Begin typing your search above and press return to search.

సందీప్ మూవీ కోసం బాలీవుడ్‌ స్టార్‌..!

యంగ్‌ హీరో సందీప్ కిషన్‌, విఐ ఆనంద్‌ కాంబినేషన్‌ లో గతంలో టైగర్‌ సినిమా వచ్చింది. ఆ సినిమా ఆశించిన స్థాయిలో విజయాన్ని సొంతం చేసుకోలేక పోయింది.

By:  Tupaki Desk   |   16 Dec 2023 9:16 AM GMT
సందీప్ మూవీ కోసం బాలీవుడ్‌ స్టార్‌..!
X

యంగ్‌ హీరో సందీప్ కిషన్‌, విఐ ఆనంద్‌ కాంబినేషన్‌ లో గతంలో టైగర్‌ సినిమా వచ్చింది. ఆ సినిమా ఆశించిన స్థాయిలో విజయాన్ని సొంతం చేసుకోలేక పోయింది. తెలుగు లో విభిన్నమైన చిత్రాలను రూపొందించడం ద్వారా విఐ ఆనంద్‌ కి క్రియేటివ్‌ డైరెక్టర్ అనే పేరు దక్కింది.


విఐ ఆనంద్‌ మరోసారి తెలుగు లో సందీప్‌ కిషన్ హీరోగా 'మాయావన్‌' అనే విభిన్నమైన సినిమాను రూపొందిస్తున్న విషయం తెల్సిందే. ఈ సినిమాను పాన్‌ ఇండియా రేంజ్‌ లో విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ చెబుతున్నారు. ఇక ఈ సినిమాలో బాలీవుడ్‌ స్టార్‌ ను కీలక పాత్ర కోసం ఎంపిక చేయడం జరిగింది.

బాలీవుడ్‌ ప్రముఖ నటుడు నీల్‌ నితిన్ ముఖేష్ ను సందీప్ కిషన్‌, విఐ ఆనంద్‌ ల మాయావన్‌ సినిమా లో కీలక పాత్రకు గాను ఎంపిక చేసుకున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. సౌత్‌ లో ఇప్పటికే సుపరిచితుడు అయిన నీల్‌ నితిన్ ముఖేష్‌ ఎంట్రీ తో సినిమా కి మరింత హైప్‌ క్రియేట్‌ అవ్వడం ఖాయం అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.

మాయావన్‌ కోసం నీల్‌ నితిన్‌ ముఖేష్ కాస్త బరువు తగ్గడంతో పాటు, గత కొన్ని రోజులుగా హోం వర్క్‌ చేస్తున్నట్లుగా యూనిట్‌ సభ్యులు తెలియజేశారు. సినిమాలో ఆయన పాత్ర అత్యంత కీలకంగా ఉంటుందని కూడా మేకర్స్ పేర్కొన్నారు. ఈ సినిమాలో సందీప్ కిషన్‌ కి జోడీగా ఆకాంక్ష రంజన్‌ హీరోయిన్‌ గా నటిస్తున్న విషయం తెల్సిందే