Begin typing your search above and press return to search.

వంగా యూనివర్స్… ఇది సాధ్యమేనా?

సందీప్ రెడ్డి వంగా గత ఏడాది యానిమల్ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చి బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నారు.

By:  Tupaki Desk   |   29 Jan 2024 5:11 AM GMT
వంగా యూనివర్స్… ఇది సాధ్యమేనా?
X

సందీప్ రెడ్డి వంగా గత ఏడాది యానిమల్ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చి బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నారు. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా 900 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. మెజారిటీ ఆడియన్స్ యానిమల్ సినిమాకి కనెక్ట్ అయ్యారు. అయితే ఒక వర్గం ఆడియన్స్ మాత్రం యానిమల్ మూవీ హింసని ప్రేరేపించే విధంగా ఉందని, స్త్రీలని కించపరిచే విధంగా ఉందని విమర్శలు చేశారు.

నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అయిన తర్వాత కూడా ఒక వర్గం సినిమాని డిజిటల్ నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అయితే యానిమల్ సినిమాలో పోలీసులు నిద్రపోయారు అంటూ మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. అయితే బలమైన ఎమోషన్స్ ని చెప్పాలని అనుకున్నప్పుడు ఒక్కొక్కరు ఒక్కో మార్గం ఎంచుకుంటారు. యానిమల్ సినిమాలో కూడా తండ్రి, కొడుకుల ఎమోషనల్ లవ్ బాండింగ్ కి సందీప్ తనదైన శైలిలో ప్రెజెంట్ చేశారు.

తాజాగా ఆ సినిమాలో నటనకి గాను రణబీర్ కపూర్ కి బెస్ట్ యాక్టర్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డు వచ్చింది. ప్రస్తుతం సందీప్ రెడ్డి ఫోకస్ అంతా కూడా ప్రభాస్ తో చేయబోయే స్పిరిట్ మీద ఉంది. ఇందులో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ కనిపించబోతున్నాడు. ఇది కూడా సందీప్ స్టైల్ లోనే ఉండబోతోంది. ప్రభాస్ క్యారెక్టర్ యాంగ్రీ యంగ్ మెన్ గా ఉంటుందంట.

అయితే యానిమల్, స్పిరిట్ సినిమాలు సందీప్ రెడ్డి వంగా సినిమాటిక్ యూనివర్స్ లో భాగం అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో కొంతమంది పోస్టులు చేస్తున్నారు. అవి కాస్తా వైరల్ అవుతున్నాయి. యానిమల్ మూవీలో ఒక సీన్ లో సోదరి కొడుకు టీషర్ట్ మీద రెబల్స్ వెల్ కమ్ అని రాసి ఉంటుంది. దీనిని స్క్రీన్ షాట్ తీసి స్పిరిట్ మూవీకి లీడ్ అంటూ ట్రెండ్ చేస్తున్నారు. సొంత బావని చంపిన హీరోపై రివెంజ్ తీర్చుకోవడానికి మళ్ళీ అతని మేనల్లుడుగా ప్రభాస్ వస్తాడా అనే సందేహాలు కలిగిస్తున్నారు.

అయితే సందీప్ రెడ్డి వంగా యాదృశ్చికంగా ఈ టీషర్ట్ యూజ్ చేసి ఉంటాడు తప్ప సినిమాటిక్ యూనివర్స్ అయితే కాదని డార్లింగ్ ఫ్యాన్స్ నుంచి వినిపిస్తోన్న మాట. ఇది వాస్తవం అయ్యే అవకాశమే లేదని అంటున్నారు. అసలు యానిమల్ కథకి, స్పిరిట్ మూవీ స్టోరీకి సంబంధమే ఉండదని సినీ విశ్లేషకులు కూడా అభిప్రాయం పడుతున్నారు. ఈ మధ్యకాలంలో లోకేష్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్ స్టార్ట్ అయిన తర్వాత ప్రశాంత్ నీల్ సినిమాలు అన్ని సినిమాటిక్ యూనివర్స్ కథలే అంటూ ప్రచారం మొదలు పెట్టారు. ఇప్పుడు సందీప్ సినిమాలని కూడా అలాగే వైరల్ చేస్తున్నారు.