Begin typing your search above and press return to search.

ఆ స్టేట్‌మెంట్‌తో దీపిక‌ని రానా స‌మ‌ర్ధించాడా?

అయితే తాజా వివాదం, ప‌ని గంట‌ల‌పై తాజాగా రాజా స్పందించాడు. ఇండ‌స్ట్రీలో ప‌ని గంట‌లు అనేవి ప్రాజెక్ట్‌ని బ‌ట్టి ఉంటాయ‌న్నారు.

By:  Tupaki Desk   |   8 Jun 2025 3:00 PM IST
ఆ స్టేట్‌మెంట్‌తో దీపిక‌ని రానా స‌మ‌ర్ధించాడా?
X

'క‌బీర్‌సింగ్‌, యానిమ‌ల్ మూవీస్‌తో బాలీవుడ్‌లో తిరుగులేని డైరెక్ట‌ర్‌గా పేరుతెచ్చుకున్నాడు సందీప్‌రెడ్డి వంగ‌. ఈ క్రేజీ మూవీస్ త‌రువాత సందీప్ పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ హీరోగా ఓ భారీ యాక్ష‌న్ డ్రామాకు శ్రీ‌కారం చుట్టిన విష‌యం తెలిసిందే.'స్పిరిట్‌' పేరుతె తెర‌పైకి రానున్న ఈ మూవీ కోసం భారీ కాస్టింగ్‌ని తీసుకోవాల‌ని ప్లాన్ చేశాడు. ఇందులో భాగంగానే ప్ర‌భాస్‌కు జోడీగా దీపిక‌ని ఎంపిక చేసుకున్నాడ‌ని ప్ర‌చారం జ‌రిగింది.

ఆ త‌రువాత దీపిక ప‌లు డిమాండ్‌లు పెట్టింద‌ని, ప‌ని గంట‌ల విష‌యంలోనూ ష‌ర‌తులు విధించింద‌ని, అంతే కాకుండా సినిమా లాభాల్లోనూ వాటి ఇవ్వాల‌ని డిమాండ్ చేసింద‌ని, ఆ ష‌ర‌తుల‌ని అంగీక‌రించ‌ని సందీప్‌రెడ్డ వంగా దీపిక‌ని ప‌క్క‌న పెట్టి ఆ స్థానంలో'యానిమ‌ల్‌' ఫేమ్ త్రిప్తి దిమ్రీని ఫైన‌ల్ చేసుకున్నాడ‌ని బాలీవుడ్ ఇండ‌స్ట్రీలో ప్ర‌చారం జ‌రిగిన విష‌యం అంద‌రికి తెలిసిందే.

అయితే తాజా వివాదం, ప‌ని గంట‌ల‌పై తాజాగా రాజా స్పందించాడు. ఇండ‌స్ట్రీలో ప‌ని గంట‌లు అనేవి ప్రాజెక్ట్‌ని బ‌ట్టి ఉంటాయ‌న్నారు. మ‌నం అర్థం చేసుకోవాల్సిన విష‌యం ఏంటంటే భార‌త్ అభివృద్ధి చెందుతున్న దేశం. మ‌న‌ది పూర్తిగా అభివృద్ధి చెందిన దేశం కాదు. వివిధ దేశాల త‌ల‌స‌రి ఆదాయం తీసుకుంటే మ‌న ఆర్థిక వ్య‌వ‌స్థ 186వ స్థానంలో ఉంది. మ‌ద్రాస్ నుంచి హైద‌రాబాద్‌కు మారిన తెలుగు ఇండ‌స్ట్రీ నుంచి నేను వ‌చ్చాను. వంద‌లాది మంది అక్క‌డి నుంచి ఇక్క‌డికి తర‌లి వ‌చ్చారు. నా వ‌ర‌కు అది ప‌ని కాదు జీవ‌న శైలి.

మ‌హారాష్ట్ర తీసుకుంటే అక్క‌డ 12 గంట‌ల షిఫ్ట్ విధానం ఉంటుంది. తెలుగు ఇండ‌స్ట్రీలో మాత్రం 8 గంట‌ల షిఫ్ట్ విధానం ఉంటుంది. అయితే మ‌హారాష్ట్ర‌లో ఉద‌యం 9 గంట‌ల‌కు గానీ షూటింగ్ మొద‌ల‌వ్వ‌దు. తెలుగులో మాత్రం ఉద‌యం 7 గంట‌ల‌కే ప‌ని మొద‌ల‌వుతుంది. సిటీల ఉండే లొకేష‌న్, సెట్‌, స్టూడియో వంటి అంశాలు అందులో చేర‌తాయి. ఇది సాధార‌ణ విష‌యం కానే కాదు.షూటింగ్‌కు వెళ్లే ముందు సెట్‌లో చాలా స‌న్న‌ద్ద‌త అవ‌స‌ర‌ముంటుంది. స్టూడియోలో అయితే కాస్త సౌక‌ర్య‌వంతంగా ఉంటుంది. ఏ విష‌యాన్నైనా మ‌నం సూక్ష్మ దృష్టితో చూడాలి అన్నారు.

అంతే కాకుండా మ‌రో విష‌యంపై కూఐడా క్లారిటీ ఇచ్చారు. ఇక్క‌డ ఎవ‌రూ ఎవ‌రినీ బ‌ల‌వంతంగా ఉండ‌మ‌ని చెప్ప‌రు. ఇది కూడా ఒక వృత్తి మాత్ర‌మే. ఎవ‌రూ ఎవ‌రినీ ఒత్తిడి చేయ‌రు. మీరు ఇందులో చేయాల‌నుకుంటే చేయొచ్చు. కొంత‌మంది న‌టులు 4 గంట‌లు మాత్ర‌మే ప‌ని చేస్తారు. అది వాళ్ల ప‌ని తీరు' అని న‌టీన‌టుల ప‌ని గ‌తంట‌పై క్లారిటీ ఇస్తూ దీపిక వాద‌న‌ని త‌ప్పుప‌డుతూ సందీప్‌రెడ్డి వంగాని స‌పోర్ట్ చేయ‌డం గ‌మ‌నార్హం.