Begin typing your search above and press return to search.

గేమ్ ఛేంజర్ గా సందీప్ వంగా!

అర్జున్ రెడ్డి మూవీతో డైరెక్టర్ గా మారిన సందీప్ రెడ్డి వంగా.. తన ఫస్ట్ సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నారు.

By:  Tupaki Desk   |   29 March 2024 2:30 PM GMT
గేమ్ ఛేంజర్ గా సందీప్ వంగా!
X

టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా.. ఇప్పటి వరకు తీసింది రెండు సినిమాలే.. కానీ మూవీ లవర్స్ ను విపరీతంగా ఆకట్టుకున్నారు. తనకంటూ ఇండస్ట్రీలో స్పెషల్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నారు. మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ గా మారిపోయారు. ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. నెవ్వర్ బిఫోర్ అనేలా తన సినిమాలతో అలరించారు. బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు కొల్లగొట్టారు.

అర్జున్ రెడ్డి మూవీతో డైరెక్టర్ గా మారిన సందీప్ రెడ్డి వంగా.. తన ఫస్ట్ సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నారు. రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన ఈ సినిమా.. అప్పట్లో ఓ రేంజ్ లో హిట్ అయింది. అదే మూవీని బాలీవుడ్ లో షాహిద్ కపూర్ తో కబీర్ సింగ్ గా డబ్బింగ్ చేశారు. అక్కడ కూడా సూపర్ హిట్ కొట్టేశారు. ఇక ఇటీవల యానిమల్ మూవీతో ఏకంగా సంచలనం సృష్టించారు.

ఎన్నో విమర్శలు వచ్చినా.. తగ్గేదేలే అంటూ దూసుకెళ్లింది యానిమల్ మూవీ. బాక్సాఫీస్ వద్ద రూ.900 కోట్లకుపైగా వసూళ్లు సాధించి లాభాలు కురిపించింది. రణబీర్ కపూర్, రష్మిక నటించిన ఈ మూవీ మేకర్స్ కు కోట్లలో లాభాలు అందించింది. సందీప్ రెండు సినిమాల్లోనూ భద్రకాళి పిక్చర్స్ బ్యానర్ భాగమైన విషయం తెలిసిందే. అందులో వంగా సోదరులు సందీప్, ప్రణయ్ భాగస్వాములుగా ఉన్నారు.

ఇటీవల సందీప్ రెడ్డి.. తెలుగు సినిమాలు నిర్మించే యోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ప్రతిభ గల యంగ్ డైరెక్టర్లను పరిచయం చేస్తూ సందీప్ టాలీవుడ్ మూవీలను తెరకెక్కించనున్నారు. అందుకోసం హైదరాబాద్ లో ఆఫీస్ ను లీజుకు తీసుకుని త్వరలోనే కార్యాలయాన్ని మొదలుపెట్టనున్నారు. స్పెషల్ టీమ్ ను ఏర్పాటు చేసి స్క్రిప్టులు ఖరారు చేయనున్నారు. 2024లో తన నిర్మాణంలో రెండు తెలుగు సినిమాలు ప్రకటించనున్నారట సందీప్.

టాలీవుడ్ లోనే కెరీర్ స్టార్ట్ చేసిన సందీప్ రెడ్డి వంగా ఇక్కడ కొత్త డైరెక్టర్ల ప్రతిభను ప్రోత్సహించడం.. సినిమాలపై ఆయన అభిరుచిని ప్రతిబింబిస్తుందని సినీ పండితులు చెబుతున్నారు. టాలీవుడ్ లో హెడ్ క్వార్టర్స్ లా ఆఫీస్ ఏర్పాటు చేసి కొత్త సినిమాలు తెరకెక్కిస్తూ, నిర్మిస్తూ భవిష్యత్తులో సౌత్ ఇండస్ట్రీలో గేమ్ ఛేంజర్ గా మారే అవకాశం కచ్చితంగా ఉందని అంటున్నారు. మరి చూడాలి సందీప్ ఎలా సక్సెస్ అవుతారో.