Begin typing your search above and press return to search.

వీడియో : ప్రభాస్‌ సినిమా చంపేయాలన్నా ప్లీజ్‌..!

ఈ వైల్డ్‌ దర్శకుడి తదుపరి సినిమా ప్రభాస్ తో అనే విషయం తెల్సిందే. ప్రభాస్ తో స్పిరిట్ సినిమా ను ప్రకటించి చాలా కాలం అయ్యింది

By:  Tupaki Desk   |   16 Jan 2024 8:45 AM GMT
వీడియో : ప్రభాస్‌ సినిమా చంపేయాలన్నా ప్లీజ్‌..!
X

అర్జున్‌ రెడ్డి సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన సందీప్ రెడ్డి వంగ తాజాగా యానిమల్ సినిమా తో బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్నాయి. వెయ్యి కోట్ల మార్క్‌ కొద్దిలో మిస్ అయ్యింది. అయినా కూడా యానిమల్‌ సినిమా తో సందీప్ రెడ్డి దేశంలోనే టాప్ దర్శకుల జాబితా లో నిలిచాడు అనడంలో సందేహం లేదు.

ఈ వైల్డ్‌ దర్శకుడి తదుపరి సినిమా ప్రభాస్ తో అనే విషయం తెల్సిందే. ప్రభాస్ తో స్పిరిట్ సినిమా ను ప్రకటించి చాలా కాలం అయ్యింది. యానిమల్ కి ఎక్కువ సమయం పట్టడం వల్ల స్పిరిట్ ఆలస్యం అవుతుంది. ఈ ఏడాది చివర్లో షూటింగ్ ప్రారంభించబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది.

తాజాగా దర్శకుడు సందీప్ వంగ సంక్రాంతి సంబరాల్లో పాల్గొనేందుకు గాను భీమవరం వెళ్లాడు. అక్కడ కారులో ప్రయాణిస్తున్న సందీప్ వంగ ను గుర్తించిన కొందరు ప్రభాస్ దగ్గరకు వెళ్లి మాట్లాడారు. ప్రభాస్ అన్న తో సినిమా చంపేయాలన్నా అంటూ విజ్ఞప్తి చేశారు.

స్పిరిట్ ఎప్పుడు అని వారు ప్రశ్నించిన సమయంలో ఈ ఏడాదిలో ప్రారంభిస్తాను అన్నట్లుగా సందీప్ వారికి సమాధానం ఇచ్చాడు. ప్రభాస్ సినిమా కోసం ఇక్కడి వారు అంతా కూడా చూస్తున్నారు. యానిమల్‌ రేంజ్ లో ప్రభాస్ అన్నతో సినిమా తీయాలని ఫ్యాన్స్ గట్టిగానే సందీప్‌ రెడ్డి వంగకి విజ్ఞప్తి చేశారు.

తాజాగా ప్రభాస్‌ సలార్ సినిమా తో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. ప్రభాస్‌ తదుపరి సినిమా ప్రాజెక్ట్‌ కే 'కల్కి' కూడా రెడీ అవుతోంది. అంతే కాకుండా మారుతి దర్శకత్వంలో రాజా సాబ్‌ సినిమా కూడా రాబోతుంది. భారీ అంచనాల నడుమ సందీప్ వంగ సినిమా స్పిరిట్ మొదలు అవ్వబోతుంది. 2026 కి స్పిరిట్ వస్తుందేమో చూడాలి.