Begin typing your search above and press return to search.

అతనితో VD ప్రాజెక్ట్ ఏమైంది..?

అర్జున్ రెడ్డి అనే సినిమాతో టాలీవుడ్ కు ఒక పాన్ ఇండియా డైరెక్టర్ దొరికాడు. ఐతే అతనిలో ఆ టాలెంట్ ఉందని ముందు గుర్తించి అవకాశం ఇచ్చాడు విజయ్ దేవరకొండ.

By:  Tupaki Desk   |   12 May 2025 2:45 AM
అతనితో VD ప్రాజెక్ట్ ఏమైంది..?
X

అర్జున్ రెడ్డి అనే సినిమాతో టాలీవుడ్ కు ఒక పాన్ ఇండియా డైరెక్టర్ దొరికాడు. ఐతే అతనిలో ఆ టాలెంట్ ఉందని ముందు గుర్తించి అవకాశం ఇచ్చాడు విజయ్ దేవరకొండ. అందుకే సందీప్ వంగ, విజయ్ దేవరకొండ ఈ ఇద్దరి మధ్య మంచి బాండింగ్ ఉంటుంది. ఐతే అర్జున్ రెడ్డి సినిమానే సంథింగ్ డిఫరెంట్ అనుకుంటే దాన్ని మించేలా యానిమల్ తీశాడు సందీప్ వంగ. యానిమల్ సినిమాతో రణ్ బీర్ కపూర్ కెరీర్ బెస్ట్ హిట్ ఇచ్చాడు సందీప్. యానిమల్ సినిమాతో బాబీ డియోల్ ని కూడా మళ్లీ బిజీ యాక్టర్ గా మార్చేశాడు.

సందీప్ వంగా ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్ లో ఒక క్రేజీ డైరెక్టర్. యానిమల్ తర్వాత సందీప్ నెక్స్ట్ రెబల్ స్టార్ ప్రభాస్ తో స్పిరిట్ సినిమా చేస్తున్నాడు. ప్రభాస్ రాజా సాబ్, ఫౌజీ సినిమాలకు కాస్త గ్యాప్ ఇస్తే స్పిరిట్ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లాలని చూస్తున్నాడు సందీప్ వంగ. స్పిరిట్ సినిమా తర్వాత అసలైతే అల్లు అర్జున్ తో సినిమా ఉంటుందని అనుకోగా అది మిస్సైందని టాక్.

అల్లు అర్జున్ ప్లేస్ లో రామ్ చరణ్ వచ్చాడని తెలుస్తుంది. సో స్పిరిట్ తర్వాత చరణ్ తో సందీప్ వంగ సినిమా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఐతే సందీప్ వంగా తో విజయ్ దేవరకొండ మరో సినిమా ఉంటుందని అప్పట్లో అనౌన్స్ మెంట్ వచ్చింది. అర్జున్ రెడ్డి కాంబో సెట్ అయితే ఈసారి పాన్ ఇండియా లెవెల్ లో సెన్సేషనల్ సృష్టించాలని అనుకున్నారు. కానీ ఆ ప్రాజెక్ట్ గురించి ఇప్పుడు సైలెంట్ గా ఉన్నారు. రీసెంట్ గా విజయ్ దేవరకొండ బర్త్ డే టైం లో కూడా సందీప్ సినిమా గురించి ఎలాంటి పోస్టర్ రాలేదు.

ఒకవేళ విజయ్ దేవరకొండతో ఇప్పుడు సినిమా ఎందుకని సందీప్ అనుకుంటున్నాడా.. లేదా వీరి కాంబో సినిమాకు ఇంకా టైం ఉందని అలా లైట్ తీసుకున్నారా అన్నది తెలియాల్సి ఉంది. స్పిరిట్ తర్వాత చరణ్ సినిమా ప్లానింగ్ లో ఉన్న డైరెక్టర్ సందీప్ వంగ నెక్స్ట్ యానిమల్ పార్క్ కూడా చేయాల్సి ఉంది. సో కమిటైన ఈ సినిమాలన్నె పూర్తి చేశాక కానీ విజయ్ దేవరకొండ సినిమా ఉండే అవకాశం ఉంటుంది. ఐతే విజయ్ కూడా కింగ్ డం తర్వాత రవికిరణ్ కోలాతో రౌడీ జనార్ధన్ చేస్తున్నాడు. ఆ తర్వాత వీడీ 14 సినిమా రాహుల్ సంకృత్యన్ తో రాబోతుంది.