Begin typing your search above and press return to search.

ఆ కథతోనే స్పిరిట్.. రెబల్ ఫ్యాన్స్ కి పండగే..!

రెబల్ స్టార్ ప్రభాస్ రీసెంట్ గా సలార్ 1 సీజ్ ఫైర్ తో వచ్చి బాక్సాఫీస్ దగ్గర మరోసారి తన సత్తా చాటాడు

By:  Tupaki Desk   |   3 Jan 2024 2:45 AM GMT
ఆ కథతోనే స్పిరిట్.. రెబల్ ఫ్యాన్స్ కి పండగే..!
X

రెబల్ స్టార్ ప్రభాస్ రీసెంట్ గా సలార్ 1 సీజ్ ఫైర్ తో వచ్చి బాక్సాఫీస్ దగ్గర మరోసారి తన సత్తా చాటాడు. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో తెరకెక్కిన సలార్ సినిమా మొదటి భాగం ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ పెట్టిందని చెప్పొచ్చు. ఇక సలార్ సెకండ్ పార్ట్ పై భారీ అంచనాలే ఉన్నాయి. సలార్ 2 సంగతి పక్కన పెడితే ఈలోగా ప్రభాస్ కల్కి 2898 ఏడి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ ఇయర్ మే లో సినిమా రిలీజ్ అవుతుంది. నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో భారీ బడ్జెట్ అంతకుమించిన హైప్ తో కల్కి వస్తుంది.

ఇక ఈ సినిమా తర్వాత ప్రభాస్ సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో స్పిరిట్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాపై ప్రభాస్ ఫ్యాన్స్ చాలా ఎగ్జైటెడ్ గా ఉన్నారు. యానిమల్ సినిమాతో సందీప్ వంగ చేసిన రచ్చ తెలిసిందే. డైరెక్టర్ గా తన మార్క్ చూపిస్తున్న సందీప్ రెడ్డి వంగ హీరోల మాస్ క్యారెక్టరైజేషన్ తో వావ్ అనిపిస్తున్నాడు. ప్రభాస్ తో స్పిరిట్ తో రాబోతున్న సందీప్ వంగ ఈ సినిమా కథ ఎలా ఉండబోతుంది అన్న దాని గురించి ఒక హింట్ ఇచ్చాడు.

ప్రభాస్ స్పిరిట్ ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీస్ కథతో వస్తుందని అన్నారు సందీప్ రెడ్డి వంగ. కథ చాలా వరకు పూర్తైందని.. కొన్ని సీన్స్ ఇంకా కథలో కొన్ని మార్పులు చేస్తున్నామని అన్నారు సందీప్ రెడ్డి వంగ. రీసెంట్ గా ఒక స్పెషల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న సందీప్ రెడ్డి వంగ తన సినిమాల గురించి.. రాబోయే సినిమాల ప్లానింగ్ గురించి చెప్పుకొచ్చారు.

స్పిరిట్ సినిమా గురించి చెబుతూ ఒక సిన్సియర్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ కథతో ఈ సినిమా వస్తుందని అన్నారు. ప్రభాస్ స్పిరిట్ నెక్స్ట్ లెవెల్ క్రేజ్ తో వస్తుంది. సినిమాను టీ సీరీస్ భారీ బడ్జెట్ తో నిర్మించాలని చూస్తున్నారు. ఈ సినిమాలో మిగతా కాస్టింగ్ ఎవరన్నది తెలియాల్సి ఉంది. ఈ ఇయర్ మే లో కల్కితో వస్తున్న ప్రభాస్ ఇయర్ ఎండింగ్ లో మారుతి సినిమాతో వస్తారని తెలుస్తుంది. ఇక స్పిరిట్ సినిమా 2025 సంక్రాంతికి లేదా సమ్మర్ కి తీసుకొస్తారని చెప్పొచ్చు. స్పిరిట్ తర్వాత అల్లు అర్జున్ తో సినిమా ప్లానింగ్ లో ఉన్నాడు సందీప్ రెడ్డి వంగ.