Begin typing your search above and press return to search.

మనోడిని మెచ్చుకున్న ఒకే ఒక్క తమిళ హీరో తంబీ

అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ వంగ ప్రస్తుతం బాలీవుడ్ లో మోస్ట్‌ హ్యాపెనింగ్ డైరెక్టర్స్ లో ఒకడు

By:  Tupaki Desk   |   6 March 2024 7:02 AM GMT
మనోడిని మెచ్చుకున్న ఒకే ఒక్క తమిళ హీరో తంబీ
X

అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ వంగ ప్రస్తుతం బాలీవుడ్ లో మోస్ట్‌ హ్యాపెనింగ్ డైరెక్టర్స్ లో ఒకడు. కబీర్ సింగ్ మరియు యానిమల్‌ సినిమాలు చేసి హిందీ ప్రేక్షకులకు సరికొత్త సినిమా ను పరిచయం చేశాడు. ముఖ్యంగా యానిమల్ సినిమాతో ఉత్తరాది ప్రేక్షకులను సందీప్ వంగ సర్‌ప్రైజ్ చేయడంతో పాటు షాక్ అయ్యేలా చేశాడు.

తండ్రి కొడుకుల సెంటిమెంట్‌ సినిమాను ఇంత హింసాత్మకంగా తీయవచ్చా.. అది కూడా ఆకట్టుకునే విధంగా అంటూ ఫిల్మ్‌ మేకర్స్ కూడా ప్రశంసించారు. బాలీవుడ్ తో పాటు కన్నడ మలయాళ సినీ ఇండస్ట్రీ నుంచి కూడా మనోడి యానిమల్ సినిమాకు మంచి మార్కులు పడ్డాయి. కానీ తమిళ సినీ ఇండస్ట్రీ వారు మాత్రం యానిమల్ ను లైట్‌ తీసుకున్నారు.

యానిమల్‌ హిందీ వర్షన్ పెద్దగా వసూళ్లు దక్కించుకోలేదు. అంతే కాకుండా పలువురు తమిళ సెలబ్రెటీలు యానిమల్‌ సినిమా పై పెదవి విరిచారు. కొందరు బాహాటంగా విమర్శిస్తే మరి కొందరు తెర వెనుక అన్నట్లుగా విమర్శించారు. మొత్తానికి సందీప్ వంగ కు తమిళ సినీ ఇండస్ట్రీ స్టార్స్ నుంచి పెద్దగా స్పందన దక్కలేదు.

తమిళ ఇండస్ట్రీకి చెందిన ఒకే ఒక్కడు హీరో శివ కార్తికేయన్‌ ఒక కార్యక్రమంలో భాగంగా మాట్లాడుతూ దర్శకుడు సందీప్ వంగ పై ప్రశంసలు కురిపించాడు. శివ కార్తికేయన్ మాట్లాడుతూ.. సందీప్ సర్ క్రాప్ట్‌ నాకు బాగా నచ్చుతుంది. బ్యాక్‌ గ్రౌండ్ మ్యూజిక్ ను ఉపయోగించుకునే తీరు కూడా అద్భుతంగా ఉంటుంది. యానిమల్ ను చూస్తున్నప్పుడు చాలా థ్రిల్లింగ్ గా అనిపించింది.

ఆయన సినిమాలతో పాటు ఆయన ఇంటర్వ్యూలను కూడా నేను ఆసక్తిగా చూస్తూ ఉంటాను. ముఖ్యంగా ఆయన కొన్ని ప్రశ్నలకు చెప్పే ముక్కు సూటి సమాధానాలు చాలా బాగుంటాయి. ఆయన మాత్రమే అంత ముక్కు సూటిగా మాట్లాడగలరు అన్నట్లుగా శివ కార్తికేయన్‌ పేర్కొన్నాడు. మొత్తానికి తమిళ సినీ ఇండస్ట్రీ నుంచి ఒకే ఒక్క హీరో మన దర్శకుడు సందీప్‌ వంగ ను మెచ్చుకోవడంతో సోషల్‌ మీడియాలో ఈ వీడియో వైరల్‌ అవుతోంది.