Begin typing your search above and press return to search.

వంగా మార్క్.. ట్రైలర్ తోనే ట్రోలర్స్ పరార్

ఇక ముఖ్యంగా ట్రైలర్ లో లాస్ట్ షాట్ లో విలన్ బాబీ డియోల్ హీరో బొక్కా బోర్లా పడుకుని ఉంటే అతనిపై పడుకున్న స్టిల్ చాలా హైలెట్ గా నిలిచింది.

By:  Tupaki Desk   |   23 Nov 2023 3:07 PM GMT
వంగా మార్క్.. ట్రైలర్ తోనే ట్రోలర్స్ పరార్
X

అర్జున్ రెడ్డి సినిమాలో హీరో క్యారెక్టర్ తోనే ఒక రేంజ్ లో వైబ్ క్రియేట్ చేసిన సందీప్ రెడ్డి వంగా అదే కథను బాలీవుడ్ కు కూడా తీసుకు వెళ్లి అక్కడ కూడా సాలీడ్ హిట్ కొట్టాడు. ఇక ఇప్పుడు ఇంకాస్త హై డోస్ పెంచుతూ సందీప్ అదే బజ్ ను యాక్షన్ లో జోడించాడు. వైల్డ్ గా హీరో రణబీర్ క్యారెక్టర్ ను హైలెట్ చేస్తూ యానిమాల్ అనే సినిమాతో రాబోతున్నాడు.

ఈ సినిమా నిడివి మూడు గంటలకు పైగానే ఉంటుంది అని క్లారిటీ ఇవ్వడంతో అందరూ షాక్ అయ్యారు. అవసరమా అంత రన్ టైమ్ అంటూ థియేటర్ లో పడుకోవడానికి దుప్పట్లు తీసుకు వెళ్ళాలి అని ట్రోల్స్ కూడా చేశారు. కానీ ట్రైలర్ వచ్చాక సందీప్ వంగా ఇచ్చిన షాక్ అంతా ఇంతా కాదు. స్టార్టింగ్ తండ్రి కొడుకుల క్యారెక్టర్ చేంజ్ సీన్ తోనే వైబ్ ఇచ్చాడు.

అతి ప్రేమతోనే హారర్ సినిమా కంటే భయంకరమైన ఎమోషన్స్ ను హైలెట్ చేశాడని పాజిటివ్ మీమ్స్ వస్తున్నాయి. ఇక సందీప్ మార్క్ ఎలా ఉంటుందో యానిమాల్ సినిమాలోని కొన్ని షాట్స్ చూస్తేనే అర్ధమవుతోంది. ముఖ్యంగా హీరో క్యారెక్టర్ అరవడం దగ్గర నుంచి విలన్స్ పై కోపాన్ని చూపించడం వరకు అన్ని ఎమోషన్స్ సందీప్ స్టైల్ ను గుర్తు చేస్తున్నాయి.

ఇక ముఖ్యంగా ట్రైలర్ లో లాస్ట్ షాట్ లో విలన్ బాబీ డియోల్ హీరో బొక్కా బోర్లా పడుకుని ఉంటే అతనిపై పడుకున్న స్టిల్ చాలా హైలెట్ గా నిలిచింది. ఎక్కడ తగ్గకుండా సందీప్ రెడ్డి తన యాక్షన్ కసిని సినిమాలో హైలెట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకి సెన్సార్ నుంచి ఏ సర్టిఫికెట్ వచ్చిన విషయం తెలిసిందే. సినిమాలో బ్లడ్ బాత్ అనేలా యాక్షన్ సీన్స్ గట్టిగానే ఉన్నాయని పోస్టర్స్ తోనే అర్థమైంది.

ఇక ట్రైలర్ లో గొడ్డలి గన్స్ తోనే కాకుండా మెషీన్ గన్ కూడా తీసి మరింత హైప్ క్రియేట్ చేశాడు దర్శకుడు. సాధారణంగా సినిమాలో లవ్ ఫ్యామిలీ ఏమోషన్ యాక్షన్ అనే రెగ్యులర్ అంశాలు ఉన్నాయి అనగానే రొటీన్ సినిమా అని కామెంట్ వస్తుంది. కానీ యానిమాల్ కు మాత్రం భిన్నంగా ఇది సందీప్ వంగా మార్క్ మూవీ అనేలా కామెంట్స్ వస్తాయని చెప్పవచ్చు. మరి ఈ సినిమా రన్ టైమ్ ను లెక్క చేయకుండా ఆడియెన్స్ ఎంతవరకు ఎంజాయ్ చేస్తారో చూడాలి.