Begin typing your search above and press return to search.

అమ్మ‌కి క్యాన్స‌ర్.. నా జీవితం అయిపోయింద‌నుకున్నా!

`అర్జున్ రెడ్డి`...`క‌బీర్ సింగ్` వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ల‌తో టాలీవుడ్..బాలీవుడ్ ని షేక్ చేసిన సందీప్ వంగ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు.

By:  Tupaki Desk   |   27 Nov 2023 6:01 AM GMT
అమ్మ‌కి క్యాన్స‌ర్.. నా జీవితం అయిపోయింద‌నుకున్నా!
X

`అర్జున్ రెడ్డి`...`క‌బీర్ సింగ్` వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ల‌తో టాలీవుడ్..బాలీవుడ్ ని షేక్ చేసిన సందీప్ వంగ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఒకేసారి రెండు భాష‌ల్లోనూ స‌త్తా చాటిన స్టార్ మేక‌ర్ అత‌ను. ఇప్పుడా రెండు భాష‌ల

హీరోలు అత‌ని కోసం క్యూలో ఉన్నారు. సందీప్ మాతో సినిమా ఎప్పుడు చేస్తాడా? అని వెయిట్ చేస్తున్నారు. త్వ‌ర‌లో యానిమ‌ల్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇప్ప‌టికే రిలీజ్ అయిన ట్రైల‌ర్ తో మ‌రోసారి ఇండియాని షేక్ చేయ‌డం ఖాయ‌మ‌నే అంచ‌నాలు మొద‌లైపోయాయి.

`అర్జున్ రెడ్డి`లో ఉన్న ఎమోష‌న్ య‌ధావిధిగా `యానిమ‌ల్` లోనూ ఉంటుంద‌ని తెలుస్తోంది. హీరో క్యారెక్ట‌రేజేష‌న్ ని ఓ రేంజ్ లో హైలైట్ చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. అర్జున్ రెడ్డిలో ప్రేమికుల మ‌ధ్య ఎమోష‌న్ హైలైట్ చేస్తే..యానిమ‌ల్ లో తండ్రి-కొడుకుల మ‌ధ్య ఎమోష‌న్ పీక్స్ లో చూపించ‌బోతున్నాడు. మ‌రి ఇంత‌కీ ఆ సృష్టిక‌ర్త ఎమోష‌న్ ఎవ‌రితో అంటే అమ్మ‌తో అని తెలుస్తోంది. తాజాగా అమ్మ గురించి సందీప్ మాట్లాడి..త‌ల్లి-కొడుకుల బాండింగ్ ని సినిమా తీయ‌కుండానే చూపించాడు.

`యానిమ‌ల్` ప్ర‌చారంలో భాగంగా సందీప్ ముందుకు ఈ ఆస‌క్తిక‌ర ప్ర‌శ్న వెళ్లింది. ఎన్నో భావోద్వేగాలతో సినిమాలు తీసే మీకు ఎమోషనల్‌ సపోర్ట్‌ ఎవరు? అని అంటే ..`మా అమ్మ(సుజాత). నాకు ఒకప్పుడు ఎమోషనల్‌ సపోర్ట్‌. 2019లో అమ్మ క్యాన్సర్‌తో చనిపోయింది. `అర్జున్‌ రెడ్డి` విడుదల అయిన రెండు నెలల తర్వాత తనకు క్యాన్సర్‌ అని తెలిసింది. నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. నా జీవితం ఆగిపోయిందనుకున్నా..ఎందుకంటే మరణానికి సంబంధించిన ఎమోషన్స్‌ నన్ను భయపెట్టేవి.

నా స్నేహితుల కుటుంబ సభ్యులు ఎవరైనా చనిపోయినా- అంత్యక్రియలకు వెళ్లేవాడిని కాదు. కొద్దికాలం పోయిన తర్వాత వారిని ఓదార్చటానికి వెళ్లేవాడిని. అలాంటి నాకు- అమ్మకు క్యాన్సర్‌ అనే వార్త నన్ను మ‌రోలోకానికి తీసుకెళ్లిపోయింది. `కబీర్‌ సింగ్‌` విడుదల అయిన రెండు నెలలకు అమ్మ చనిపోయింది. నా జీవితంలో అతి పెద్ద విషాదమది. నా ఉద్దేశంలో `లైఫ్‌ మూవ్స్‌ ఆన్‌` అని ఎవడు అన్నాడో? వాడు చాలా గొప్పవాడు. అమ్మ లేకపోతే జీవితం ఏమయిపోతుంది అనుకునేవాడిని. కానీ జీవితం నడుస్తూనే ఉంది. రోజు తింటున్నా. ఉద్యోగం చేసుకుంటున్నా.. ఏదైనా సమస్య వచ్చినప్పుడు `అమ్మ లేకుండానే జీవితం నడుస్తోంది. ఈ సమస్య ఒక లెక్క` అనుకుంటూ ఉంటా!

అమ్మ చనిపోయిన తర్వాతే- నాకు జీవితం అంటే ఒక ఐడియా వచ్చింది. అప్పటి వరకు అన్నింటికీ అమ్మనాన్నలపైనే ఆధారపడేవాడిని. నేను చాలా ఎమోషనల్‌ పర్సన్‌ని. అమ్మ `నువ్వు అంత ఎమోషనల్‌ అయితే ఎలా బతుకుతావురా? అనేది. తనకు నేను ఈ సమాజంలో ఇమడలేనని.. బతకలేననే భయం ఉండేది. కానీ ఇప్పుడు అమ్మ నాతో ఉంటే ఎంతో గ‌ర్వ‌ప‌డేది` అని అన్నారు.