బాలీవుడ్ పీఆర్ పై సందీప్ ఫైర్.. దీపిక టీమ్ కేనా ఆ వార్నింగ్?
టాలెంటెడ్ అండ్ సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా గురించి అందరికీ తెలిసిందే.
By: Tupaki Desk | 27 May 2025 9:45 AM ISTటాలెంటెడ్ అండ్ సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా గురించి అందరికీ తెలిసిందే. ఇప్పటి వరకు మూడు సినిమాలే చేశారు. కానీ ఆయనకు ఉన్న క్రేజ్ వేరే లెవెల్. మెయిన్ గా సందీప్ వంగా యాటిట్యూడ్ కే సపరేట్ ఫ్యాన్ బేస్. ఎప్పటికప్పుడు తనకు నచ్చని విషయంపై ఫుల్ గా ఫైర్ అవుతుంటారు. ఓ రేంజ్ లో కౌంటర్స్ ఇస్తుంటారు.
తాజాగా బాలీవుడ్ పీఆర్ పై సందీప్ ఫైర్ అవుతూ డేరింగ్ డైరెక్టర్ సందీప్ ట్వీట్ చేశారు. "నేను ఒక నటుడికి స్టోరీని చెప్పినప్పుడు..100 శాతం నమ్మకం పెట్టుకుంటాను. మా మధ్య నాన్ డిస్కోజ్లర్ అగ్రిమెంట్ ఉంటుంది. కానీ ఇలా చేయడం వల్ల యంగ్ నటిని కిందకు లాగి విమర్శించడం, నా స్టోరీ లీక్ చేయడం జరిగింది" అని సందీప్ తెలిపారు.
ఇదేనా మీ ఫెమినిజం అంటూ క్వశ్చన్ చేశారు. "నేను ఒక ఫిల్మ్ మేకర్ నా వర్క్ వెనుక ఎన్నో ఏళ్ల కష్టం ఉంటుంది. నా సినిమాయే ప్రతీది. మీరు దానిని అర్థం చేసుకోలేదు.. అర్థం చేసుకోలేరు.. ఈ సారి స్టోరీ మొత్తం లీక్ చేయండి, ఏమైనా పర్లేదు.. నాకేం ఫరక్ పడదు" అంటూ సందీప్ వంగా ట్వీట్ చేశారు. #dirtyPRgamesహ్యాష్ ట్యాగ్ యాడ్ చేశారు.
అయితే తన ట్వీట్ లో సందీప్ ఎవరి పేరును మాత్రం మెన్షన్ చేయలేదు. కానీ హీరోయిన్ దీపికా పదుకొణె అండ్ ఆమె పీఆర్ ను టార్గెట్ చేసుకుని పోస్ట్ పెట్టారని క్లియర్ గా తెలుస్తోంది. ఎందుకంటే.. తన అప్ కమింగ్ మూవీ స్పిరిట్ నుంచి దీపికాను తప్పించారు సందీప్ వంగా. ఆ తర్వాత త్రిప్తి డిమ్రీను హీరోయిన్ గా సెలెక్ట్ చేశారు.
ఆ తర్వాత ట్వీట్ పెట్టడంతో దీపిక అండ్ టీమ్ ను ఉద్దేశించి పెట్టారని తెలుస్తోంది. ముఖ్యంగా సినిమాను ఆమెను తప్పించిన వెంటనే బాలీవుడ్ మీడియాలో సినిమాపై తప్పుడు వార్తలు స్ప్రెడ్ అయ్యాయి. అడల్టర్డ్ ఫిల్మ్ అంటూ ప్రచారం చేశారు. దీంతో దానికి రివెంజ్ కు బాలీవుడ్ మీడియాకు సందీప్ మరిన్ని కౌంటర్ ఇవ్వనున్నట్లు కనిపిస్తోంది.
అయితే దీపిక ప్లేస్ లో త్రిప్తి డిమ్రీను హీరోయిన్ గా సెలెక్ట్ చేయడంతో.. మూవీ స్టోరీని ఆమె పీఆర్ టీమ్ లీక్ చేసిందని తెలుస్తోంది. చీప్ డర్టీ గేమ్స్ ను మొదలుపెట్టినట్లు టాక్ వినిపిస్తోంది. అందుకే ఇప్పుడు సందీప్ వంగా ఫైర్ అయ్యారని సమాచారం. కాగా, సినిమాలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే.
