Begin typing your search above and press return to search.

సందీప్ 'స్పిరిట్'.. బాక్సాఫీస్ కు హెచ్చరిక!

ఇటీవల స్టోరీ లైన్ ను కూడా వెల్లడించారు సందీప్.

By:  Tupaki Desk   |   8 April 2024 2:46 PM GMT
సందీప్ స్పిరిట్.. బాక్సాఫీస్ కు హెచ్చరిక!
X

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబోలో స్పిరిట్ మూవీ రానున్న సంగతి తెలిసిందే. సుమారు రూ.300 కోట్లతో ఈ సినిమాను టీ సిరీస్, భద్రకాళి పిక్చర్స్ నిర్మిస్తున్నాయి. ఈ మూవీలో యాంగ్రీ పోలీస్ గా ప్రభాస్ కనిపించనున్నట్లు ఇప్పటికే సందీప్ ప్రకటించారు. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల స్టోరీ లైన్ ను కూడా వెల్లడించారు సందీప్.

ప్రస్తుతం సందీప్ వంగా.. ఈ మూవీ స్క్రిప్ట్ వర్క్ ను పూర్తి చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా గురించి మరిన్ని విషయాలు పంచుకున్నారాయన. స్పిరిట్ మూవీ యానిమల్ కన్నా ముందే తీయాల్సిందని, కానీ కొన్ని కారణాల వల్ల లేట్ అయిందని తెలిపారు సందీప్. ప్రభాస్ కోసం హాలీవుడ్ మూవీ రీమేక్ చేసే ప్లాన్ తన వద్దకు వచ్చిందని, కానీ రిజెక్ట్ చేసినట్లు చెప్పారు. ఆ తర్వాత స్పిరిట్ స్టోరీ ప్రభాస్ కు నచ్చడంతో ప్రాజెక్ట్ ఓకే అయిందని వెల్లడించారు.

ఇప్ప‌టి వ‌ర‌కు ఈ ప్రాజెక్ట్ స్క్రిప్ట్ ప‌నులు 60 శాతం పూర్తయ్యాయని సందీప్ తెలిపారు. త్వ‌ర‌లో స్టోరీ వర్క్ ను కంప్లీట్ చేసి డిసెంబర్‌ లో షూటింగ్‌ ప్రారంభించ‌నున్నామని వెల్లడించారు. తనతోపాటు ప్రభాస్ కు ఉన్న మార్కెట్ ఆధారంగా.. ఈ సినిమా ఓపెనింగ్స్ రూ.150 కోట్లు రావడం పక్కా అంటూ ధీమా వ్యక్తం చేశారు. టీజర్, ట్రైలర్ మంచి బజ్ క్రియేట్ చేస్తే.. ఈ స్థాయి వసూళ్లు సాధించడం సాధ్యమేనని అన్నారు.

ఈ సినిమా పూర్తి అయిన తర్వాత ర‌ణ్‌ బీర్ క‌పూర్‌ తో యానిమ‌ల్ సీక్వెల్ చేయనున్నట్లు తెలిపారు. ఇప్పటికే స్పిరిట్ సినిమాపై ఉన్న అంచనాలు.. సందీప్ లేటెస్ట్ కామెంట్స్ తో మరిన్ని పెరిగాయి. ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయిపోతున్నారు. సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నట్లు కామెంట్లు పెడుతున్నారు. ఈ మూవీ ఎనిమిది భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నట్లు తెలుస్తోంది.

రీసెంట్ గా ప్రభాస్ కల్కి మూవీ షూటింగ్ పూర్తి చేయగా.. ఆయన కొత్త సినిమాల అప్డేట్స్ తెగ వస్తున్నాయి. ఇటీవల హను రాఘవపూడి.. ప్రభాస్ తో చేస్తున్న పీరియాడిక్ యాక్షన్ మూవీకి సంబంధించి మూడు పాటలు కంప్లీట్ అయినట్లు వెల్లడించారు. ఇక త్వరలో రాజా సాబ్ సెట్స్ లో అడుగుపెట్టనున్నారు ప్రభాస్. మరి వరుస సినిమాలతో ప్రభాస్.. ఎలా ఆకట్టుకుంటారో చూడాలి.