Begin typing your search above and press return to search.

షాహిద్ ని మరి అలా తీసిపారేశాడేంటి..!

అర్జున్ రెడ్డితో అదరగొట్టిన సందీప్ రెడ్డి వంగ తన లేటెస్ట్ మూవీ యానిమల్ తో పాన్ ఇండియా వైడ్ తన సత్తా చాటనున్నాడు.

By:  Tupaki Desk   |   28 Nov 2023 4:30 PM GMT
షాహిద్ ని మరి అలా తీసిపారేశాడేంటి..!
X

అర్జున్ రెడ్డితో అదరగొట్టిన సందీప్ రెడ్డి వంగ తన లేటెస్ట్ మూవీ యానిమల్ తో పాన్ ఇండియా వైడ్ తన సత్తా చాటనున్నాడు. అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్ ని బాలీవుడ్ లో తెరకెక్కించిన సందీప్ రెడ్డి వంగ ఆ సినిమాతో అక్కడ హిట్ అందుకున్నాడు. యానిమల్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న సందీప్ వంగ తన మొదటి బాలీవుడ్ హీరో షాహిద్ గురించి మాట్లాడేందుకు ఆసక్తి కనబరచలేదు.

రీసెంట్ ప్రెస్ మీట్ లో మీరు షాహిద్ కపూర్, రణ్ బీర్ కపూర్ ఇద్దరితో పనిచేశారు కదా. ఇద్దరి గురించి చెప్పండని అంటే.. షాహిద్ గురించి ఎక్కువ చెప్పలేం ఎందుకంటే అది రీమేక్.. కంపారిజన్ న్యాయంగా ఉండదు బట్ ఈ సినిమాకు రణ్ బీర్ అదరగొట్టాడు. నా కన్నా చిన్నవాడు కాబట్టి లేకపోతే ఆయన పర్ఫార్మెన్స్ కి కాళ్లు మొక్కుతా అన్నారు సందీప్ వంగ. ఈయకున్న పేషన్స్ ఎవరికి లేదని అన్నారు సందీప్ వంగ.

చేస్తున్న సినిమా హీరోనే పొగడటం, ప్రశంసించడం కామనే కానీ కబీర్ సింగ్ ఎంత రీమేక్ అయినా ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన షాహిద్ ని సందీప్ ఇలా తీసి వేసినట్టు మాట్లాడటం మాత్రం షాహిద్ కపూర్ ఫ్యాన్స్ ని హర్ట్ చేసింది. హీరోల్లో ఎవరి స్టామినా వారిది ఒకరు మరోలా చేయలేరు. యానిమల్ ఫీవర్ లో ఉన్న సందీప్ వంగ పక్కన ఉన్న రణ్ బీర్ ని కాకుండా షాహిద్ ని పొగిడితే ఎలా అనుకున్నాడో ఏమో కానీ షాహిద్ పై అతను చేసిన కామెంట్స్ మాత్రం ఆడియన్స్ ని షాక్ అయ్యేలా చేశాయి.

ఇక యానిమల్ సినిమా విషయానికి వస్తే ఫాదర్ అండ్ సన్ ఎమోషనల్ మూవీగా యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్టైనర్ గా వస్తుంది. టీ సీరీస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమా తెలుగులో దిల్ రాజు రిలీజ్ చేస్తున్నారు. యానిమల్ సినిమాకు బజ్ అయితే విపరీతంగా ఉంది. మరి సినిమా ఏ రేంజ్ లో సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. రన్ టైం కొద్దిగా ఎక్కువ అని చెబుతున్నా సినిమా మాత్రం ఆడియన్స్ ని ఎక్కడ డిజప్పాయింట్ చేయదని చాలా కాన్ఫిడెంట్ గా చెబుతున్నారు డైరెక్టర్ సందీప్ వంగ. సందీ సృష్టించిన ఈ యానిమల్ వరల్డ్ ఎన్ని సెన్సేషన్స్ క్రియేట్ చేస్తుందో చూడాలంటే జస్ట్ 2 డేస్ వెయిట్ చేస్తే సరిపోతుంది.