అందుకే అతడు ఎక్స్‌ప్లోజివ్ డైరెక్టర్ అయ్యాడు
ఆసక్తికరంగా తన కథానాయికల ఎంపిక విషయంలోను అతడు అలానే ఆలోచిస్తున్నాడు.
By: Tupaki Desk | 26 May 2025 3:55 AMపేలడానికి సిద్ధంగా ఉన్న ల్యాండ్ మైన్ లాంటోడు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. అతడు ఏదైనా నిర్ణయం తీసుకుంటే దాని ప్రభావం అంతే ఎక్స్ ప్లోజివ్ గా ఉంటుంది. కెరీర్ లో అర్జున్ రెడ్డి లాంటి ఒక రగ్డ్ మాదక ద్రవ్యాలకు అలవాటు పడిన వైద్యుడి పాత్రను ఎంపిక చేయడంలోనే సందీప్ వంగా చాతుర్యం బయటపడింది. తండ్రితో ఘర్షణ పడే యువకుడిని హీరోగా చూపించి `యానిమల్`ని పాన్ ఇండియా లెవల్లో బంపర్ హిట్ గా మలిచాడు. ఇది కూడా సందీప్ వంగా గట్స్ ని ఆవిష్కరించింది.
ఆసక్తికరంగా తన కథానాయికల ఎంపిక విషయంలోను అతడు అలానే ఆలోచిస్తున్నాడు. ఇప్పుడు దీపిక పదుకొనే స్థానంలో ట్రిప్తి దిమ్రీ లాంటి ఒక రైజింగ్ బ్యూటీని `స్పిరిట్` కోసం ఎంపిక చేయడం చాలా మందిని ఆశ్చర్యపరిచింది. అది కూడా ప్రభాస్ లాంటి అగ్ర కథానాయకుడి సరసన ట్రిప్తి దిమ్రీకి అవకాశం రావడం అనేది షాక్ కి గురి చేసింది. ప్రభాస్ స్టార్ డమ్ కి ఈ బ్యూటీ సరితూగుతుందా? అనే సందేహం కూడా వ్యక్తమైంది. అయితే సందీప్ వంగా స్టార్లను తయారు చేయగల నిపుణుడు. అతడు మాత్రమే ట్రిప్తిలో ట్యాలెంట్ ని తెలివిగా సరైన టైమింగ్ తో బయటికి తీయగలిగాడు. ఈరోజు ట్రిప్తి దేశంలోని అగ్ర కథానాయికల్లో ఒకరిగా ఎదగడానికి అతడే కారణం.
ఇప్పుడు ప్రభాస్ సరసన అవకాశం అందుకుంది కాబట్టి ట్రిప్తి స్టార్ డమ్ ని మరో స్థాయికి చేర్చడం గ్యారెంటీ. సందీప్ తన హీరోలనే కాదు, హీరోయిన్లను కూడా ఎంతో ఇంటెన్సివ్ గా ఆవిష్కరిస్తాడు. `స్పిరిట్`లో కథానాయికకు కూడా నటించేందుకు ఆస్కారం ఉంటుందని సమాచారం. కాబట్టి ట్రిప్తీ జాక్ పాట్ కొట్టిందనే భావించాలి.
దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఇంటెన్సిటీ ఉన్న వ్యక్తి. వేగంగా నిర్ణయాలు తీసుకునే విషయంలో ఆయన ధైర్యం, విస్ఫోటక స్వభావం ఆశ్చర్యపరుస్తుంది. అర్జున్ రెడ్డితో షాలినీ పాండేకు లైఫ్ నిచ్చాడు. కబీర్ సింగ్ తో కియరా అద్వాణీ రేంజును, యానిమల్ తో రష్మిక రేంజును కూడా పెంచాడు. ఇప్పుడు ట్రిప్తి దిమ్రీ వంతు. అతడు తన కథానాయికలకు అద్భుతమైన పాత్రల్ని ఆఫర్ చేస్తూ వారి కెరీర్ ఎదుగుదలకు సహకరిస్తున్నాడు. ఇలాంటి దర్శకుడు పరిశ్రమలో చాలా అరుదు. అయితే సందీప్ వంగాతో యానిమల్ లో పని చేసే అవకాశాన్ని కోల్పోయానని పరిణీతి చోప్రా చాలా మదన పడింది. ఈసారి `స్పిరిట్`లో పారీకి అవకాశం కల్పిస్తాడని అంతా భావించారు. కానీ పారీ బ్యాడ్ లక్. ఆ అవకాశం ట్రిప్తికి దక్కింది.