Begin typing your search above and press return to search.

యానిమాల్ ఈజీగా రిజెక్ట్ చేసే కథ

సందీప్ రెడ్డి వంగా ఇప్పటివరకు ఒకే ఒక్క కథతో టాలీవుడ్ బాలీవుడ్ లో బిగ్ సక్సెస్ చూశాడు. కానీ అతనికి బిగ్ డైరెక్టర్స్ రేంజ్ లో క్రేజ్ అయితే అందుతోంది.

By:  Tupaki Desk   |   28 Nov 2023 4:49 AM GMT
యానిమాల్ ఈజీగా రిజెక్ట్ చేసే కథ
X

సందీప్ రెడ్డి వంగా ఇప్పటివరకు ఒకే ఒక్క కథతో టాలీవుడ్ బాలీవుడ్ లో బిగ్ సక్సెస్ చూశాడు. కానీ అతనికి బిగ్ డైరెక్టర్స్ రేంజ్ లో క్రేజ్ అయితే అందుతోంది. అర్జున్ రెడ్డి సినిమా, కబీర్ సింగ్ ల కంటే ఎక్కువ రేంజ్ లో యానిమాల్ సినిమాకి హైప్ వచ్చింది అంటే అతని యూనిక్ స్టైల్ అనే చెప్పాలి. అది ట్రైలర్ తోనే క్లారిటీ ఇచ్చాడు. ఇక సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఊహించని స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది.

ఇక తెలుగులో కూడా హై రేంజ్ లో బజ్ పెరిగిపోయింది. స్కా అతను అంచనాలను ఎంత వరకు అందుకుంటారు అనేది ఆసక్తిగా మారింది. అయితే యానిమాల్ కథ హీరోకు చెప్పినప్పుడు చాలా ఈజీగా రిజెక్ట్ చేసే కథ అని దర్శకుడు ఆ ఈవెంట్ లో చెప్పడం విశేషం. సందీప్ రెడ్డి వంగా ముందుగా అర్జున్ రెడ్డి గురించి చెబుతూ.. ఆ సినిమా కథలో అమ్మాయి వెన‌క్కి రాగానే క‌థ సుఖాంతం అయిపోయింది.

అయితే యానిమాల్ అలా సుఖాంతం కాదు. డిసెంబ‌రు 1న థియేట‌ర్ల‌కు రండి. ఈ సినిమా చూసిన‌పుడు క‌లిగే అనుభూతి ఇంత‌కుముందు ఎప్పుడూ క‌లిగి ఉండ‌దు. ఆ మేర‌కు హామీ ఇవ్వ‌గ‌ల‌ను అని సందీప్ చాలా క్లియర్ గా వివరణ ఇచ్చారు. అలాగే యానిమాల్ క‌థ‌ను ఎవ‌రైనా కూడా ఈజీగా రిజెక్ట్ చేసే ఛాన్స్ ఉంటుందని, లాజిక్కులు లేవా? డ్రామా ఏంటి ఇలా ఉంద‌నే కారణంతో రిజెక్ట్ చేయొచ్చు, కానీ ర‌ణ‌బీర్ న‌న్ను బలంగా న‌మ్మాడు.

ఈ కథతో నాతో పాటు ట్రావెల్ అయ్యాడు అని సందీప్ అన్నాడు. అంతే కాకుండా అన్ని ప‌నులూ పూర్త‌య్యాయని అంటూ.. ఇక ఇది నా సినిమా కాదు. మీ సినిమా. మ‌ళ్లీ చెప్తున్నా లెంగ్త్ గురించి అసలు టెన్షన్ వద్దు. అలాగే సినిమా ఫస్ట్ లో వచ్చే సీన్స్ అసలు మిస్ కావ‌ద్దు. ముగింపు కూడా చాలా ఇంపార్టెంట్ మిస్ అవ్వొద్దు.. అని అన్నాడు. ఇక ఇదేదో మొత్తం చూడాల‌ని చెప్ప‌ట్లేదు. నేనొక గొప్ప తండ్రి కొడుకుల సినిమా తీశాన‌నుకుంటున్నా. ఈ మూవీ పై నేనెంతో న‌మ్మ‌కంతో ఉన్నా. మీరు కూడా అది చూసి అలానే ఫీల్ అవుతారు. డిసెంబ‌రు 1న క‌లుద్దాం” అని సందీప్ వివరణ ఇచ్చారు