Begin typing your search above and press return to search.

'యానిమ‌ల్ పార్క్‌' పై సందీప్ తాజా కామెంట్

తాజాగా ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్‌లో సందీప్ వంగా వ్యాఖ్య మ‌రోసారి హాట్ టాపిక్ గా మారింది.

By:  Tupaki Desk   |   30 Jan 2024 6:15 AM GMT
యానిమ‌ల్ పార్క్‌ పై సందీప్ తాజా కామెంట్
X

నిరంత‌రం ఇండ‌స్ట్రీ ప్ర‌జ‌లు త‌న గురించే మాట్లాడుకునేలా చేయాలంటే ఏం చేయాలో సందీప్ రెడ్డి వంగాకు తెలిసినంత‌గా ఇంకెవ‌రికీ తెలీదేమో! అత‌డు తెర‌కెక్కించిన అర్జున్ రెడ్డి, క‌బీర్ సింగ్ చిత్రాల‌తో ఒక డెబ్యూగా ద‌క్షిణాది ఉత్తరాది స‌హా అన్ని చోట్లా చ‌ర్చించుకునేలా చేసాడు. ఇది అత‌డి యూనిక్ ట్యాలెంట్. రా కంటెంట్ తో ర‌ఫ్ఫాడించ‌డం అత‌డికి అల‌వాటు వ్యాప‌కం. అయితే యానిమ‌ల్ తో అత‌డు మితిమీరిన హింస‌, ర‌క్త‌పాతం, స్త్రీ ద్వేషాన్ని, విష‌పూరిత పురుష‌త్వాన్ని తెర‌పై చూపించ‌డం తీవ్ర విమ‌ర్శ‌ల‌కు తావిచ్చింది.

ఎన్ని విమ‌ర్శ‌లు వ‌చ్చినా కానీ, త‌న సినిమాని లైమ్ లైట్ లో ఉంచ‌డ‌మెలానో, త‌న హీరోని మ‌రో మెట్టు పైకి ఎక్కించ‌డం ఎలానో, బాక్సాఫీస్ వ‌ద్ద క‌న‌క‌వ‌ర్షంతో నిర్మాత‌ల్ని ఆనందంలో ఉంచ‌డం ఎలానో సందీప్ రెడ్డి వంగాకు బాగా తెలుసు. అందుకే అత‌డితో క‌లిసి ప‌ని చేసిన నిర్మాత‌లు త‌న‌ను అస్స‌లు విడిచిపెట్ట‌డం లేదు. త‌దుప‌రి యానిమ‌ల్ సీక్వెల్ యానిమ‌ల్ పార్క్ ని టీసిరీస్ తో క‌లిసి సందీప్ వంగా భారీ వ్య‌యంతో నిర్మిస్తున్న సంగ‌తి తెలిసిందే.

తాజాగా ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్‌లో సందీప్ వంగా వ్యాఖ్య మ‌రోసారి హాట్ టాపిక్ గా మారింది. యానిమల్ పార్క్ గురించి సందీప్ వంగాను ప్ర‌శ్నించ‌గా.. రెండో భాగం మొదటి భాగం కంటే మరింత క్రేజీగా పెద్దదిగా ఉంటుందని చెప్పాడు. తాను కొన్ని క్రూరమైన ప్రణాళికలను కలిగి ఉన్నాన‌ని అన్నాడు.

నిజానికి క‌బీర్ సింగ్ తో హింస‌ను జుగుప్సాక‌రంగా ప్రేరేపించాడ‌ని విమ‌ర్శ‌ల్ని ఎదుర్కొన్న సందీప్ వంగా త‌న త‌దుప‌రి చిత్రంలో హింసకు నిజమైన అర్థాన్ని చూపిస్తానని ఛాలెంజ్ విసిరాడు. తాను అన్న‌ట్టుగానే యానిమ‌ల్ చిత్రంలో ర‌ణ‌బీర్ లాంటి చాక్టెట్ బోయ్ ని క్రూరుడిగా చూపించాడు. తండ్రిని అమితంగాగా ప్రేమించి అభిమానించే కొడుకు త‌న‌ని శ‌త్రువుల నుంచి కాపాడుకోవ‌డం కోసం ఏం చేసాడ‌నేది యానిమ‌ల్ లో చూపించాడు. అయితే దానికి సందీప్ వంగా త‌న‌దైన‌ ట్రీట్ మెంట్ ఇవ్వ‌డంతో అది మాస్ లో పూన‌కాలు పుట్టించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద భారీ వ‌సూళ్ల‌ను సాధించ‌డంలో విజ‌యం సాధించ‌డానికి అత‌డు ఎంచుకున్న మార్గ‌మే అస‌లు కార‌ణం. యానిమ‌ల్ పార్క్ చిత్రం అంత‌కుమించి ఉంటుంద‌ని ఇప్పుడు చెబుతున్నాడు. యానిమ‌ల్ ని మించి ఇంకా ఘాటైన స‌న్నివేశాల‌తో దీనిని తీస్తాన‌ని స్ప‌ష్ఠంగా చెప్పాడు. ఇటీవ‌ల నెట్ ఫ్లిక్స్ లో విడుద‌లైన యానిమ‌ల్ ని అన్ని వ‌ర్గాల ప్ర‌రేక్ష‌కులు వీక్షించారు. కొంద‌రు అస‌హ్యించుకున్నా చాలామందికి న‌చ్చుతోంది. ఏది ఏమైనా త‌న‌ని మ‌ర్చిపోనీకుండా సందీప్ వంగా ఏదో ఒక‌టి చేస్తూనే ఉన్నాడు.