Begin typing your search above and press return to search.

ప్రభాస్ ఫ్యాన్స్ ఆరాటం.. సందీప్ కు ఎంత ఓపికో

యానిమల్ సినిమాతో సందీప్ రెడ్డి వంగా గత ఏడాది బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నారు

By:  Tupaki Desk   |   16 Jan 2024 4:14 AM GMT
ప్రభాస్ ఫ్యాన్స్ ఆరాటం.. సందీప్ కు ఎంత ఓపికో
X

యానిమల్ సినిమాతో సందీప్ రెడ్డి వంగా గత ఏడాది బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నారు. ఈ మూవీతో హిందీలో గత ఏడాది థర్డ్ హైయెస్ట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్నారు. దీనికి సీక్వెల్ కూడా ఉండబోతోందని సందీప్ రెడ్డి వంగా క్లారిటీ ఇచ్చారు. అయితే ప్రభాస్ తో చేయబోయే స్పిరిట్ మూవీ తర్వాతనే యానిమల్ పార్ట్ 2 ఉంటుందని స్పష్టం చేశారు.

ప్రస్తుతం ప్రభాస్ స్పిరిట్ మూవీకి సంబందించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. మేగ్జిమం స్క్రిప్ట్ కంప్లీట్ అయ్యిందంట. డైలాగ్ వెర్షన్ సిద్ధం చేసే పనిలో ప్రస్తుతం సందీప్ ఉన్నట్లు తెలుస్తోంది. కల్కి సినిమాని మేలో రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. దీంతో ఈ మూవీ జూన్ లేదా జులై లో సెట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉందనే ప్రచారం నడుస్తోంది.

ఈ చిత్రంలో ప్రభాస్ మొదటిసారిగా యాంగ్రీ యంగ్ మెన్ గా పవర్ ఫుల్ పోలీస్ గా కనిపించబోతున్నారు. దీంతో సినిమాపై చాలా ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. కచ్చితంగా ప్రభాస్ కెరియర్ లో బెస్ట్ మూవీని సందీప్ ఇస్తాడని ఫ్యాన్స్ చాలా నమ్మకంగా ఉన్నారు. ఇక డార్లింగ్ అభిమానులు అయితే సోషల్ మీడియాతో పాటు బయట కూడా సందీప్ రెడ్డిని వదలడం లేదు.

స్పిరిట్ సినిమా గురించి ఎక్కువగా అడుగుతున్నారు. తాజాగా డార్లింగ్ ఫ్యాన్స్ తో సందీప్ రోడ్డు మీద కారులో వెళ్తూ మాట్లాడిన వీడియో వైరల్ అయ్యింది. ఈ వీడియోలో ప్రభాస్ ఫ్యాన్స్ స్పిరిట్ సినిమా అప్డేట్ ఎప్పుడు ఉంటుందని సందీప్ ని అడిగారు. అలాగే ప్రభాస్ కి సూపర్ హిట్ ఇవ్వాలని, దానికోసం ఫ్యాన్స్ అందరూ వెయిట్ చేస్తున్నారని తెలిపారు. దీనికి సందీప్ రెడ్డి వంగా చాలా కూల్ గా సమాధానం చెప్పారు.

తనని విమర్శించే వారికి అదిరిపోయే రేంజ్ లో సమాధానం చెప్పే సందీప్ రెడ్డి వంగా తన దగ్గరకి అభిమానంతో వచ్చేవారితో మాత్రం ఓపికతో మాట్లాడుతూ ప్రశాంతంగా వారికి కావాల్సిన సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాడని ఈ వీడియో చూసిన వారు కామెంట్స్ చేస్తున్నారు. ఈ వ్యక్తిత్వమే సందీప్ కి అభిమానులు పెరిగేలా చేస్తోందని అంటున్నారు.