Begin typing your search above and press return to search.

సందీప్ 'స్పిరిట్' - ఊహిస్తేనే కిక్కెక్కుతోంది!

మొదటి సినిమా అర్జున్ రెడ్డి తోనే పవర్ఫుల్ డైరెక్టర్ గా మంచి గుర్తింపు అందుకున్నాడు సందీప్ రెడ్డి వంగా

By:  Tupaki Desk   |   10 April 2024 12:36 PM GMT
సందీప్ స్పిరిట్ - ఊహిస్తేనే కిక్కెక్కుతోంది!
X

మొదటి సినిమా అర్జున్ రెడ్డి తోనే పవర్ఫుల్ డైరెక్టర్ గా మంచి గుర్తింపు అందుకున్నాడు సందీప్ రెడ్డి వంగా. ఇక అదే కథను మరోసారి బాలీవుడ్లో సరికొత్తగా ప్రజెంట్ చేసి అక్కడి ఆడియన్స్ కు కూడా మరింత దగ్గర అయ్యాడు. మూడవ సినిమా యానిమల్ నేషనల్ వైడ్ గా గుర్తింపును అందుకున్న విషయం తెలిసిందే. సందీప్ రెడ్డి అసలు టాలెంట్ ఏంటో ఈ సినిమాతో రుజువైంది.

అంతకు ముందు వరకు రొమాన్స్ విషయంలో కొంత కాంట్రవర్సీని ఎదుర్కొన్నప్పటికీ మూడో సినిమాలో మరింత వైలెన్స్ చూపించి విమర్శకులకు ఊహించని కౌంటర్ అయితే ఇచ్చాడు. వైలెన్స్ సినిమా అంటే ఏమిటో చూపిస్తాను అంటూ యానిమల్ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చాడు. అయితే ఇందులో ఒక మంచి లవ్ ఎమోషన్ తో పాటు ఒక మంచి మ్యూజిక్ కూడా హైలెట్ అయింది.

దర్శకుడు సందీప్ కు మ్యూజిక్ టేస్ట్ ఎంతలా ఉందో ఈ మూడు సినిమాలోని సాంగ్స్ వింటేనే అర్థమవుతుంది. మ్యూజిక్ డైరెక్టర్ లతో కలిసిపోయి అతను బెస్ట్ అవుట్ పుట్ వచ్చేలా వర్క్ చేయించుకునే విధానం పాటల్లో హైలెట్ అవుతుంది. ముఖ్యంగా యానిమల్ సినిమాలో ఎవరు వినని ఇతర భాషల పాటలను కూడా రీమిక్స్ చేసి మరి హైలెట్ చేశాడు.

ఇక చిన్ని చిన్ని ఆశ పాటను కూడా సరికొత్తగా ప్రజెంట్ చేసిన విధానం అందరినీ ఆకట్టుకుంది. అయితే ఇప్పుడు సందీప్ కు ఎవరికి ఉండని మ్యూజిక్ టేస్ట్ ఉందనే తరహాలో కామెంట్స్ వస్తున్నాయి. రీసెంట్ గా అతను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఒక వీడియో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అతని భావాల్ని అర్థమయ్యేలా చెబుతోంది. సముద్రంలో బోటులో స్పీడ్ గా వెళుతున్న సందీప్ సూపర్ స్టార్ రజనీ యొక్క 100వ చిత్రం “శ్రీ రాఘవేంద్ర”లోని “ఉనక్కుమ్ ఎనక్కుమ్” యొక్క రీమిక్స్ వెర్షన్ ని జత చేశాడు. ఆ పాటను మాస్ట్రో ఇళయరాజా స్వరపరిచారు.

వంగా వీడియోను షేర్ చేసినప్పటి నుండి, ప్రజలు ఈ ట్యూన్ గురించి కూడా మాట్లాడుతున్నారు. ప్రపంచ సంగీతంలో అతని అభిరుచి గురించి చర్చించుకుంటున్నారు. దర్శకుడు ఇరానియన్ పాట జమాల్ కుడును యానిమల్‌లో ఉపయోగించడం చాలా వైరల్ అయ్యింది. అలాగే ఇన్ స్టా పోస్ట్ కు “హై ఆన్ స్పిరిట్స్” అనే క్యాప్షన్ ఇచ్చి ‘హ్యాపీ ఉగాది పీపుల్’ అంటూ సోషల్ మీడియాలో వీడియోను పోస్ట్ చేశాడు.

ఇక డిసెంబర్ 2024 నుంచి సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉన్న ప్రభాస్ స్పిరిట్ స్క్రిప్ట్‌పై తాను వర్క్ చేస్తున్నట్లు పరోక్షంగా సూచించాడు. అందులో యాక్షన్ లవ్ ప్రభాస్ కటౌట్ వంటి అంశాలు ఎలా ఉంటాయో కానీ మ్యూజిక్ మాత్రం నెవ్వర్ బిఫోర్ అనేలా ఉంటుందని చెప్పవచ్చు. సందీప్ మ్యూజిక్ టేస్ట్ ను బట్టి స్పిరిట్ గురించి ఆలోచిస్తేనే కిక్కెక్కుతోందని నెటిజన్లు పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు.