Begin typing your search above and press return to search.

సందీప్ రెడ్డి వంగ స‌క్సెస్ సీక్రెట్ ఇదే క‌దా?

స్టార్ హీరోల సినిమాలు, బ‌డా ప్రొడ‌క్ష‌న్ కంప‌నీల క‌ల‌యిక‌లో స్టార్ డైరెక్ట‌ర్ సినిమా అంటే దాని గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు.

By:  Tupaki Desk   |   18 Jan 2026 12:33 PM IST
సందీప్ రెడ్డి వంగ స‌క్సెస్ సీక్రెట్ ఇదే క‌దా?
X

స్టార్ హీరోల సినిమాలు, బ‌డా ప్రొడ‌క్ష‌న్ కంప‌నీల క‌ల‌యిక‌లో స్టార్ డైరెక్ట‌ర్ సినిమా అంటే దాని గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. దానికి అడ‌గ‌కుండానే ప్ర‌మోష‌న్ వ‌చ్చేస్తుంటుంది. లీకులూ అదే స్థాయిలో బ‌య‌టికి వ‌చ్చేస్తుంటాయి. అయితే ఇదే స‌మ‌యంలో త‌మ ప్రాజెక్ట్‌ల‌కు సంబంధించిన అప్ డేట్‌ల‌ని అనుకున్న స‌మ‌యానికి అందించే విష‌యంలో మాత్రం భారీ నిర్మాణ సంస్థ‌లు, డైరెక్ట‌ర్లు ఆప‌సోపాలు ప‌డుతుంటారు. కార‌ణం ప‌ర్‌ఫెక్ట్ ప్లానింగ్ లేక‌పోవ‌డం..స‌రైన స‌మ‌యానికి షూటింగ్ షెడ్యూల్స్‌ని పూర్తి చేయ‌లేక‌పోవ‌డం.

ఈ కార‌ణాల వ‌ల్లే సినిమాల రిలీజ్ డేట్‌లు, ఫ‌స్ట్ లుక్ అప్ డేట్‌లు ఆల‌స్యం అవుతూ ఉంటాయి. కార‌ణం స్టార్ హీరో..త‌న డేట్స్‌ని అడ్జెస్ట్ చేయ‌లేని త‌నం.. అనుకున్న విధంగా హీరోని మౌల్డ్ చేసుకోలేక‌పోవ‌డం.. ప్రాజెక్ట్ మొత్తం హీరో చేతుల్లోనే ఉండ‌టం.. త‌ను చెప్పిన‌ట్టే న‌డ‌వ‌డం.. ఇలాంటి కార‌ణాల వ‌ల్ల షూటింగ్ ఆల‌స్యం కావ‌డ‌మే కాకుండా దీనికి సంబంధించిన అప్ డేట్‌లు కూడా అనుకున్న స‌మ‌యానికి రావు అన్న‌ది గ‌త కొన్నేళ్లుగా ఇండ‌స్ట్రీలో జ‌రుగుతూనే ఉంది. అయితే దాన్ని ఇప్పుడో డైరెక్ట‌ర్ బ్రేక్ చేస్తున్నాడు. త‌నే సందీప్ రెడ్డి వంగ‌.

య‌స్.. స్టార్ ఎవ‌రైనా స‌రే.. ప్రొడ‌క్ష‌న్ కంప‌నీ ఏదైనా స‌రే అంతా త‌న చేతుల్లో ఉండాల్సిందే.. ర‌ణ్‌బీర్ క‌పూర్ లాంటి స్టార్ కూడా `యానిమ‌ల్‌` మూవీ టైమ్‌లో సందీప్‌రెడ్డి వంగకు స‌రెండ‌ర్ అయ్యాడంటే అత‌ని టాలెంట్ ఏంటో అర్థం చేసుకోవ‌చ్చు. సినిమాపై ఎన్ని వివాదాలు ఎదురైనా సింగిల్ హ్యాండ్‌తో సందీప్ హ్యాండిల్ చేసిన విధానం, సినిమా ప‌బ్లిసిటీని డిజైన్ చేసిన తీరు బాలీవుడ్ వ‌ర్గాల‌నే విస్మ‌యానికి గురి చేసిందంటే అర్థం చేసుకోవ‌చ్చు. ఇప్పుడు ఇదే ఫార్ములాని, అదే ప్లానింగ్‌ని ప్ర‌భాస్ `స్పిరిట్‌`కి వాడేస్తున్నాడు సందీప్ రెడ్డి వంగ‌.

