స్పిరిట్ కి షార్ట్ బ్రేక్.. పక్కా స్కెచ్ తో వంగా!
'యానిమల్' లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఈ సినిమాను టేకప్ చేయడంతో అంచనాలు మామూలుగా లేవు. గత ఏడాది ద్వితీయార్థంలోనే ఈ సినిమా షూటింగ్ మొదలవ్వగా, ఇప్పటికే ఒక షెడ్యూల్ కూడా సైలెంట్ గా పూర్తయిపోయింది.
By: M Prashanth | 4 March 2026 4:00 PM ISTపాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే అందరి కళ్ళూ ఇప్పుడు 'స్పిరిట్' సినిమా మీదనే ఉన్నాయి. 'యానిమల్' లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఈ సినిమాను టేకప్ చేయడంతో అంచనాలు మామూలుగా లేవు. గత ఏడాది ద్వితీయార్థంలోనే ఈ సినిమా షూటింగ్ మొదలవ్వగా, ఇప్పటికే ఒక షెడ్యూల్ కూడా సైలెంట్ గా పూర్తయిపోయింది.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కి చిన్న విరామం ఇచ్చారు మేకర్స్. ఈ గ్యాప్ లో ప్రభాస్ 'కల్కి 2898 ఏడీ' పనుల్లో బిజీగా ఉండగా, సందీప్ రెడ్డి వంగా మాత్రం తన మార్క్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో నిమగ్నమయ్యారు. వచ్చే షెడ్యూల్ కోసం కావాల్సిన నటీనటుల ఎంపిక, ఇతర టెక్నికల్ అంశాలపై వంగా పక్కా స్కెచ్ వేస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. వంగా ప్లానింగ్ అంటేనే కొత్తగా ఉంటుంది కాబట్టి ఈ బ్రేక్ లో ఆయన చేస్తున్న వర్క్ సినిమా అవుట్ పుట్ మీద గట్టి ప్రభావమే చూపబోతోంది.
లేటెస్ట్ సమాచారం ప్రకారం, 'స్పిరిట్' మళ్ళీ ఈ ఏడాది మే తొలి వారంలో పట్టాలెక్కబోతోంది. ఇది ఒక భారీ షెడ్యూల్ అని, ఎక్కడా స్లో అవ్వకుండా షూటింగ్ మొత్తం పూర్తి చేయాలని దర్శకుడు గట్టిగా డిసైడ్ అయ్యారు. ఈ మూవీలో ప్రభాస్ పవర్ఫుల్ ఐపీఎస్ ఆఫీసర్ రోల్ లో కనిపిస్తుండటంతో, ఫిట్ నెస్ విషయంలో ప్రభాస్ కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. సందీప్ వంగా మార్క్ హీరోగా సరికొత్త ప్రభాస్ ని చూడబోతున్నామని చిత్ర యూనిట్ ఇప్పటికే హింట్ ఇచ్చింది.
సినిమా కాస్టింగ్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. త్రిప్తి దిమ్రీ హీరోయిన్ గా నటిస్తుండగా, వివేక్ ఒబెరాయ్, ప్రకాష్ రాజ్ లాంటి సీనియర్ యాక్టర్స్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ముఖ్యంగా విలన్ పాత్ర గురించి వస్తున్న వార్తలు సినిమా మీద హైప్ పెంచుతున్నాయి. ఇక ప్రభాస్ కెరీర్ గ్రాఫ్ చూస్తే హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా ఆయన స్పీడ్ ఏమాత్రం తగ్గడం లేదు.
'ది రాజా సాబ్' రిజల్ట్ కాస్త నిరాశపరిచినా, 'కల్కి 2', 'ఫౌజీ' లాంటి భారీ ప్రాజెక్టులతో ఆయన మళ్ళీ స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇచ్చేలా కనిపిస్తున్నారు. ఈ క్రమంలో 'స్పిరిట్' సినిమా బాక్సాఫీస్ వద్ద మరోసారి ప్రభాస్ సత్తాను చాటుతుందని ఫ్యాన్స్ గట్టిగా నమ్ముతున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఈ స్మాల్ బ్రేక్ తర్వాత వచ్చే మెగా షెడ్యూల్ తో సినిమా ఒక కొలిక్కి రానుంది. భద్రకాళి పిక్చర్స్, టీ సిరీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ చిత్రాన్ని 2027 మార్చి 5న విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ లోపు సందీప్ వంగా ప్లాన్ చేసిన ఆ సర్ప్రైజ్ లు ఏంటో తెలియాలంటే అఫీషియల్ అప్డేట్ వచ్చే వరకు వేచి చూడాల్సిందే.
