Begin typing your search above and press return to search.

'యానిమ‌ల్' తో కొడితే సందీప్ ని అక్క‌డే లాక్ చేస్తారేమో!

'అర్జున్ రెడ్డి' ని 'క‌బీర్ సింగ్' గా రీమేక్ చేసి సందీప్ రెడ్డి వంగ బాలీవుడ్ లోనూ సంచ‌ల‌న విజ‌యం అందుకున్న సంగ‌తి తెలిసిందే

By:  Tupaki Desk   |   30 Sep 2023 4:30 PM GMT
యానిమ‌ల్ తో కొడితే సందీప్ ని అక్క‌డే లాక్ చేస్తారేమో!
X

'అర్జున్ రెడ్డి' ని 'క‌బీర్ సింగ్' గా రీమేక్ చేసి సందీప్ రెడ్డి వంగ బాలీవుడ్ లోనూ సంచ‌ల‌న విజ‌యం అందుకున్న సంగ‌తి తెలిసిందే. ఆ విజ‌యం చూసే రాక్ స్టార్ ర‌ణ‌బీర్ క‌పూర్ 'యానిమ‌ల్' కి అవ‌కాశం ఇచ్చాడు. ప్ర‌స్తుతం సినిమా సెట్స్ లో ఉంది. తాజాగా రిలీజ్ అయిన టీజ‌ర్ మార్కెట్ లో దూసుకుపోతు న్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌చార చిత్రాల‌కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ర‌ష్మిక మంద‌న్న హాట్ లుక్ అంత‌టా కాక పుట్టిస్తుంది.

హీరో-హీరోయిన్ మ‌ధ్య ఘాటైన రొమాంటిక్ స‌న్నివేశాల‌కు కొద‌వ‌లేద‌ని తెలుస్తోంది. దీంతో సినిమాపై అంచ‌నాలు అంత‌కంత‌కు రెట్టింపు అవుతున్నాయి. సందీప్ 'యానిమ‌ల్' తోనూ భారీ హిట్ కొడ‌తాడు అన్న అంచ‌నాలు పెరిగిపోతున్నాయి. అదే జ‌రిగితే సందీప్ బాలీవుడ్ లోనే లాక్ అయ్యే అవ‌కాశం ఉంద‌ని వినిపిస్తుంది. ఎందుకంటే ఆయ‌న మ‌న‌సు కూడా టాలీవుడ్ కంటే బాలీవుడ్ నే కోరుకుంటుంది.

'అర్జున్ రెడ్డి' త‌ర్వాత టాలీవుడ్ లో అవ‌కాశాలు వ‌చ్చాయి. టాప్ స్టార్లు అంద‌రూ ఆయ‌న క్యూలో ఉన్నారు. కానీ సందీప్ మాత్రం బాలీవుడ్ కి వెళ్లి ర‌ణ‌బీర్ క‌పూర్ తో సినిమా చేస్తున్నాడు. ఓ తెలుగు డైరెక్ట‌ర్ తెలుగు వాళ్ల‌ని ప‌క్క‌న‌బెట్టి తొలి ప్రాధాన్య‌త హిందీ వాళ్ల‌కు ఇవ్వ‌డం అన్న‌ది చిన్న విమ‌ర్శ‌గా చాలా కాలంగా వినిపిస్తోంది. ఇదే విమ‌ర్శ‌ని బాలీవుడ్ ఇప్పుడు ఎన్ క్యాష్ చేసుకునే అవ‌కాశం ఉంది. ప్ర‌తిభావం తుల్ని ఎలాగైనా త‌మ ఇండ‌స్ట్రీలో లాక్ చేయాల‌న్న‌ది అక్క‌డ నిర్మాత‌ల ప్లాన్.

ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్..య‌శ్ రాజ్ ఫిలింస్.. టీ-సిరీస్.. రెడ్ చిల్లీస్ ఎంట‌ర్ టైన్ మెంట్ లాంటి అగ్ర‌గామి నిర్మాణ‌ సంస్థ‌లు అక్క‌డ నుంచి తిరిగి పంపిచ‌డానికి అంత ఈజీగా ఒప్పుకోవు. 'బాహుబ‌లి' త‌ర్వాత ప్ర‌భాస్.. రాజ‌మౌళిని క‌ర‌ణ్ జోహార్ ఎలాగైనా త‌మ ఇండ‌స్ట్రీకి ప‌ట్టుకెళ్లిపోవాల‌ని ట్రై చేసారు. అలాగే అమీర్ ఖాన్ నిర్మాణ సంస్థ కూడా జ‌క్క‌న్న కోసం ఆ ర‌క‌మైన ప్ర‌య‌త్నం చేసింది.

'ఆర్ ఆర్ ఆర్' స‌క్సెస్ త‌ర్వాత ఎన్టీఆర్..రామ్ చ‌ర‌ణ్ కి బాలీవుడ్ మంచి ఆఫ‌ర్లు ఇచ్చింది. వైఆర్ ఎఫ్ లో తార‌క్ ఆ కోణంలో తాజాగా లాక్ అయ్యారు. 'పుష్ప' త‌ర్వాత ఐకాన్ స్టార్ కి అల్లు అర్జున్ కి అలాంటి ఎర వేసే ప్ర‌య‌త్నాలు బాలీవుడ్ జోరుగా చేస్తోంది. ఈ సీమ‌క‌ర‌ణాల నేప‌థ్యంలో సందీప్ ని బాలీవుడ్ అంత తొంద‌ర‌గా బ‌య‌ట‌కు వెళ్ల‌నివ్వ‌దు అని గ‌ట్టిగా వినిపిస్తోన్న మాట‌. 'యానిమ‌ల్' తో భారీ హిట్ కొడితే గ‌నుక ఏదో ర‌కంగా సందీప్ ని మ‌రో సినిమాకి అక్క‌డే లాక్ చేసే అవ‌కాశం ఉంద‌ని వినిపిస్తోంది.