పాన్ ఇండియా స్టార్ అయినా స‌రే ప్ర‌భాస్‌ని ఒప్పించి తాను అనుకున్న‌ది అనుకున్న టైమ్‌కు వ‌చ్చేలా ప్లాన్ చేసుకుంటున్నాడు. డిసెంబ‌ర్‌లో ఈ మూవీ షూటింగ్ ని ప్రారంభించి రాకెట్ స్పీడుతో పూర్తి చేస్తున్నాడు. ప్ర‌భాస్ లాంటి స్టార్ హీరోతో ఫ‌స్ట్ షెడ్యూల్‌ని కంప్లీట్ చేయ‌డానికి మిగ‌తా వారు ఆప‌సోపాలు ప‌డుతుంటే సందీప్ మాత్రం ప‌ర్‌ఫెక్ట్ ప్లానింగ్‌తో ఫినిష్ చేసి షాక్ ఇచ్చాడు. ప్ర‌భాస్ వ‌రుస ప్రాజెక్ట్‌లు చేస్తూ తీరిక‌లేని షెడ్యూల్‌లో వ‌ర్క్ చేస్తూ ఉన్నా కానీ త‌న‌దైన ప్లానింగ్‌తో ఫ‌స్ట్ షెడ్యూల్‌ని పూర్తి చేసి సందీప్ త‌న టాలెంట్ ఏంటో మ‌రోసారి నిరూపించాడు.

సినిమా స్టార్టింగ్‌కు ముందే డైలాగ్ టీజ‌ర్ విడుద‌ల చేసి ఆస‌క్తిని పెంచాడు. అదే ఊపుతో ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ని విడుద‌ల చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు. రిలీజ్ గురించి ఎవ‌రూ ఆలోచించ‌ని టైమ్‌లో రిలీజ్ డేట్ ప్ర‌క‌టించి ఫ్యాన్స్‌తో పాటు సినీ వ‌ర్గాల‌కు షాక్ ఇచ్చాడు. ప్ర‌భాస్ న‌టించిన సినిమాల‌కు ఇలాంటివి అనుకున్న స‌మ‌యానికి జ‌ర‌గ‌లేదు. కానీ `స్పిరిట్‌`కు మాత్రం ప్ర‌తీదీ అలా అనుకునే లోపే ఇలా జ‌రిగిపోతోంది. ప్ర‌భాస్ ఆలోచించే లోపే సందీప్ బ్యాక్ టు బ్యాక్ అప్ డేట్‌లు ఇచ్చేస్తున్నాడు. దీనంత‌టికీ కార‌ణం సందీప్ ప‌ర్‌ఫెక్ట్ ప్లానింగ్‌. ప్రాజెక్ట్‌పై అత‌నికున్న క‌మాండ్‌..దీని వ‌ల్లే స్పిరిట్ అప్ డేట్‌లు అనుకున్న విధంగా వ‌చ్చేస్తున్నాయి. మూవీని కూడా 2027 మార్చి 5న రిలీజ్ చేస్తున్న‌ట్టుగా సందీప్ ప్ర‌క‌టించ‌డంతో అత‌ని ప‌ర్‌ఫెక్ట్ ప్లానింగే అత‌ని స‌క్సెస్ సీక్రెట్ అని ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు అంటున్నాయి.