హాయ్ నాన్న..సందీప్ మర్చిపోతాడా?
సందీప్‌రెడ్డి వంగ..ఇప్పుడు టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోనూ ఓ రేంజ్‌లో వినిపిస్తున్న పేరిది. దేశ వ్యాప్తంగా `అర్పున్‌రెడ్డి, యానిమల్ మూవీలతో డిఫరెంట్ మేకర్‌గా సంచలనం సృష్టించాడు డైరెక్టర్ సందీప్‌రెడ్డి వంగ.
By: Tupaki Desk | 13 Feb 2026 1:00 AM ISTసందీప్‌రెడ్డి వంగ..ఇప్పుడు టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోనూ ఓ రేంజ్‌లో వినిపిస్తున్న పేరిది. దేశ వ్యాప్తంగా `అర్పున్‌రెడ్డి, యానిమల్ మూవీలతో డిఫరెంట్ మేకర్‌గా సంచలనం సృష్టించాడు డైరెక్టర్ సందీప్‌రెడ్డి వంగ. ఇండియన్ సినిమాల్లో మేకింగ్ పరంగా సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిన సందీప్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా `స్పిరిట్` మూవీని రూపొందిస్తున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. దీని తరువాత `యానిమల్` సీక్వెల్ `యానిమల్ పార్క్`ని తెరపైకి తీసుకురానున్నాడు.
రణ్‌బీర్ కపూర్ హీరోగా, విలన్‌గా రెండు విభిన్నమైన క్యారెక్టర్లతో తన నట విశ్వరూపాన్ని చూపించడానికి రెడీ అవుతున్నాడు. ఈ మూవీ కోసం ఆడియన్స్‌తో పాటు ఫిల్మ్ పెర్సనాలిటీస్, క్రిటిక్స్, సినీ లవర్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దీని తరువాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో ఓ భారీ పాన్ ఇండియా మూవీని చేయబోతున్నాడు. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌ని అధికారికంగా ప్రకటించారు కూడా. ఇలా బ్యాక్ టు బ్యాక్ టైట్ షెడ్యూల్‌తో ఉన్న సందీప్‌రెడ్డి వంగతో ఒక్క సినిమా అయినా సరే చేయాలని టాలీవుడ్ టు బాలీవుడ్ వరకు స్టార్స్ ఎదురుచూస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే రెండేళ్ల క్రితం నేచురల్ స్టార్ నానికి సందీప్‌రెడ్డి వంగ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాడా?..అనే ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. రెండేళ్ల క్రితం అంటే `హాయ్ నాన్న` రిలీజ్ టైమ్‌లో నానిని సందీప్‌రెడ్డి వంగ ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేశాడు. అదే ఇంటర్వ్యూలో సందీప్‌ని కూడా `యానిమల్`కి సంబంధించిన నాని ప్రత్యేకంగా అడగటం జరిగింది. ఇది అప్పట్లో నాని అభిమానులతో పాటు సందీప్ ఫ్యాన్స్‌ని విశేషంగా ఆకట్టుకుంది. అయితే నాని అభిమానులు ఈ వీడియోలో సందీప్‌రెడ్డి వంగ అన్నమాటలని ఇప్పటికీ గుర్తు పెట్టుకున్నారు.
ఆ ఇంటర్వ్యూలో సందీప్‌రెడ్డి వంగ 2010లో నానికి ఓ లవ్‌స్టోరీ చెప్పాలని ట్రై చేసినట్టు చెప్పుకొచ్చాడు. `రైడ్` సినిమా చూసి ఎవరీ హీరో మ్యాడ్యులేషన్ అదిరిపోయింది. మాస్ హీరోకు ఉండే మాడ్యులేషన్ ఉంది గొంతులో ఎక్స్‌ప్రెషన్ అదిరిపోయింది. బాగున్నాడు కదా అనుకున్నానని, నా దగ్గర ఓ మంచి లవ్‌స్టోరీ ఉందని దాన్ని తనతో చేస్తే బాగుంటుందని ఓ ప్రొడ్యూసర్‌కు వినిపించానని, దీనికి హీరో ఎవరంటే నాని అని చెప్పానని, అయితే ప్రొడ్యూసర్ మాత్రం వేరే హీరోని చూడమని నాలుగైదు ఆప్షన్స్ ఇచ్చాడని, అయితే అలా కుదరదని చెప్పి తాను వచ్చేశానన్నాడు.
అదే టైమ్‌లో మోకా అనే కేఫ్‌కు వచ్చేసరికి అక్కడ నాని కనిపించాడని, ఎలాగైనా తనకు తన వద్ద ఉన్న లవ్‌స్టోరీ స్క్రిప్ట్ చెప్పి ఐస్ బ్రేక్ చేయాలనుకున్నానని, అయితే ఓ వ్యక్తి డిస్ట్రబ్ చేయడం, నాని ఫ్రెండ్స్‌తో మంచి ఫ్లోలో ఉండటంతో కలవలేకపోయానని, అయితే ఇప్పటికీ ఆ లవ్‌స్టోరీ తన వద్దే ఉందని చెప్పుకొచ్చాడు. ఆ మాటలు విన్న నాని ఇప్పుడు మనం ఒకరకి ఒకరం తెలిశాం కదా నెక్స్ట్ టైమ్ నాతో సినిమా చేయాలని అనిపిస్తే మాత్రం మిస్సవ్వొద్దని మాట తీసుకున్నాడు. సందీప్ కూడా ఖచ్చితంగా అంటూ మాట ఇచ్చేశాడు. ఇది జరిగి రెండేళ్లు అవుతోంది. `యానిమల్ పార్క్` తరువాతైనా నానికిచ్చిన మాటని మర్చిపోలేదని సందీప్‌రెడ్డి వంగ గుర్తు చేస్తాడా? అన్నది వేచి చూడాల్సిందే. ప్రస్తుతం నాని `ది ప్యారడైజ్` చేస్తున్నాడు. దీని తరువాత సుజీత్ డైరెక్షన్‌లో మరో యాక్షన్ డ్రామాకు రెడీ అవుతున్నాడు. దీని తరువాత సందీప్‌తో కలుస్తాడా? అన్నది కాలమే డిసైడ్ చేయాలి అని ఫ్యాన్స్ అంటున్నారు.
