సందీప్ వంగా కొత్త కార్ చూశారా.. దాని ధర ఎంతంటే?
కొత్తగా కొనుగోలు చేసిన మినీ కూపర్ కార్‌ను పూజలతో బయటకు తీస్తున్న ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
By: Tupaki Desk | 20 Jun 2025 1:23 PM IST'అర్జున్ రెడ్డి', 'కబీర్ సింగ్', 'యానిమల్' లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలతో ప్రేక్షకుల మదిలో హీరో రేంజ్ లో గుర్తింపు అందుకున్నాడు టాలెంటెడ్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. ఇక ప్రస్తుతం తన లైఫ్ స్టైల్‌తో కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. తాజాగా ఈ క్రేజీ డైరెక్టర్ తన గ్యారేజీలోకి కొత్త కారును చేర్చుకున్నారు. అది కూడా యూరప్ బ్రాండ్ అయిన మినీ కూపర్ కావడంతో సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్ అవుతోంది.
కొత్తగా కొనుగోలు చేసిన మినీ కూపర్ కార్‌ను పూజలతో బయటకు తీస్తున్న ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఆడి లాంటివి కాకుండా, స్టైలిష్ లుక్స్ ఉన్న గ్రీన్ షేడ్ కూపర్ మోడల్‌ను ఎంపిక చేసుకున్నట్లు కనిపిస్తోంది. కార్ ముందు భాగంలో పూలతో అలంకరించడం, హారతి కార్యక్రమంలో సతీమణి పాల్గొనడం స్పష్టంగా ఫోటోల్లో కనిపిస్తోంది.
ఈ సందర్భంగా తీసిన పిక్స్‌ను పరిశీలిస్తే.. దాని నంబర్ ప్లేట్ TG09 TR 7395 అని ఉండగా, కార్ ముందు భాగంలో తెల్ల రంగు రంగోలీ డిజైన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వెనుక నుంచి కార్‌ను దర్శించినప్పుడు మెరుస్తున్న దాని మెటాలిక్ గ్రీన్ షేడ్, నలుపు టాప్ మోడల్ కార్ డిజైన్ ఆకట్టుకుంటోంది. సందీప్ వంగా దగ్గరున్న కారు వెర్షన్ 'కూపర్ S' లేదా 'JCW' మోడల్ అయి ఉండే అవకాశం ఉందని అంచనా.
ప్రస్తుతం ఇండియన్ మార్కెట్‌లో మినీ కూపర్ మోడల్స్ ధరలు రూ.42.7 లక్షల నుండి రూ.55.9 లక్షల మధ్య ఉంటాయి. కార్, స్టైల్, క్లాస్ అన్నీ కలిపి ఈ బ్రాండ్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. డైరెక్టర్ వంగా కార్ స్టైల్ చూస్తే దీని ధర దాదాపుగా రూ.50 లక్షలకు పైగానే ఉండే అవకాశం ఉంది. ఇక వంగా ప్రస్తుతం ప్రభాస్ హీరోగా రూపొందే ‘స్పిరిట్’ సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. మరోవైపు తన ‘భద్రకాళి పిక్చర్స్’ ఆఫీస్‌ను హైదరాబాద్‌లో సెటప్ చేశారు. గతంలో మెర్సిడెస్, BMW వంటివి సెలబ్రిటీలకు కామన్ అయితే.. ఈసారి వంగా క్లాసిక్ స్టేట్మెంట్ ఇచ్చాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు.
