Begin typing your search above and press return to search.

వంగా సినిమాల 'సెన్సార్'.. బాక్సాఫీస్ వద్ద దెబ్బేశాయట!

టాలెంటెడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాకు ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. ఇప్పటి వరకు తీసింది మూడు సినిమాలే.. అయితేనేం వేరే లెవెల్ ఫ్యాన్ బేస్ ను సొంతం చేసుకున్నారు.

By:  Tupaki Desk   |   26 July 2025 4:47 PM IST
వంగా సినిమాల సెన్సార్.. బాక్సాఫీస్ వద్ద దెబ్బేశాయట!
X

టాలెంటెడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాకు ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. ఇప్పటి వరకు తీసింది మూడు సినిమాలే.. అయితేనేం వేరే లెవెల్ ఫ్యాన్ బేస్ ను సొంతం చేసుకున్నారు. తాను తీసిన చిత్రాలతో బాక్సాఫీస్ ను ఏకంగా షేక్ చేశారు. మూడు సినిమాలతో బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్స్ ను సొంతం చేసుకున్నారు.

అర్జున్‌ రెడ్డి, కబీర్ సింగ్‌, యానిమల్‌ సినిమాలతో ఒక్కసారిగా షేక్ చేశారు సందీప్ వంగా. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో స్పిరిట్ మూవీ చేయనున్నారు. నెవ్వర్ బిఫోర్ అనేలా డార్లింగ్ ను చూపించనున్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ ను పూర్తి చేసిన సందీప్.. సెప్టెంబర్ నుంచి షూటింగ్ ను మొదలుపెట్టనున్నారు.

ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్లాన్ చేస్తున్న స్పిరిట్ ను నాన్ స్టాప్ గా కొట్టడమే అంటూ రీసెంట్ గా వెల్లడించారు. ఇప్పుడు తన సినిమాల సెన్సార్ సర్టిఫికెట్లపై చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. స్టార్ హీరో విజయ్ దేవరకొండ లేటెస్ట్ మూవీ కింగ్డమ్ ప్రమోషన్స్ లో ఇటీవల సందీప్ సందడి చేసిన విషయం తెలిసిందే.

కింగ్డమ్ బాయ్స్ పేరుతో జరిగిన పాడ్ కాస్ట్ లో సందీప్ మాట్లాడారు. తాను ఇప్పటికే 45 నిమిషాల నుంచి గంట వరకు ఇప్పటికే కింగ్డమ్ సినిమా చూశానని, U/A సర్టిఫికెట్ వస్తుందని ఆయన ఊహించారు. అప్పుడు సెకండాఫ్ లో వయొలెన్స్ ఎక్కువ ఉందని విజయ్ అన్నారు. దీంతో A సర్టిఫికెట్ వస్తున్నట్లు అనిపిస్తుందని తెలిపారు.

ఇప్పుడు వయొలెన్స్ ను ఎవరూ పట్టించుకోవడం లేదని, A సర్టిఫికెట్ రాదని తెలిపారు. కింగ్డమ్ బ్రదర్ హుడ్ పై దృష్టి పెడుతుందని, బలమైన భావోద్వేగాలు ఉన్నాయని తెలిపారు. U/A సర్టిఫికెట్ వస్తుందని అన్నారు. అనుకున్నట్లే.. అదే జరిగింది. రీసెంట్ గా మేకర్స్ ఆ విషయాన్ని అనౌన్స్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు.

ఆ తర్వాత సందీప్ తన సినిమాలు అన్నీ A సర్టిఫికెట్ పొందాయని గుర్తు చేశారు. దీంతో డిస్ట్రిబ్యూటర్లు.. బాక్సాఫీస్ వద్ద గణనీయమైన నష్టాలు సంభవించాయని చెప్పినట్లు వెల్లడించారు. అయితే ఆయన తీసిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్సే. కానీ డిస్ట్రిబ్యూటర్స్ అలా రిపోర్ట్ ఇవ్వడం గమనార్హం. మరి స్పిరిట్ మూవీ విషయంలో ఏం జరుగుతుందో వేచి చూడాలి.