సందీప్‌రెడ్డి వంగకు ఈ యాటిట్యూడ్ ఉండాల్సిందే?
ఒక దర్శకుడు, లేదా హీరో స్ట్రాంగ్‌గా నిలబడ్డారు అంటే అది కేవలం అతని యాటిట్యూడ్ కారణం. ఇలాంటి వాళ్లు తను నమ్మిన దానికి స్టిక్ ఆన్ అయి ఉంటారు. ఎవరి మట వినరు. ఎవరి ప్రలోభాలకు లొంగరు.
By: Tupaki Desk | 23 May 2025 4:45 PM ISTఒక దర్శకుడు, లేదా హీరో స్ట్రాంగ్‌గా నిలబడ్డారు అంటే అది కేవలం అతని యాటిట్యూడ్ కారణం. ఇలాంటి వాళ్లు తను నమ్మిన దానికి స్టిక్ ఆన్ అయి ఉంటారు. ఎవరి మట వినరు. ఎవరి ప్రలోభాలకు లొంగరు. ఎవరెన్ని షరతులు విధించినా అంగీకరించారు. దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా కూడా అలాంటి రకమే. 'అర్జున్‌రెడ్డి'ని ఇద్దరు హీరోలు చేయడానికి భయపడినా ఆ స్క్రిప్ట్‌ని పక్కన పెట్టలేదు. అదే సినిమాతో దర్శకుడిగా పరిచయం కావాలనుకున్నాడు.. అయ్యాడు.
చేసింది ఫస్ట్ సినిమా కనీ రన్ టైమ్ విషయంలోనూ రాజీపడకుండా దాన్నే ట్రెండ్‌గా సెట్ చేసి ఇప్పుడు అంతా ఫాలో అయ్యేలా చేశాడు. హీరో క్యారెక్టర్, బిహేవ్ విషయంలో అప్పటి వరకు వచ్చిన తెలుగు సినిమాలకు భిన్నంగా వెళ్లి 'అర్జున్‌రెడ్డి'తో పాత్ బ్రేకింగ్ బ్లాక్ బస్టర్‌ని సొంతం చేసుకుని టాక్ ఆఫ్ ఇండియా అయ్యాడు. రెండవ సినిమాగా 'యానిమల్' చేసి నెవర్ బిఫోర్ అవతార్‌లో రణ్‌బీర్ కపూర్‌ని చూపించి ఔరా అనిపించాడు.
'యానిమల్' బ్లాక్ బస్టర్‌తో రూ.900 కోట్ల క్లబ్‌లో చేరిన సందీప్ త్వరలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో 'స్పిరిట్' మూవీకి శ్రీకారం చుట్టబోతున్నాడు. `యానిమల్` మూవీలో యంగ్ రన్‌బీర్, స్టూడెంట్ రన్‌బీర్ ఆ తరువాత మెచ్యూర్డ్ రన్‌బీర్ గా మూడు వేరియేషన్స్ చూపించి ఆ క్యారెక్టర్‌ని బోల్డ్‌గా మలిచి రన్‌బీర్‌ని ఒప్పించి తనతో చేయించి సక్సెస్ అయ్యాడు. ఈ విషయంలో బాలీవుడ్ దృష్టిలో శభాష్ అనిపించుకున్నాడు. ఈ క్యారెక్టర్‌ని రణ్‌బీర్ అంగీకరించి చేశాడంటే దానికి సందీప్ వంగ యాటిట్యూడ్ బలంగా పని చేసింది.
కంప్లీట్‌గా రణ్‌బీర్ తనకు సరెండర్ అయ్యేలా చేసింది. ఆ యాటిట్యూడ్ ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. 'స్పిరిట్' కోసం ప్రభాస్‌కు జోడీగా సందీప్ క్రేజీ హీరోయిన్ దీపికని అనుకున్నారట. ఆమెతో చర్చలు జరిపి ఫైనల్ చేసుకునే క్రమంలో తను పెట్టిన కండీషన్స్ సందీప్‌కు నచ్చకపోవడంతో తనని ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పించినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇది నిజమైతే రెండవ ప్రాజెక్ట్ విషయంలో సందీప్ వ్యవహరించిన తీరుకు అంతా అవాక్కవుతున్నారు.
ఎంత స్టార్ హీరోయిన్ అయినా కండీషన్స్ పెడితే అంగీకరించకపోగా తనని ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పించడం సందీప్ యాటిట్యూడ్ అనే కామెంట్‌లు వినిపిస్తున్నాయి. ఆ మాత్రం యాటిట్యూడ్ లేకపోతే సందీప్ బాలీవుడ్‌లో నిలబడలేడని, అందరి దృష్టిని తనవైపు తిప్పుకోలేడని టాలీవుడ్ వర్గాలు, సినీ లవర్స్ అంటున్నారు. మరి దీపిక ఎపిసోడ్ గురించి సందీప్ ఓపెన్‌గా బరస్ట్ అవుతాడా? అన్నది తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.
