప్ వంగా పెద్ద ప్లానింగ్ లోనే ఉన్నాడని తెలుస్తుంది.