Begin typing your search above and press return to search.

స్టార్ హీరో భార్యకు వంగా స్ట్రాంగ్ కౌంటర్

అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ తర్వాత డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన సినిమా యానిమల్

By:  Tupaki Desk   |   3 Feb 2024 8:08 AM GMT
స్టార్ హీరో భార్యకు వంగా స్ట్రాంగ్ కౌంటర్
X

అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ తర్వాత డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన సినిమా యానిమల్. బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా నటించిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.900 కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టింది. అనిల్ కపూర్, బాబీ డియోల్, త్రిప్తి డిమ్రి నటించిన ఈ మూవీకి అన్ని వర్గాల నుంచి సూపర్ డూపర్ రెస్పాన్స్ వచ్చింది.

కానీ కొంతమంది సినీ ప్రముఖులు ఈ మూవీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. వయోలెన్స్, స్త్రీ పట్ల ద్వేషాన్ని వేధింపులను ప్రోత్సహించేలా ఉందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సినిమా స్త్రీ విద్వేష చిత్రమని మండిపడ్డారు. ఇటీవల బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు.. ఓ ఇంటర్వ్యూలో యానిమల్, కబీర్ సినిమాలు స్త్రీల పట్ల ద్వేషం, వేధింపులను ప్రోత్సహించేలా ఉన్నాయని కామెంట్స్ చేశారు.

తాజాగా డైరెక్టర్ సందీప్ రెడ్డి ఓ ఇంటర్వ్యూకు హాజరయ్యారు. అమీర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు చేసిన విమర్శలపై ఆయనకు ప్రశ్న ఎదురైంది. దీనికి సందీప్ రెడ్డి వంగా తనదైన శైలిలో సమాధానమిచ్చారు. ఆమె పేరును ప్రస్తావించకుండా చురకలంటించారు. ఒకసారి అమీర్ ఖాన్ నటించిన దిల్‌ సినిమా చూడాలని ఆమెకు సలహా ఇచ్చారు.

'నేను ఆమెకు ఒకటే చెబుతున్నా. అమీర్ ఖాన్‌ ను వెళ్లి అడగండి. ఆయన తీసిన దిల్ సినిమాలో దాదాపు అమ్మాయిపై రేప్‌ కు ప్రయత్నించే పరిస్థితిని సృష్టించారు. కానీ ఆ తర్వాత ఆమెనే తప్పు చేసినట్లుగా భావించేలా చేస్తారు. కానీ చివరికి అతనితోనే ప్రేమలో పడుతుంది. ఇదంతా ఏమిటి? ఇలాంటి విషయాలు తెలుసుకోకుండానే మాపై ఎలా కామెంట్లు చేస్తారో అర్థం కావడం లేదు' అంటూ సందీప్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

అమీర్ ఖాన్, మాధురీ దీక్షిత్ జంటగా నటించిన సినిమా దిల్. ఇందులో హీరో తనపై అత్యాచారం జరిగిందని ఆరోపణలు చేస్తుంది మాధురి. దీంతో ఆమెపై దాడి చేస్తానని బెదిరించి భయపెడతాడు హీరో. కానీ ఆ తర్వాత ఆమెను విడిచిపెడతాడు. అప్పట్లో ఈ మూవీ భారీ విజయాన్ని అందుకుంది. కానీ ఈ సీన్ మాత్రం అప్పట్లో విమర్శలకు దారి తీసింది. ఇప్పుడు సందీప్ వ్యాఖ్యలతో ఈ సీన్ మళ్లీ హాట్ టాపిక్ గా మారింది.