Begin typing your search above and press return to search.

వంగా.. ఇక నెక్స్ట్ 1000 కోట్లే!

యానిమల్ సినిమాతో సందీప్ రెడ్డి 900 కోట్ల కలెక్షన్స్ మార్క్ ని దాటిపోయాడు. నెక్స్ట్ అతని ముందున్న టార్గెట్ 1000 కోట్లు అనే మాట వినిపిస్తోంది.

By:  Tupaki Desk   |   5 Feb 2024 2:30 PM GMT
వంగా.. ఇక నెక్స్ట్ 1000 కోట్లే!
X

అర్జున్ రెడ్డి సినిమాతో సందీప్ రెడ్డి వంగా టాలీవుడ్ లోకి డైరెక్టర్ గా అడుగుపెట్టాడు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఈ సినిమా విజయ్ దేవరకొండని స్టార్ గా మార్చేసింది. మూవీ ఏకంగా 50 కోట్ల కలెక్షన్స్ ని రాబట్టింది. సందీప్ రెడ్డి వంగాకి కూడా అర్జున్ రెడ్డి మూవీ స్టార్ ఊహించని స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చింది. దీని తర్వాత కొంత గ్యాప్ తీసుకొని అర్జున్ రెడ్డి మూవీని కబీర్ సింగ్ గా హిందీలో రీమేక్ చేశారు.

షాహిద్ కపూర్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. అలాగే ఏకంగా 375 కోట్ల గ్రాస్ వసూళ్లు చేసింది. షాహిద్ కపూర్ కెరియర్ లోనే ఈ మూవీ హైయెస్ట్ కలెక్షన్స్ ని అందుకుంది. రీసెంట్ గా రణబీర్ కపూర్ హీరోగా యానిమల్ సినిమాని ప్రేక్షకులకి అందించారు. ఈ మూవీ 920 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. సందీప్ రెడ్డి వంగా చేసిన మూడు సినిమాలు కూడా కల్ట్ క్లాసిక్ అనే బ్రాండ్ తెచ్చుకున్నాయి.

హీరో క్యారెక్టరైజేషన్ లో ఎక్స్ట్రీమ్ ఎమోషన్స్ ని రిప్రజెంట్ చేయడం సందీప్ రెడ్డి స్టైల్. అదే యూత్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యింది. ఇప్పుడు సందీప్ రెడ్డి వంగా ప్రభాస్ హీరోగా స్పిరిట్ మూవీ చేయబోతున్నాడు. ఈ మూవీ స్క్రిప్ట్ వర్క్ ప్రస్తుతం జరుగుతోంది. భారీ బడ్జెట్ తో టి-సిరీస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. సందీప్ రెడ్డి కూడా ఈ సినిమాకి నిర్మాణ భాగస్వామిగా ఉన్నాడు.

యానిమల్ సినిమాతో సందీప్ రెడ్డి 900 కోట్ల కలెక్షన్స్ మార్క్ ని దాటిపోయాడు. నెక్స్ట్ అతని ముందున్న టార్గెట్ 1000 కోట్లు అనే మాట వినిపిస్తోంది. ప్రస్తుతం సందీప్ రెడ్డికి ఉన్న క్రేజ్ ప్రభాస్ మాస్ ఇమేజ్ కలిస్తే వెయ్యి కోట్లు పెద్ద కష్టమైన విషయం కాదని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. త్వరలో ఈ సినిమా షూటింగ్ కి సంబందించిన అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ వచ్చే అవకాశం ఉంది.

సందీప్ రెడ్డి వంగా ఈ సినిమా డైలాగ్ వెర్షన్ మీద ప్రస్తుతం వర్క్ చేస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది స్పిరిట్ మూవీ ప్రేక్షకుల ముందుకి రావొచ్చని అంచనా వేస్తున్నారు.