Begin typing your search above and press return to search.

విజయ్ తో సినిమా ఉంటుంది కానీ..?

ఒక్కసారి అర్జున్ రెడ్డి డేస్ కి వెళ్తే.. సందీప్ వంగ ఆ కథ పట్టుకుని చాలామంది దగ్గరకు వెళ్లాడు. అందరు కూడా విని బాగుందని చెప్పడమే కానీ చేయడానికి ముందుకు రాలేదు.

By:  Tupaki Desk   |   30 May 2025 3:00 AM
విజయ్ తో సినిమా ఉంటుంది కానీ..?
X

అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ కి ఒక టాలెంటెడ్ హీరో మాత్రమే కాదు పాన్ ఇండియాని షేక్ చేసే ఒక డైరెక్టర్ కూడా పరిచయం అయ్యాడు. అర్జున్ రెడ్డితో అదరగొట్టి అదే సినిమాను హిందీలో తీసి అక్కడ హిట్ అందుకున్న డైరెక్టర్ సందీప్ వంగ ఆ తర్వాత తీసిన యానిమల్ తో తన అసలు స్టామినా ఏంటన్నది ప్రూవ్ చేసుకున్నాడు. రణ్ బీర్ కపూర్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా యానిమల్ నిలిచింది అంటే ఆ ఇంపాక్ట్ ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చు.

త్వరలో ప్రభాస్ తో స్పిరిట్ సినిమా చేయనున్నాడు సందీప్ వంగ. ఐతే ఈమధ్య ఒక ఇంటర్వ్యూలో తన మొదటి సినిమా హీరో విజయ్ దేవరకొండ గురించి చేసిన కామెంట్స్ రౌడీ ఫ్యాన్స్ ని అలరిస్తున్నాయి. విజయ్ మంచి యాక్టర్ అంటే అతను చేసింది తక్కువ సినిమాలే అయినా అతనితో వర్క్ చేశా కాబట్టి తనకు తెలుసని అన్నాడు సందీప్ వంగ. పాన్ ఇండియా డైరెక్టర్ సందీప్ ఇలా విజయ్ గురించి మాట్లాడటం సంథింగ్ స్పెషల్ అనిపించింది.

ఒక్కసారి అర్జున్ రెడ్డి డేస్ కి వెళ్తే.. సందీప్ వంగ ఆ కథ పట్టుకుని చాలామంది దగ్గరకు వెళ్లాడు. అందరు కూడా విని బాగుందని చెప్పడమే కానీ చేయడానికి ముందుకు రాలేదు. కానీ విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి కథ విని సూపర్ అనడమే కాదు సినిమా చేశాడు. చేయడం కాదు అర్జున్ రెడ్డి పాత్రలో పరకాయ ప్రవేశం చేశాడు. ఆ సినిమా చూసిన తర్వాతే విజయ్ కి యూత్ లో సూపర్ ఫాలోయింగ్ ఏర్పడింది.

డేరింగ్ డ్యాషింగ్ హీరోగా విజయ్ అర్జున్ రెడ్డి సినిమాలో చేసిన పాత్ర అతన్ని స్టార్ లీగ్ లో నిలబెట్టింది. ఐతే అలాంటి పాత్ర రాసిన సందీప్ వంగ కూడా విజయ్ దేవరకొండ యాక్టింగ్ టాలెంట్ గురించి ప్రతిసారి చెబుతున్నాడు. ఐతే ఈ కాంబినేషన్ లో మరో సినిమా ఉంటుంది కానీ అది కాస్త టైం పడుతుందని అన్నాడు సందీప్ వంగ. విజయ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. అవన్నీ పూర్తయ్యాక కలిసి చేస్తామని చెప్పుకొచ్చాడు సందీప్ వంగ. సందీప్ వంగ స్పిరిట్ పూర్తి చేశాక యానిమల్ 2 చేసే ఛాన్స్ ఉంది. ఐతే నెక్స్ట్ రాం చరణ్ తో కూడా ఒక సినిమా లైన్ లో ఉందని తెలుస్తుంది. ఆ తర్వాత మాత్రం విజయ్ తో చేసే ఛాన్స్ ఉంది.